*”సఃకుటుంబానాం” చిత్రాన్ని కుటుంబసభ్యులతో కలిసి చూసి ఆచరించడం సంతోషకరం : సఃకుటుంబానాం సక్సెస్ మీట్ లో నటకిరీటి రాజేంద్రప్రసాద్*



హెచ్ ఎన్ జి సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై ఉదయ్ శర్మ రచన దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మాతలుగా నేడు ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సఃకుటుంబానాం. రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు కీలకపాత్రలో పోషిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా మధు దాసరి డిఓపిగా పనిచేశారు. ఎడిటర్ గా శశాంక్ మలి చేశారు. జనవరి 1వ తేదీన విడుదలైన ఈ సినిమా 2026 మొదటి హిట్ గా నిలిచిన సందర్భంగా సఃకుటుంబానాం చిత్ర బృందం సక్సెస్ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ… “నా తెలుగు ప్రేక్షకులు అందరికీ పేరుపేరునా నమస్కారాలు తెలియచేసుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. నేను 48 సంవత్సరాలుగా అందరికీ ఒక కుటుంబ సభ్యుడిలా ఉన్నాను. ఇటువంటి మంచి సినిమాను ఆదరించి సఃకుటుంబానాం చిత్రాన్ని హిట్ చేశారు. కుటుంబం అంటే తెలుగు ప్రేక్షకులు ఆదరించడానికి ముందుంటారు. అటువంటి సఃకుటుంబానాం చిత్రాన్ని ప్రేక్షకులంతా కుటుంబసభ్యులతో కలిసి చూసి ఆదరిస్తున్నారు, అది నాకు మరింత ఆనందాన్ని ఇస్తుంది. నేను బ్రతికున్నంత కాలం నా తెలుగు ప్రేక్షకుల కోసం నటిస్తూనే ఉంటాను. ఇటువంటి మంచి కథలతో మరెన్నో సినిమాలు దర్శకులు, నిర్మాతలు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. థియేటర్లు పెరుగుతున్నాయి అంటే సినిమా ఎంత విజయం సాధించిందో అర్థం అవుతుంది. ప్రేక్షకులు ఈ సినిమాను మరింత సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు ఉదయ్ శర్మ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ 2026 తొలి హిట్ గా మా చిత్రం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విజయానికి కారణమైన ప్రేక్షకులకు, మాకు సపోర్ట్ చేసిన మీడియా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత మంచి సినిమాను నిర్మించిన మహదేవ్ గౌడ్ గారికి, ఈ సినిమాలో నటించి మాకు సపోర్ట్ చేసిన రాజేంద్ర ప్రసాద్ గారికి, బ్రహ్మానందం గారికి, ఇతర నటీనటులకు రుణపడి ఉంటాను. ఒక సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చితే హిట్ అవుతుందని నా నమ్మకం. నాకు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు చూసి అది నేర్చుకున్నాను. సినిమాను ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నిర్మాత మహదేవ్ గౌడ్ మాట్లాడుతూ… “మా సినిమాను ఆదరించి మంచి హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు, సపోర్ట్ చేసిన మీడియా వారికి ధన్యవాదాలు. మా తొలి చిత్రానికి సపోర్ట్ చేస్తూ నటించిన రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి కొన్ని థియేటర్లు పెరుగుతున్నాయి. ఇంకా మా చూడని వారు చూడాలని కోరుకుంటున్నాను” అన్నారు.

హీరో రామ్ కిరణ్ మాట్లాడుతూ… “మాకు మొదటి నుండి సపోర్ట్ చేస్తూ వచ్చిన మీడియా వారికి, ప్రేక్షకులకు ధన్యవాదాలు. నా ఎన్నో ఏళ్ల కలను నెరవేర్చుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. సినిమాలో మంచి కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు అని మరొకసారి నిరూపించారు. సినిమా బ్యాక్గ్రౌండ్ లేని నాకు ప్రేక్షకులే బ్యాక్గ్రౌండ్. నన్ను, మా  సినిమాను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అన్నారు.

నటుడు నవీన్ జివి మాట్లాడుతూ… “అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది నా తొలి చిత్రం. ఈ సినిమాలో నటించడం, రాజేంద్ర ప్రసాద్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను” అన్నారు. 

TFJA

Recent Posts

రికార్డులు తిరగరాస్తున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి

కేవలం ఐదు రోజుల్లో రూ.100.2 కోట్ల గ్రాస్ సాధించిన 'అనగనగా ఒక రాజు'నవీన్‌ పొలిశెట్టి కెరీర్‌లోనే అతిపెద్ద విజయంయూఎస్‌లో హ్యాట్రిక్…

6 days ago

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం నుంచి సాత్విక వీరవల్లి పరిచయం

వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో బ‌హు భాషా న‌టుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న స్టార్‌ దుల్క‌ర్ స‌ల్మాన్. కంటెంట్ బేస్డ్ మూవీస్…

6 days ago

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

3 weeks ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

3 weeks ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

3 weeks ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

3 weeks ago