తెలుగు సినిమా పుట్టిన ఆరేళ్ల కు తొలి తెలుగు సినిమా పత్రిక తెలుగు టాకీ వచ్చింది. ఇక అప్పటి నుంచి తెలుగులో ఎన్ని పత్రికలు వచ్చాయి, ఏ ఏ జర్నలిస్టు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేశారు..అనే వివరాల గురించి మూడేళ్లు కృషి చేసి సీనియర్ ఫి ల్మ్ జర్నలిస్ట్ వినాయకరావు అందిస్తున్న పుస్తకం తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర.
ఈ పుస్తకం ఫస్ట్ లుక్ పోస్టర్ ను సూపర్ స్టార్ కృష్ణ, స్టార్ కమెడియన్ బ్రహ్మానందం విడి విడి గా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరో కృష్ణ మాట్లాడుతూ..వినాయకరావు గారు ఇంతవరకూ ఎన్టీఆర్, దాసరి, రామానాయుడు గురించి పుస్తకాలు రాశారు..
నా సినీ జీవిత విశేషాలు, నటించిన చిత్రాల వివరాలతో దేవుడు లాంటి మనిషి పుస్తకం రాశారు. 500 పేజీలతో వెలువడిన ఆ పుస్తకం అందరినీ అలరించింది. ఇప్పుడు సినీ పాత్రికేయుల చరిత్రకు అక్షర రూపం ఇస్తున్నారు. అయన ప్రయత్నం విజయవంతమై, మంచి పేరు తెచ్చి పెట్టాలని ఆశిస్తున్నాను..అన్నారు.స్టార్ కమెడియన్ బ్రహ్మానందం మాట్లాడుతూ. 84 ఏళ్ల సుదీర్ఘమైన పాత్రికేయ చరిత్రని అక్షరాల్లో పెట్టాలని అనుకోవడం సాహసమే. కానీ ఎంతో మంది జీవిత చరిత్రలు రాసిన వినాయకరావు గారికి ఇది సాధ్యమే అవుతుంది. ఈ పుస్తకం ఆయనకు మరింత పేరు తెచ్చి పెట్టాలని ఆశిస్తున్నాను..అన్నారు.వినాయకరావు మాట్లాడుతూ. పాత్రికేయుల చరిత్రను పుస్తక రూపంలో తీసుకు రావాలన్నది నా 15 ఏళ్ల కల.ఇప్పటికీ అది కార్య రూపం దాలు స్తోంది. పుస్తకం రెడీ అయింది. వచ్చే నెల లో విడుదల చేస్తాం అని తెలిపారు
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…