రాధా మమతా ప్రెజెంట్స్, ఎస్.కె. ఆర్ట్స్ బ్యానర్స్ పై దుర్మార్గుడు ఫేమ్ విజయ్ కృష్ణ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం గణా. సుకన్య, తేజు హీరోయిన్స్ గా నటించారు. టాలీవుడ్ ప్రముఖ సీనియర్ డైరెక్టర్ శ్రీ ఎస్వీ క్రిష్ణారెడ్డి ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు.ఈ సందర్భంగా ఎస్వీ క్రిష్ణా రెడ్డి మాట్లాడుతూ..’నేను పుట్టింది తూర్పుగోదావరి జిల్లా..ఇప్పుడు అక్కడి నుంచే మరో వ్యక్తి అతను పేరు కూడా క్రిష్ణారెడ్డే..కాకపోతే విజయ్ క్రిష్ణా రెడ్డి. విజయ క్రిష్ణా రెడ్డి అనే ఒక వ్యక్తి కృషి తో, పట్టుదలతో, దీక్షతో గణా చిత్రాన్ని రూపొందించారు. విజయ్ క్రిష్ణ హీరోగా నటిస్తూ కథ, స్క్రీన్ ప్లే, ప్లస్ డైరెక్షన్ కూడా చేశారు. ఆయనే ప్రొడ్యూసర్ గా కూడా ఈ సినిమాని తీశారు. అన్నీ ఆయనే చేస్తూ సినిమా తీయడమంటూ మామూలు విషయం కాదు. దీనికి ఎంతో సహకారం ఉండాలి..ఎంతో మంది వ్యక్తులు ఇతనికి సహకరించడం వలన సాధ్యపడుతుంది. సినిమా అంటే మాటలు కాదు కదా..కాబట్టి అందరి సహకారంతో ఇతను ఈ సినిమాని నిర్మించగలిగారు.
అందులో ముఖ్యంగా చెప్పాలంటే ఆదిత్యాశేషారెడ్డిగారు, ఫారిన్ నుండి ఎమ్.యు.ఎస్ రెడ్డిగారు, కాకినాడ కార్పొరేటర్ బాల ప్రసాద్ గారు, కర్రి బుచ్చిరెడ్డిగారు ఇలా అందరూ కలిసి ఒక మంచి సినిమా తియ్యాలనే తపనతో మన ముందుకొచ్చారు. నా చేతుల మీదుగా ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా“ అన్నారు.హీరో విజయ్ క్రిష్ణ మాట్లాడుతూ..’ దుర్మార్గుడు మూవీతో నన్నుహీరోగా వంశీగారు పరిచయం చేశారు.ప్రతీ వ్యక్తికీ ఒక ఆదర్శం ఉంటుంది. మాకు అన్నగారు ఎస్వీ క్రిష్ణారెడ్డిగారు ఆదర్శం. ‘గణా’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినందుకు సార్ కి నేనెప్పుడూ రుణపడి ఉంటాను..నా ధన్యవాదాలుతెలుపుకుంటున్నాను..నేను ఇది వరకు దుర్మార్గుడు, గోవిందా భజ గోవింద సినమాల్లో ప్రధాన పాత్రలో చేశాను. పాగల్ వంటి పలు చిత్రాల్లో విలన్ గా కూడా చేశాను. హీరోగా మూడో సినిమా గణా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నేను తొలిసారిగా ఈ గణా చిత్రానికి డైరెక్టర్ గా చేశాను..ఈ సినిమాని నేను ఒక యజ్ఞంలా ప్రారంభించాను.. నా సొంత బ్యానర్ ఎస్.కె.ఆర్ట్స్ లో తొలిసారిగా నిర్మించాను..ఈ సినిమా నిర్మాణంలో సహాయం చేసిన వారందరికీ నా ధన్యవాదాలు..
త్వరలో మా ఎస్.కె ఆర్ట్స్ బేనర్ లో ఈ సినిమా తర్వాత మా డైరెక్షన్ టీం నుండి కొత్త ప్రాజెక్ట్ చేయడానికి సన్నద్ధం అవుతున్నాము’ అని తెలిపారు..కో -డైరెక్టర్ పృథ్వీ మాట్లాడుతూ..’ఈ మూవీకి నేను కో డెరెక్టర్ గా చేశాను. ముందుగా మా గణా మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసిన మన తెలుగు చిత్రసీమ సీనియర్ దర్శకులు ఎస్వీ క్రిష్ణా రెడ్డిగారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. విజయ్ కృష్ణ గారు అన్నీ తానై ఈ సినిమా చేశారు“ అన్నారు.డైరెక్షన్ డిపార్ట్ మెంట్ నుండి శివక్రిష్ణ మాట్లాడుతూ..నాకీ సినిమాలో అవాకశమిచ్చిన హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ విజయ్ క్రిష్ణగారికి నేను చాలా రుణపడి ఉంటాను. గణా సినిమా ఫుల్ లెంత్ యాక్షన్ ఎంటర్టైన్ ఫిలిం. ఈ చిత్రం ఆద్యంతం బోర్ కొట్టకుండా చాలా స్పీడ్ స్క్రీన్ ప్లేతో పరిగెడుతుంది. సాంగ్స్, ఫైట్స్, కామెడీ ఇలా అంతా నవరసభరితంగా ఉంటుంది అన్నారు.సినీ దర్శకుడు రామారెడ్డి పసలపూడి మాట్లాడుతూ..’
గణా సినిమా ఒక పెద్ద హీరో తీయాల్సిన సినిమా..ఒక ప్రభాస్ గారు, ఒక మహేష్బా బుగారు లాంటివాళ్లు చేయాల్సిన సినిమా విజయ్ క్రిష్ణ గారు చాలా అద్భుతంగా చేశారు .ప్రేక్షకులు ఈ సినిమా ఆదరిస్తారని కోరుకుంటున్నాను“ అన్నారు.బాక్సాఫీస్ రమేష్ చందు మాట్లాడుతూ..’విజయ్ క్రిష్ణగారి ‘గణా’ సినిమా పోస్టర్ చాలాబాగుందని, సినిమా కూడా ఇంకా బాగుంటుందినీ, త్వరలో రిలీజ్ కాబోతున్న ‘గణా’ సినిమా ఘనవిజయం సాధించాలనిమనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని తెలిపారు.హీరోగా విజయ్ క్రిష్ణ, హీరోయిన్లుగా సుకన్య, తేజు నటించారు. నాగ మహేష్, ప్రభు, ఛత్రపతి ఫేమ్ జగదీష్ , దత్తు విలన్లుగా చేశారు. సీనియర్ నటుడు హేమ సుందర్, జబర్దస్త్ అప్పారావు, దొరబాబులు ముఖ్య పాత్రల్లో నటించారు.కాగా ఈ చిత్రానికి ఎడిటర్ గా నందమూరి హరి-ఎన్టీఆర్, డీఓపి గా సన్ని చేశారు. చిన్నిక్రిష్ణ సంగీతాన్ని అందించారు. స్టంట్స్ శివరాజ్ మాస్టర్..కో డైరెక్టర్ పృథ్వీ.. చీఫ్ అసియేట్ డైరెక్టర్ దేవర శివక్రిష్ణ .. కొరుమిల్లి. లైన్ ప్రొడ్యూసర్స్ గా బాల ప్రసాద్, ఎమ్.యు.ఎస్.రెడ్డి, కర్రి బుచ్చిరెడ్డి, పిఆర్ఓ. చందు రమేష్.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…