‘హే భగవాన్!’ షూటింగ్ పూర్తి- 2026 లో గ్రాండ్ గా రిలీజ్

సుహాస్, గోపి అచ్చర, బి నరేంద్ర రెడ్డి, త్రిశూల్ విజనరీ స్టూడియోస్ ‘హే భగవాన్!’ షూటింగ్ పూర్తి- 2026 లో గ్రాండ్ గా రిలీజ్

సుహాస్ యూనిక్ స్క్రిప్ట్‌లతో అలరిస్తున్నారు. ప్రస్తుతం నూతన దర్శకుడు గోపి అచ్చర దర్శకత్వంలో  ‘హే భగవాన్!’ సినిమా చేస్తున్నారు. ఈ కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ను త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి. నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు, ఇది వారి ప్రొడక్షన్ నంబర్ 2. రైటర్ పద్మభూషణ్‌ ఫేం షణ్ముక ప్రశాంత్ ఈ కథను రాశారు.

ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్‌ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ లో సస్పెన్స్, కామెడీ అదిరిపోయింది.

తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. చిత్ర బృందం నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక వీడియో అందరినీ ఆకట్టుకుంది.

ఈ చిత్రంలో శివాని నగరం హీరోయిన్ గా నటిస్తున్నారు. డా. నరేష్ వికె, సుదర్శన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి డీవోపీ మహి రెడ్డి పండుగల, సంగీతం వివేక్ సాగర్, ఎడిటర్ విప్లవ్ నిషాదం, ఆర్ట్ డైరెక్టర్ ఎ రామ్ కుమార్.

‘హే భగవాన్’ 2026 లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

తారాగణం: సుహాస్, శివాని నగరం, నరేష్, సుదర్శన్, అన్నపూర్ణమ్మ, తదితరులు
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: గోపీ అచ్చర
నిర్మాత: బి నరేంద్ర రెడ్డి
బ్యానర్: త్రిశూల్ విజనరీ స్టూడియోస్
డీవోపీ: మహి రెడ్డి పండుగల
సంగీతం: వివేక్ సాగర్
ఎడిటర్: విప్లవ్ నిషాదం
ఆర్ట్ డైరెక్టర్: ఎ రామ్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రమణారెడ్డి
రచయిత: షణ్ముఖ ప్రశాంత్
PRO: వంశీ శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

TFJA

Recent Posts

మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “చిరంజీవి” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా "చిరంజీవి". ఈ చిత్రంలో తనికెళ్ల భరణి,ఈశ్వరీ రావు, గోపరాజు రమణ,శ్రీకాంత్…

7 hours ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 day ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

5 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

5 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago