లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా “జయహో రామానుజ”. ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా..సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ నెల 24న “జయహో రామానుజ” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
హీరో, డైరెక్టర్ లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ – సినిమా ఇండస్ట్రీలో పాతికేళ్ల ప్రయాణం నాది. మా మొదటి సినిమా హీరో సుమన్ గారు. ఆయన ఇప్పటికీ అలుపెరుగక సినీ ప్రయాణం చేస్తున్నారు. “జయహో రామానుజ” చిత్రంలో మంచి క్యారెక్టర్ చేశారు. ఆధ్యాత్మిక విప్లవకారుడు రామానుజాచార్యుల జీవిత కథతో ఈ సినిమాను ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి రూపొందించాం. గొప్ప సినిమాలను ప్రజలు తండోపతండాలుగా థియేటర్స్ కు వెళ్లి చూస్తుంటారు. మా సినిమాకు కూడా అలాంటి ఆదరణే దక్కుతుందని నమ్ముతున్నాం. ఈ సినిమాను డబ్బుల కోసం రూపొందించలేదు. రామానుజాచార్యుల వారి గొప్ప కథను ఈ తరం వారికి చూపించాలని ప్రయత్నించాం. టెక్నికల్ గా మంచి క్వాలిటీతో మా సినిమా ప్రేక్షకుల ముందుకు ఈ నెల 24న తీసుకొస్తున్నాం అన్నారు.
నటి, ప్రొడ్యూసర్ ప్రవళ్లిక మాట్లాడుతూ – “జయహో రామానుజ” సినిమాను నిర్మించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. అందుకు మా నాన్న గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాలో నిర్మాణ బాధ్యతల వహిస్తూనే పాటు కృష్ణుడు, నారదుడు, రఘునాథస్వామి పాత్రల్లో నటించాను. ఈ తరం ప్రేక్షకులకు రామానుజాచార్యుల వారి గొప్పదనం తెలియాలి. ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని నమ్మి ఈ సినిమాను నిర్మించాం అన్నారు.
నటుడు సుమన్ మాట్లాడుతూ – ఈ సినిమా గురించి సాయి వెంకట్ గారు చెప్పినప్పుడు చాలా కష్టంతో కూడుకున్న మూవీ కదా అన్నాను. ఆయన మేము ఈ సినిమాను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఆయన చాలా కన్విక్షన్ తో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేసే అవకాశం దక్కింది. మన దేశంలో ఎన్నో మతాలు, కులాలు, వర్గాలు ఉన్నాయి. అయినా మనమంతా కలిసే ఉంటున్నాం. ఈ భావనకు మొదట కృషి చేసింది రామానుజాచార్యులవారు. మనమంతా ఒక్కటే అని ఆయన చెప్పిన గొప్ప మాటలు మనల్ని ఇప్పటికీ ఐక్యంగా నడిపిస్తున్నాయి. ఈ సినిమా మీ ఫ్యామిలీతో కలిసి సంతోషంగా చూడండి. రామానుజాచార్యులవారి గొప్పదనం తెలుసుకోండి అన్నారు.
నటీనటులు – లయన్ సాయి వెంకట్, జో శర్మ, సుమన్, ప్రవళ్లిక అశ్వాపురం వేణుమాధవ్, అప్పం పద్మ, తదితరులు
టెక్నికల్ టీమ్
ప్రెజెంట్స్ : సుదర్శనం హేమలత
బ్యానర్ : సుదర్శనం ప్రొడక్షన్స్
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టన్ : లయన్ సాయి వెంకట్
నిర్మాతలు : సుదర్శనం సాయి ప్రసన్న, సుదర్శనం ప్రవళ్లిక
పి.ఆర్.ఓ : చందు రమేష్
ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా…
"యంగ్ అండ్ డైనమిక్", "మా రాముడు అందరివాడు" వంటి పలు హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన డైనమిక్ హీరో శ్రీరామ్…
'నవరసరాయ' డా. నరేష్ విజయ కృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి…
లోమేష్ పుడిపెద్ది హీరోగా, జయశ్రీ హీరోయిన్గా, ప్రణీత పట్నాయక్, విజ్ఞానిలు ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'డ్యూ డేట్' వరిష్ స్టూడియోస్…
హైదరాబాద్ నగర వాసులకు రుచితో పాటు సరికొత్త వాతావరణంలో హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్ గ్రాండ్ ఓపెనింగ్…
‘ప్రేమ్ కీటను’ సినిమాతో నటిగా పరిచయమైన ఆఫియా సయ్యద్, ఇప్పుడు ‘అలియాస్ రుక్మిణి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.…