“కాంతార” చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నప్రేక్షకులకు

హోంబలే ఫిలింస్ పతాకంపై ‘కెజియఫ్’ వంటి పాన్ ఇండియా హిట్ చిత్రాన్నినిర్మించిన విజయ్ కిరగందూర్ నిర్మించిన తాజా చిత్రం “కాంతార”.రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో  కిషోర్ కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుమినాడు తదితరులు నటించారు.ఈ చిత్రం కన్నడ వెర్షన్ లో సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రం తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో అక్టోబర్ 15న ఈ చిత్రం  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ మాదిరిగానే తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం సంచలనం సృష్టిస్తుంది. మొదటి రోజు 1.95 కోట్ల గ్రాస్ ను సాధించిన ఈ చిత్రం నేడు 20 కోట్లు గ్రాస్ ను సాధించింది. ఒక చిత్రం కేవలం మౌత్ టాక్ తో ఈ స్థాయిలో విజయం అవ్వడం అనేది అరుదైన విషయం..కన్నడలో భారీ విజయం సాధించిన ఈ సినిమాను,ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ “గీతా ఫిల్మ్ డిస్ట్ బ్యూషన్” ద్వారా తెలుగులో రిలీజ్ చేశారు. కన్నడలో 17 రోజుల కలెక్షన్స్ ను తెలుగులో కేవలం రెండు రోజుల్లోనే కొల్లగొట్టింది “కాంతార’ చిత్రం.ఇప్పుడు తెలుగు రాష్ట్రలలో సంచలనం సృష్టిస్తుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది

ప్రముఖ  నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మేము రిలీజ్ చేసిన “కాంతార” చిత్రాన్ని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు.ఈ సినిమా ఎం ప్రూవ్ చేసింది అంటే సినిమాకు లాంగ్వేజ్ బ్యారియర్ లేదు కానీ ఎమోషన్ బ్యారియర్ ఒకటే మాత్రమే ఉంటుంది..ఏ ఎమోషన్ లో సినిమా తీశారో ఆ ఎమోషన్ కు కనెక్ట్ అయ్యి చేశారు.ఈ కథను ఇంగ్లీష్ నుండో, యూరోపియన్ నుండో, కొరియన్ నుండో చూసి రాసుకున్న కథ కాదు వారి ఊరిలో జరిగిన కొన్ని విశేషాలను తీసుకొని రాసుకున్న కథ, ఆ ఎమోషన్ కూడా ఈయనకు మట్టిలో నుండి పుట్టిన కథ ద్వారా ఫీల్ అయ్యి చాలా చక్కగా తీశారు. బన్నీ వాసు వచ్చి నన్ను అర్జంట్ గా ఈ సినిమా చూడమంటే కన్నడలో చూశాను.ఈ సినిమా చూసిన తర్వాత విష్ణు తత్వం, రౌద్ర  రూపం ఇవన్నీ కలపి వైజాగ్ దగ్గర ఉన్న మన సింహాచలంకు దగ్గరగా ఉన్న కథ అనిపించింది. ఈ సినిమాలో హీరో ఎమోషన్స్ కు ఫీల్ అయ్యి  అద్భుతంగా నటించాడు అనే దానికంటే  జీవించాడు అని చెప్పవచ్చు.

 అజనీష్  లోకనాథ్  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది.  జనరల్  గా నేను డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేసేది చాలా తక్కువ . ఈ సినిమా చూసిన తరువాత ఇందులోని ఎమోషన్స్ కు, హీరో పెర్ఫార్మన్స్ కు ముగ్దున్ని అయ్యి ఈ సినిమాకు కనెక్ట్ అయ్యాను.ఈ ఏమోషన్స్ తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను ఒక అవకాశంగా తీసుకొని  గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్” ద్వారా తెలుగులో రిలీజ్ చేయడం జరిగింది. అనుకున్నట్టే థియేటర్స్ లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడిని ఈ సినిమా కట్టిపడేస్తుంది.అన్ని చోట్ల  నుండి ఊహించని రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది .డిఫరెంట్ ఫిలిం కావాలనుకునే వారికి “కాంతారా” సినిమా కచ్చితంగా నచ్చుతుంది. త్వరలో రిషబ్ శెట్టి మా గీతా ఆర్ట్స్ లో సినిమా చేయడానికి ఒప్పు కున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.చిత్ర హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి మాట్లాడుతూ..మా “కాంతార”  సినిమాను అగ్ర నిర్మాత అల్లు అరవింద్ గారు షార్ట్ టైమ్ లో “గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్” ద్వారా తెలుగులో  రిలీజ్ చేయడంతో రిలీజైన ప్రతిచోటా తెలుగు  ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

ఇందుకు సహకరించిన రామారావు గారికి ధన్యవాదాలు. ఈ సినిమా నాకు మంచి ఎనర్జీ నిచ్చింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదని తెలుగు ప్రేక్షకులు నిరూపించారు. మూడు రోజుల్లో 20 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి.ఇంత విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదములు. చిన్నప్పటి నుండి ఇక్కడ జరిగే విషయాలను చూస్తూ పెరిగాను. వారాహ రూపం అనేది విష్ణు మూర్తికి కనెక్ట్ అవుతుంది. కనుక  దాంతో మా కల్చర్ కు ఎమోషన్స్ జోడించి ఈ సినిమా చెయ్యడం జరిగింది. మా కాంతార చిత్రం  ద్వారా  మాకింత పెద్ద విజయాన్నిచ్చిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు.రామారావు.. చాలా షార్ట్ టైమ్ లో కాంతార సినిమాను ఇన్ని థియేటర్స్ లలో రిలీజ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా సినిమాను ఆదరించి విజయం  చేకూర్చిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు.నటుడు ప్రమోద్ శెట్టి మాట్లాడుతూ..తెలుగులో ఇంతటి పెద్ద ఆదరణ లభించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మంచి సినిమాలో నేను పార్ట్ అయ్యేలా చేసిన దర్శక, నిర్మాతలకు  ధన్యవాదాలు  అన్నారు.

హీరోయిన్  సప్తమి గౌడ మాట్లాడుతూ..లీలపాత్రలో నన్ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదములు అన్నారు.ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు  ధన్యవాదాలు అన్నారు.లిరిక్ రైటర్ రాంబాబు గోశాల మాట్లాడుతూ..చాలామంది  ఈ సినిమా లోని పాటలు  అచ్చమైన తెలుగు పాటలు లాగే వున్నాయి అంటున్నారు. ఇండియా వైడ్ ఈ సినిమా బిగ్ హిట్ అయ్యినందుకు చాలా హ్యాపీగా ఉందని అన్నారు.

నటీనటులు –
రిషబ్ శెట్టి, కిషోర్ కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుమినాడు, మానసి సుధీర్, శనిల్ గురు, దీపక్ రాయ్ పనాజే తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్ : హోంబలే ఫిల్మ్స్
నిర్మాత – విజయ్ కిరగందూర్
దర్శకుడు – రిషబ్ శెట్టి
సినిమాటోగ్రాఫర్ – అరవింద్ ఎస్ కశ్యప్
ఎడిటర్ – ప్రతీక్ శెట్టి, కె ఎం ప్రకాష్
సంగీతం – అజనీష్ లోకనాథ్
పంపిణీ – గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్
పి. ఆర్ ఓ : ఏలూరు శ్రీను, మేఘా శ్యామ్

Tfja Team

Recent Posts

మహేష్ విట్ట ‘’ఉత్తుత్త హీరోలు‘’ చిత్రానికి బెస్ట్ విషెస్ తెలిపిన హీరో ప్రదీప్ మాచిరాజు

‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…

11 hours ago

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ బోలెడన్ని ట్విస్టులతో ఉంటుంది.. ఏ ఒక్కరినీ నిరాశపర్చదు.. గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…

2 days ago

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) కి యువ నిర్మాత వంశీ నందిపాటి విరాళం

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…

2 days ago

మార్చి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ”ఓం శాంతి శాంతి శాంతిః”

సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…

2 days ago

బుక్ మై షోలో 100కె టికెట్ బుకింగ్స్ క్రాస్ చేసిన బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ మూవీ “కపుల్ ఫ్రెండ్లీ”

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…

2 days ago

మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…

2 days ago