హాట్ స్టార్ స్పెషల్స్ దయా వెబ్ సిరీస్ ట్రైలర్ లాంఛ్

Must Read

ఇంట్రెస్టింగ్ కంటెంట్ ను తెలుగు వారికి అందిస్తున్న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ తీసుకొస్తున్న మరో యూనిక్ వెబ్ సిరీస్ దయా. పవన్ సాధినేని ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీఎఫ్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మించింది. ఈ వెబ్ సిరీస్ లో జేడీ చక్రవర్తి, రమ్య నంబీశన్, ఈషా రెబ్బా ప్రధాన పాత్రల్లో నటించారు. దయా వెబ్ సిరీస్ ఆగస్టు 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆదివారం ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను దర్శకుడు కృష్ణవంశీ విడుదల చేశారు. ఈ సందర్భంగా

దర్శకుడు కృష్ణ వంశీ మాట్లాడుతూ – దయా వెబ్ సిరీస్ ట్రైలర్ బాగుంది. ఈ సిరీస్ లోని బ్యాక్ గ్రౌండ్స్, ఎడిటింగ్ ప్యాట్రన్స్, మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. పవన్ కథను ఆకట్టుకునేలా తెరకెక్కించాడు. చక్రికి చాలా రోజుల తర్వాత ఎనర్జిటిక్ క్యారెక్టర్ దొరికింది. ఈషా, విష్ణు ప్రియ క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి. అన్నారు.

నటుడు ఉత్తేజ్ మాట్లాడుతూ – చక్రవర్తి నా క్లోజ్ ఫ్రెండ్. మేము కలిసి హీరోయిన్స్ పోస్టర్స్ చూసేందుకు నగరంలో తిరిగేవాళ్లం. అప్పుడు రంభ మా ఫేవరేట్ హీరోయిన్. ఆమెతో ఆ తర్వాత బొంబాయి ప్రియుడు అనే సినిమా చేశాడు చక్రి. అతనికి సినిమా తప్ప మరో ప్రపంచం తెలియదు. చక్రవర్తి తెలుగు సినిమా అమీర్ ఖాన్. సినిమాలోని అన్ని క్రాఫ్టులపై అతనికి పట్టు ఉంది. దయా సిరీస్ ఎంత బాగుంటే తను ఒప్పుకుని ఉంటాడనేది నేను ఊహించగలను. ఇలాగే హీరోగా నటిస్తూ ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు

జోష్ రవి మాట్లాడుతూ – ఈ సినిమాలో ప్రతి ఒక్కరి క్యారెక్టర్స్ బాగుంటాయి. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన పవన్ గారికి థాంక్స్. జేడీ చక్రవర్తి నాకు ఇష్టమైన హీరో. ఆయన సినిమాలు చిన్నప్పుడు చూశాను. ఇప్పుడు జేడీ గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. అన్నారు.

హీరోయిన్ ఈషా రెబ్బా మాట్లాడుతూ – డైరెక్టర్ పవన్ నాకు ప్రేమ ఇష్క్ కాదల్ సినిమా కథ చెప్పారు. నేను ఈ సినిమాలో నటించడం ఎందుకో కుదరలేదు. అయినా మేము కలిసి ఓ ప్రాజెక్ట్ చేయాలని అనుకునేవాళ్లం. ఈ కథ చెప్పినప్పుడు నా క్యారెక్టర్ చాలా కొత్తగా అనిపించింది. ఇప్పటిదాకా నేను ఇలాంటి నటించలేదు. చాలా సెటిల్డ్ పర్మార్మెన్స్ ఉంటుంది. పవన్ నాతో అలా వర్క్ చేయించారు. దయా మీకు తప్పకుండా నచ్చుతుంది. అని చెప్పింది.

విష్ణు ప్రియ మాట్లాడుతూ – నేను టీవీ షోస్ లో ఎంటర్ టైనర్ ని మాత్రమే అని మీకు తెలుసు. కానీ ఈ వెబ్ సిరీస్ లో ఓ మంచి క్యారెక్టర్ ఇచ్చి నాలోని నటిని చూపించే అవకాశం ఇచ్చారు దర్శకుడు పవన్. నాకు ఇష్టమైన కాస్ట్ తో కలిసి నటించే ‌అవకాశం కూడా ఈ వెబ్ సిరీస్ ద్వారా నాకు దక్కింది. అని చెప్పింది.

నటుడు కమల్ కామరాజు మాట్లాడుతూ – హాట్ స్టార్ లాంటి ఓటీటీలు ఉన్న కాలంలో మేము నటులుగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చాలా మంచి అవకాశాలు మాకు దక్కుతున్నాయి. దయా వెబ్ సిరీస్ లో నటిస్తున్నప్పుడు ఒక సినిమా చేస్తున్న ఫీలింగ్ కలిగింది. అంత మంచి కంటెంట్ ఇందులో ఉంది. అని చెప్పారు.

ఎస్వీఎఫ్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నుంచి అభిషేక్ దాదా మాట్లాడుతూ – మేము తెలుగులో చేస్తున్న తొలి సిరీస్ ఇది. మాకు పూర్తి సపోర్ట్ ఇచ్చిన డైరెక్టర్ పవన్, హీరో జేడీ చక్రవర్తి ఇతర టీమ్ అందరికీ థాంక్స్. మీకు నచ్చే వెబ్ సిరీస్ అవుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.

హీరో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ – గులాబీ సినిమాతో నన్ను హీరోగా చేసిన కృష్ణవంశీ ఈ కార్యక్రమానికి రావాలని నా కోరిక. అలాగే వచ్చాడు. నేను చేస్తున్న తొలి వెబ్ సిరీస్ ఇది. పవన్ ను కలిసినప్పుడు డైరెక్టర్ గా అతనిలో ఒక ప్రామిసింగ్ క్వాలిటీ కనిపించింది. ఫొటో షూట్ దగ్గర నుంచి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తను షూటింగ్ చేశాడు. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ సూపర్బ్ గా ఉంటుంది. కమల్, విష్ణు ప్రియ క్యారెక్టర్స్ సర్ ప్రైజ్ చేస్తాయి. జోష్ రవికి మంచి క్యారెక్టర్ ఉంది. వెబ్ సిరీస్ బాగుంటుంది చూడండి అని మేము పదే పదే చెప్పనక్కర్లేదు. మీకు నచ్చుతుంది. నచ్చితే తప్పకుండా చూస్తారు. అని అన్నారు.

Latest News

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ...

More News