లోమేష్ పుడిపెద్ది హీరోగా, జయశ్రీ హీరోయిన్గా, ప్రణీత పట్నాయక్, విజ్ఞానిలు ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘డ్యూ డేట్’ వరిష్ స్టూడియోస్ పతాకంపై పవన్ తరిగోపుల, ఏలూరు శ్రీను నిర్మాతలుగా ఆనంద్.కె. దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవల ఘనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో ఏకధాటిగా జరుగుతోంది. ఈ షెడ్యూల్లో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కాగా ఇటీవల కమెడియన్ కృష్ణభగవాన్ ‘డ్యూ డేట్’ షూటింగ్లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. చాలా కాలం విరామం తరువాత కృష్ణ భగవాన్ ఈ చిత్రంలో ఓ మంచి పాత్రను పోషిస్తున్నాడు. ఆయన పాత్ర ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుంది. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్లో నటుడు సునీల్ జాయిన్ అయ్యాడు. ఈ చిత్రంలో సునీల్ ఓ లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. ఆయన కెరీర్ల్ ఇదొక డిఫరెండ్ పాత్రగా ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ఈ చిత్రంలో నటుడు సునీల్ పవర్ఫుల్ లాయర్ శేఖర్ చంద్రగా కనిపించబోతున్నాడు. ఆయన పాత్ర సినిమా పెద్ద ఎస్సెట్గా ఉంటుంది. ప్రజెంట్ బర్నింగ్ ఇష్యూ ఆధారంగా అల్లుకున్న ఈ కమర్షియల్ కోర్ట్ రూమ్ డ్రామా ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఉంటుంది. ప్రతి మనిషి, ప్రతి నెలా గుర్తుపెట్టుకునే డ్యూ డేట్ చుట్టు పూర్తి వాణిజ్య అంశాలతో అల్లుకున్న కథ ఇది. టైటిల్ దగ్గర నుంచి సినిమాలోని ప్రతి అంశం ప్రేక్షకులకు కొత్తదనంతో పాటు పూర్తి సంతృప్తిని కలిగించే కథ, కథనాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఈ సినిమా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ను అందించండతో పాటు అందర్ని ఆలోచింపజేస్తుంది. హృదయాలకు హత్తుకుంటుంది’ అన్నారు.
లోమేష్ పుడిపెద్ది, జయశ్రీ, ప్రణీత పట్నాయక్, విజ్క్షాని, సునీల్ కృష్ణ భగవాన్,అక్షర గౌడ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: జవ్వాడి నాయుడు, మాటలు: హరీష్ మీనన్, ఎడిటర్: సత్య గిడుటూరి, డీఓపీ: చెంచు జింక, నిర్మాతలు పవన్ తరిగోపుల, ఏలూరు శ్రీను, దర్శకత్వం: ఆనంద్.కె.
ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా…
"యంగ్ అండ్ డైనమిక్", "మా రాముడు అందరివాడు" వంటి పలు హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన డైనమిక్ హీరో శ్రీరామ్…
'నవరసరాయ' డా. నరేష్ విజయ కృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి…
లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా "జయహో రామానుజ". ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ లో…
హైదరాబాద్ నగర వాసులకు రుచితో పాటు సరికొత్త వాతావరణంలో హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్ గ్రాండ్ ఓపెనింగ్…
‘ప్రేమ్ కీటను’ సినిమాతో నటిగా పరిచయమైన ఆఫియా సయ్యద్, ఇప్పుడు ‘అలియాస్ రుక్మిణి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.…