మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్ లో శంకర్ చేగూరి దర్శకత్వంలో రూపొందున్న హిలేరియస్ ఎంటర్టైనర్ ‘బద్మాషులు’. తార స్టొరీ టెల్లర్స్ బ్యానర్ పై బి. బాలకృష్ణ, C.రామ శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుండి లోకం మారిందా సాంగ్ ను హీరో నవీన్ చంద్ర విడుదల చేశారు.
ఈ సందర్భంగా నవీన్ చంద్ర మాట్లాడుతూ….
బద్మాషులు టీజర్ హిలెరియస్ గా ఉంది, లోకం మారిందా సాంగ్ కూడా చాలా క్యాచీగా ఉంది, తేజ కూనూరు సంగీతం అందించారు, దివ్య మాలిక పాడిన ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నాను, జూన్ 6న విడుదల కాబోతున్న బద్మాషులు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ పాత్రలు విశేషంగా, రూరల్ రూటెడ్ కథ, కథనం, కామెడీ చాలా ఆర్గానిక్ గా ఈ చిత్రాల్లో ఉండబోతున్నాయి, డైరెక్టర్ శంకర్ చేగూరి టేకింగ్ చాలా రిఫ్రెషింగ్ గా అన్ని వర్గాల ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా ఉండబోతోంది. జూన్ 6న ఈ చిత్రాన్ని దీపా ఆర్ట్స్ థియేటర్స్ లో విడుదల చెయ్యబోతోంది.
ఇది మన ఊరి కథ అనే విధంగా ఈ చిత్రంలో పాత్రలు చాలా సహజంగా ఉంటాయి, డైరెక్టర్ శంకర్ చేగూరి వంద శాతం జనాలను రెండు గంటలు నవ్వించాలి అనే ఉద్దేశ్యంతో బద్మాషులు చిత్రాన్ని తెరకెక్కించారు.
ప్రామిసింగ్ కథానాయకుడు సుహాస్, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్ ఎంటర్‌టైనర్ 'హే బల్‌వంత్'. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్…
‘లిటిల్‌హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’, ‘ఈషా’ వంటి బ్లాక్‌బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్ ద్వయం తాజాగా…
సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రమేష్ ఎగ్గిడి - శ్రీకాంత్ మొగదాసు - చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న…
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. ‘రెక్కీ’,…
హీరో సత్యదేవ్ తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. సత్యదేవ్ నటిస్తున్న 15వ చిత్రమిది. ఈ చిత్రాన్ని త్రిశూల్ విజినరీ…