Ramarao On Duty Teaser | Ravi Teja, Divyansha , Rajisha | Sarath Mandava | Sudhakar Cherukuri

Presenting you the Teaser of Ramarao on Duty Movie written and directed by Sarath Mandava. Produced by Sri Lakshmi Venkateswara Cinemas and RT Team Works, Starring Ravi Teja, Divyansha Kaushik and Rajisha Vijayan.

GAMA అవార్డ్స్ 2025 – 5వ ఎడిషన్ గ్రాండ్ రివీల్ ఈవెంట్

Must Read

ఫిబ్రవరి 16, 2025న GAMA (Gulf Academy Movie Awards) అవార్డ్స్ 2025, 5వ ఎడిషన్ గ్రాండ్ రివీల్ ఈవెంట్ అజ్మాన్, దుబాయ్‌లోని మైత్రి ఫార్మ్‌లో ఘనంగా నిర్వహించబడింది. ఈ ప్రత్యేకమైన వేడుకకు దుబాయ్‌లోని 500 మందికి పైగా తెలుగువారు హాజరయ్యారు. వీరితో పాటు తెలుగు కళా, సంగీత ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని, GAMA ప్రాముఖ్యతను ఉద్ఘాటించారు.

మొట్టమొదటి సరిగా, సరికొత్తగా, వినూత్నంగా ఈ గ్రాండ్ రెవీల్ ఈవెంట్ నిర్వహించబడింది.

ప్రత్యేక హైలైట్స్
⁠ఈ వేడుకలో GAMA Organizing commitee మరియు ప్రముఖ గాయకుడు శ్రీ రఘు కుంచె సమక్షంలో ఈవెంట్ Date & Venue మరియు జ్యూరీ కమిటీని అధికారికంగా ప్రకటించారు. GAMA అవార్డ్స్ 2025, 5వ ఎడిషన్ తేదీ (జూన్ 7, 2025) దుబాయ్ షార్జా ఎక్స్పో సెంటర్లో నిర్వహించబోతున్నారు.
జ్యూరీ చైర్ పర్సన్స్ ప్రముఖ సినీ దర్శకులు – శ్రీ ఏ. కొదండ రామిరెడ్డి , ప్రముఖ సంగీత దర్శకులు – శ్రీ కోటి , మరియు ప్రముఖ సినీ దర్శకులు – శ్రీ బి. గోపాల్ వారి ఆధ్వర్యంలో వివిధ రంగాలకు ఎంపిక అయిన టాలీవుడ్ కళాకారులకు, సినిమాలకు GAMA అవార్ద్స్ బహుకరించబడతాయి.

⁠ఈ ప్రత్యేకమైన వినూతన రీతిలో సృజనాత్మకమైన  ప్రెజెంటేషన్ ద్వారా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూ అందరికీ అద్భుత అనుభూతిని కలిగించేలా అనౌన్స్‌మెంట్‌ను చేసారు.
⁠GAMA AWARDS చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త  "శ్రీ కేసరి త్రిమూర్తులు గారు" మాట్లాడుతూ, గత నాలుగు ఎడిషన్లు ఘనంగా పూర్తి చేసుకున్న GAMA, ఇప్పుడు 2025 జూన్ 7న జరగబోయే 5వ ఎడిషన్ కు ప్రముఖ సినీ పెద్దలను,కళాకారులను విశిష్ట అతిధులుగా  ఆహ్వానించ దలిచారని UAE లోని  తెలుగు ప్రజలకు ప్రత్యేక వినోదాన్ని అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న తెలుగు సినీ ప్రముఖులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు మరియు  UAE ఈ  కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతితెలుగు వారికి ధన్యవాదములు తెలియజేసారు. 

⁠GAMA AWARDS CEO "సౌరభ్ కేసరి" మాట్లాడుతూ GAMA అవార్ద్స్ కు వినూత్నంగా అత్యంత వినోదభరితంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేసారు. వివిధ రానగలకు చెందిన ప్రముఖులను గుర్తించి వారికి THE GAMA EXCELLENCE AWARDS ఇచ్చి సత్కరించనున్నారని తెలియజేసారు.  ఇప్పటికే సినీ ప్రముఖులను ఆహ్వానించడం జరిగిందని తెలియజేసారు.  నామినేటెడ్ అయిన విభాగాలకు, పబ్లిక్ ఓటిండింగ్ ప్రక్రియ కూడా నిర్వహిస్తామని తెలియజేసారు.      

ఇతర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను గుర్తించేందుకు GAMA అవార్డ్స్ ఎంత ముఖ్యమైన వేదికగా నిలుస్తుందో వివరించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగు వారందరు GAMA అవార్ద్స్ 2025, విజవంతంగా నిర్వహించాలని శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగు వారందరు ఇంత అద్బుతమైన ఇటువంటి కార్యక్రమం UAE లో జరగడం తెలుగు వారందకీ చాలా గర్వముగా ఉందని వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు.

ప్రముఖుల సందేశాలు :
ఈ కార్యక్రమానికి జ్యూరీ సభ్యులుగా ఉన్న శ్రీ ఏ. కొదండ రామిరెడ్డి (దర్శకుడు), శ్రీ కోటి (సంగీత దర్శకుడు), శ్రీ బి. గోపాల్ (దర్శకుడు) ప్రత్యేకంగా పంపిన వీడియో సందేశాలు పంపించారు. వీరి సందేశంలో.. ప్రతి ఒక్కరూ GAMA గొప్పతనాన్ని, కళాకారుల ప్రతిభకు అందించే ప్రోత్సాహాన్ని గురించి వెల్లడించారు.

కుంచె రఘు గారు మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీ లో నాలాంటి కళాకారులు ఎందరో ఆసక్తిగా ఎదురు చూసే ఈవెంట్ ఈ GAMA ఈవెంట్ అని అన్నారు. GAMA తో మాకు చాలా మంచి అనుబంధం ఉందని అన్నారు. మా కళా కారుల అందరిని మంచి వసతులు ఇచ్చి చాలా బాగా చూసుకుంటారు అని చెప్పారు.

వినోదాన్ని పంచిన సంగీత వేదిక :
ఈ వేడుకలో యాంకర్ & సింగర్ తిరు మరియు శరణ్య తమ చక్కటి ప్రదర్శనలతో వచ్చిన అతిధులను ఆకట్టుకున్నారు. సంగీత ప్రదర్శనలతో పాటు, ప్రత్యేకమైన వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడంతో, హాజరైన ప్రతి ఒక్కరూ ఈ ఈవెంట్‌ను ఎంతో ఉత్సాహంగా ఆస్వాదించారు. MAGICIAN RAVI వారి వినూత్న మాయాజాలంతో GAMA అవార్ద్స్ 2025, REVEAL చెయ్యడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అంతా ఎదురుచూస్తున్న భారీ ఈవెంట్!
GAMA అవార్డ్స్ 2025 మెయిన్ ఈవెంట్ జూన్ 7, 2025న అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనుంది! ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీత, కళా రంగ ప్రముఖులు, ప్రతిభావంతులు, సినీ పరిశ్రమకు చెందిన లెజెండ్స్ ఈ గామా అవార్డ్స్ 2025 లో పాల్గొననున్నారు.
అవార్డ్స్, సంగీత ప్రదర్శనలు, అంతర్జాతీయ స్థాయి వినోద కార్యక్రమాలతో GAMA 2025 తెలుగు ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందించేందుకు సిద్ధంగా ఉంది!

మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి… ఆసక్తిగా ఎదురుచూడండి!

GAMA 2025 – సంగీత, కళా ప్రపంచానికి గౌరవ వేదిక!

Latest News

దళపతి విజయ్ ‘జన నాయగన్’ జనవరి 9, 2026న విడుదల

దళపతి విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’ జనవరి 9, 2026న విడుదల కాబోతోందని మేకర్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం...

More News