శ్రీరామనవమి సందర్భంగా మార్చి 26న విడుదల కాబోతోన్న ‘బ్యాండ్ మేళం’

‘కోర్ట్’ చిత్రంతో మెప్పించిన హర్ష్ రోషన్, శ్రీదేవీ జంట మళ్లీ ‘బ్యాండ్ మేళం’ అంటూ ఆడియెన్స్ ముందుకు రానుంది. బ్లాక్ బస్టర్ రచయిత కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపు దిద్దుకుంది. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కావ్య, శ్రావ్య ఈ మూవీని నిర్మించారు. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మార్చి 26న రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటి వరకు వదిలిన కంటెంట్ ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

‘బ్యాండ్ మేళం’ టీజర్, ట్రైలర్, మాస్ పెప్పీ సాంగ్ ‘తిప్పూ కుంటున్నావ్’, మంచి మెలోడీ సాంగ్ ‘పల్లెలోని సందల్లన్ని మీవే’ వంటివి ఆడియెన్స్‌లో సినిమా పట్ల అంచనాల్ని పెంచేసింది. యూత్ ఆడియెన్స్‌లో ఇప్పటికే మంచి బజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం శ్రీరాముడి ఆశీస్సులతో శ్రీరామ నవమి సందర్భంగా రిలీజ్ కాబోతోంది. మార్చి 26న ఈ సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్లు ప్లాన్ చేశారు.

ప్రమోషన్స్‌కి కావాల్సినంత టైం దొరకడంతో చిత్రయూనిట్ సైతం డిఫరెంట్ స్టైల్లో ఆడియెన్స్‌ను రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ఇతర ప్రమోషనల్ కంటెంట్, ఈవెంట్లకు సంబంధించిన వివరాల్ని ప్రకటించనున్నారు.

శివరాజు ప్రణవ్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు. శివ ముప్పరాజు ఎడిటింగ్, స్క్రీన్ ప్లే బాధ్యతల్ని నిర్వర్తించారు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు. ఇక ఈ మూవీలో సాయికుమార్ కీలక పాత్రను పోషించారు. ఈ సినిమాను మార్చి 26న భారీ ఎత్తున విడుదల చేయబోతోన్నారు.

తారాగణం: రోషన్, శ్రీదేవి, సాయి కుమార్ తదితరులు

సాంకేతిక సిబ్బంది:
కోన వెంకట్ ప్రొడక్షన్
బ్యానర్: కోన ఫిల్మ్ కార్పొరేషన్
సమర్పణ : మ్యాంగో మాస్ మీడియా
నిర్మాతలు: కావ్య, శ్రావ్య
సహ నిర్మాత: శివరాజు ప్రణవ్
రచయిత, దర్శకుడు: సతీష్ జవ్వాజి
సంగీతం: విజయ్ బుల్గానిన్
స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్: శివ ముప్పరాజు
DOP: సతీష్ ముత్యాల
గీత రచయిత: చద్రబోస్
ఆర్ట్ డైరెక్టర్: నార్ని శ్రీనివాస్
మార్కెటింగ్: వాక్ అవుట్ మీడియా
PRO: వంశీ కాకా

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

5 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

5 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

5 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago