హైదరాబాద్ నగర వాసులకు రుచితో పాటు సరికొత్త వాతావరణంలో హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్ గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది. టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల చేతుల మీదుగా హియ్య వారి ఐదవ బ్రాంచ్ గా హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో ఘనంగా ప్రారంభం అయింది. పిల్లలు, పెద్దలతో పాటు అందరిని ఆకర్షించే అద్భుతమైన వాతావరణంతో ఈ రెస్టారెంట్ అందరిని ఆకర్షిస్తుంది. నింగిని తలపించే రెస్టారెంట్ చూడగానే ఆకర్షిస్తోంది.
ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ.. హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈవెంట్ కు ఆహ్వానించిన గౌతమి చౌదరి, గౌతమ్, విక్రంత్ లకు ధన్యవాదములు తెలిపారు. హైదరాబాద్ అంటేనే అనేక రకాల రుచులకు అడ్రస్ అని చెప్పారు. అలాంటిది హియాస్పేస్ మండితో మరొక కొత్త రుచి హైదరాబాద్ ఫుడ్ లిస్టులో ఆడ్ అయింది అన్నారు. గౌతమి చౌదరి తో మాట్లాడినప్పుడు ఫ్రెండ్స్ గా మొదలైన వీరి జర్నీ ఎలా విజయవంతంగా ముందుకు దూసుకెళ్తుందో తెలిసింది అన్నారు. ఇలా బ్రాంచెస్ పెంచుకుంటూ పోతూ ఆహార ప్రియులకు మంచి రుచులను అందించాలని కోరారు. రెస్టారెంట్ వాతావరణం చాలా ఆకట్టుకుందని, ఫ్యామిలీతో ఇక్కడికి వస్తే ప్రపంచాన్ని మర్చిపోవచ్చు అనే అంతలా చాలా ఆహ్లాదకరంగా ఉంది అని పేర్కొన్నారు. హియ్య స్పేస్ మండిలో ప్రత్యేకత వెజ్ మండి అని చెప్పారు. ఇక్కడ గుత్తొంకాయ మండి చాలా ఫేమస్ అని కచ్చితంగా ట్రై చేయాల్సిందే అంటూ తెలిపారు.
గౌతమి చౌదరి మాట్లాడుతూ.. హియ్య స్పేస్ మండి ప్రారంభోత్సవానికి వచ్చిన మీడియా మిత్రులకు, సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ కు ధన్యవాదాలు తెలిపారు. బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల చేతుల మీదుగా తమ ఐదవ బ్రాంచ్ హియ్య స్పేస్ మండి లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మల్టిపుల్ థీమ్స్ తో వస్తున్న మమ్మల్ని ఎంత ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే హైదరాబాదులో ఫారెస్ట్ థీమ్, డైనోసార్ థీమ్ చూసాము ఇప్పుడు కొత్తగా స్పేస్ థీమ్ తో వస్తున్నాము. ఐదు సంవత్సరాల నుంచి 95 సంవత్సరాల వరకు ఉన్న చాలామందికి స్పేస్ ఫాంటసీ ఉంటుంది. అలాంటి వారి కోసమే ఈ కొత్త డిజైన్ తో సరికొత్త రుచులను అందిస్తున్నామని తెలిపారు.
అలాగే ఇక్కడ తయారుచేసే వెజ్ మండిని చాలా జాగ్రత్తగా, శుభ్రంగా చేస్తామని తెలిపారు. నాన్ వెజ్ కి సంబంధించి ఏ ఒక్క ఐటెం కూడా ఇందులో కలపకుండా జాగ్రత్త పాటిస్తున్నట్టు వెల్లడించారు. ఇక క్రాబ్ బండి కూడా చాలా బాగుందని, ఆహార ప్రియులకు మరింత నచ్చుతుందని వివరించారు. ఈనెల 22న మరొక కొత్త బ్రాంచ్ ఓపెన్ అవుతుందని అన్ని బ్రాంచ్ లను ఆదరించినట్టుగానే ఆ బ్రాంచ్ కూడా ప్రజల ఆదరణ దక్కుతుందని తెలిపారు.
గౌతమ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ అంటేనే క్రియేటివిటీ అని అందుకే సరికొత్త థీమ్స్ తో హైదరాబాదులో హియ్య మండి బ్రాంచ్ లను ప్రారంభం చేస్తున్నట్టు తెలిపారు. ఈరోజు శ్రీలీల చేతుల మీదుగా ఈ మండి ప్రారంభం కావడం మా అదృష్టమని, కచ్చితంగా మా ఫుడ్ మీకు మరింత నచ్చుతుందని తెలిపారు. హియ్య స్పేస్ మండి ప్రారంభోత్సవానికి వచ్చిన మీడియా మిత్రులకు, సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ కు ధన్యవాదాలు తెలిపారు. భోజన ప్రియులు కచ్చితంగా అమీర్పేటలో ఉన్న హియ్య స్పేస్ మండిని ఒక్కసారి సందర్శించి రుచి చూడాలని కోరారు.
విక్రాంత్ మాట్లాడుతూ.. మండి అంటే కేవలం చికెన్, మటన్ మాత్రమే కాదు ఫిష్, క్రాబ్ ఇష్టపడే వారికి మా మండిని మరింత ప్రత్యేకత అని పేర్కొన్నారు. అలాగే శాకాహారుల కోసం గుత్తొంకాయ మండిని స్టార్ట్ చేసినట్టు వెల్లడించారు. చిన్న పెద్ద అందరికీ నచ్చేలా మంచి వాతావరణంలో హియ్య స్పేస్ మండిని లాంచ్ చేయడం.. అది హీరోయిన్ శ్రీ లీల చేతుల మీదుగా లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
‘ప్రేమ్ కీటను’ సినిమాతో నటిగా పరిచయమైన ఆఫియా సయ్యద్, ఇప్పుడు ‘అలియాస్ రుక్మిణి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.…
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు.…
తమ చిత్రం #Ranabaali విడుదలకు ముందు స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమిళనాడు ముఖ్యమంత్రి, థళపతి విజయ్ను…
దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై గుణి మంచికంటి దర్శకుడిగా వేణు దోనేపూడి నిర్మించిన చిత్రం ‘బా బా బ్లాక్…
కృష్ణ కమల్ , మహి హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న రూరల్ కామెడీ డ్రామా ‘జో జో’. రాయలసీమ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతోన్న…
నటిగా సూపర్ హిట్ సినిమాల్లో నటించిన అనన్య నాగళ్ల నూతనంగా హిడి పేరుతో కేవలం మహిళలకు ఉపయోగపడేలా క్లోతింగ్ బిజినెస్…