గోదారి గట్టుపైన ఎంటర్టైనింగ్ & ట్రూలీ గోదావరి-రూటెడ్ టీజర్ లాంచ్

సుమంత్ ప్రభాస్, సుభాష్ చంద్ర, రెడ్ పప్పర్ ప్రొడక్షన్స్ గోదారి గట్టుపైన ఎంటర్టైనింగ్ & ట్రూలీ గోదావరి-రూటెడ్ టీజర్ లాంచ్

-గోదారి గట్టుపైన సినిమా టికెట్ కొని థియేటర్లో కూర్చుంటే గోల్డెన్ అవర్ లో గోదారి పడవ ఎక్కినట్టుగా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తారు: టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సుమంత్ ప్రభాస్

మేమ్ ఫేమస్ తో స్ట్రాంగ్ డెబ్యు చేసిన న్యూ ఏజ్ యాక్టర్ సుమంత్ ప్రభాస్ ‘గోదారి గట్టుపైన’ సినిమాతో అలరించబోతున్నారు. ఈ చిత్రం రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ కు ఫస్ట్ వెంచర్. MR ప్రొడక్షన్స్ షార్ట్ ఫిల్మ్‌లతో పాపులరైనా సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిధి ప్రదీప్ కథానాయికగా అరంగేట్రం చేస్తుండగా, జగపతి బాబు, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోదారి గట్టుపైన ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ ఈరోజు లాంచ్ చేశారు.

గోదావరి తీర ప్రాంతం నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రం, గ్రామీణ జీవితంలోని ఉత్సాహాన్ని ‘ఆస్కార్rrrr గ్యాంగ్’గా పాపులరైన ఫ్రెండ్స్ గ్యాంగ్ ద్వారా ఆకట్టుకునేలా చూపించారు. సుమంత్ ప్రభాస్ రాజు పాత్ర సరదా మనస్తత్వం కలిగిన యువకుడిగా కనిపించారు. అతని జీవితంలో మాయ (నిధి ప్రదీప్) రావడంతో మొదలయ్యే ప్రేమకథ జాలీగా, హ్యుమర్, స్నేహం–పండుగ వాతావరణాల మధ్య ఆహ్లాదంగా సాగుతుంది.

వైబ్రెంట్ విజువల్స్‌తో నిండిన టీజర్‌లో స్నేహితుల గ్యాంగ్ మధ్య కెమిస్ట్రీ, లీడ్ జంట మధ్య పుట్టే హార్ట్ టచ్చింగ్ రొమాన్స్‌ను అందంగా చూపించారు. హాస్యం, ప్రేమ, భావోద్వేగాలను  మేళవిస్తూ దర్శకుడు సుభాష్ చంద్ర కొత్తదనంతో కూడిన హార్ట్‌వార్మింగ్ కథనాన్ని అందించారు.

సుమంత్ ప్రభాస్ సహజంగా రాజు పాత్రలో ఒదిగిపోయాడు. అతని కామిక్ టైమింగ్ ఆకట్టుకుంటుంది. నిధి ప్రదీప్ అందంగా కనిపించింది. జగపతి బాబు, రాజీవ్ కనకాల పాత్రలు సినిమా డెప్త్ ని పెంచుతాయి. సుదర్శన్, రాజ్ కుమార్ కాసిరెడ్డి, రాఘవ్, రోహిత్ కృష్ణ వర్మ తమ హ్యుమర్ తో నవ్వులు పూయిస్తారు.

సాయి సంతోష్ సినిమాటోగ్రఫీ గోదావరి ప్రాంతాన్ని సహజత్వంతో, కళ్లకు విందుగా చూపిస్తే, నాగ వంశీ కృష్ణ సంగీతం సినిమాకు పర్ఫెక్ట్ లైట్ & బ్రీజీ గ్రామీణ వాతావరణాన్ని అందిస్తుంది. ప్రొడక్షన్ విలువలు బలంగా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైనర్‌గా ప్రవాళ్య, ఎడిటర్‌గా అనిల్ కుమార్ పి, సౌండ్ డిజైనర్‌గా నాగార్జున తల్లపల్లి అద్భుతమైన వర్క్ ఇచ్చారు. యూత్‌ఫుల్ ఎనర్జీ, రూటెడ్ విజువల్స్, గోదారి గట్టుపైన స్నేహం, ప్రేమని సెలబ్రేట్ చేసుకునే ఫీల్-గుడ్ రూరల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ప్రేక్షకులని అలరించనుంది.

టీజర్ లాంచ్ ఈవెంట్లో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ.. అందరికి నమస్తే. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. చాలా రోజుల తర్వాత ఈ స్టేజ్ పైకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా షూటింగ్ కోసం ఫస్ట్ టైం గోదావరి వెళ్ళాను. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అర్థమైంది గోదావరి అంటే జస్ట్ ఒక ప్రాంతం కాదు అది ఒక కల్చర్ ఎమోషన్. ఆ ఫీలింగ్ వేరు. అక్కడ ప్రజలు మాట్లాడే విధానం చాలా స్వీట్ గా ఉంటుంది. వాళ్ల మర్యాద కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కేరళ కంటే చాలా అద్భుతమైన లొకేషన్స్ గోదావరి ప్రాంతంలో ఉన్నాయి. అది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. ఈ సినిమాకు ముందు దాదాపుగా 80 కథలు విన్నాను. డైరెక్టర్ సుభాష్ ఈ కథని చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. తను దాదాపుగా వంద షార్ట్ ఫిలిం చేశాడు. అది మామూలు విషయం కాదు. ప్రతి ఫిల్మ్ చాలా క్వాలిటీగా ఉండేది. అవి చూసి ఇన్స్పైర్ అయ్యాను నేను. నా సెకండ్ సినిమాకి ఆయన డైరెక్టర్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఒక కిటికీ నుంచి పల్లెటూరిని చూసినట్టుగా ఉంటుంది ఈ సినిమా. నేను తెలంగాణ ప్రాంతంలో పుట్టి పెరిగాను. నాకు గోదావరి యాస పలకడం నిజంగా ఒక సవాల్.  డైరెక్టర్ నన్ను చాలా బాగా ట్రైన్ చేశారు. మీరు గాని టికెట్ కొని థియేటర్లో కూర్చుంటే గోల్డెన్ అవర్ లో గోదావరి పడవ ఎక్కినట్టుగా ఉంటుంది.సినిమా మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. మా నిర్మాతకి థాంక్యూ. చాలా ఫ్యాషన్ తో చాలా క్వాలిటీతో తీశారు. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

హీరోయిన్ నిధి ప్రదీప్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. మాయ క్యారెక్టర్ లో నటించడం ఒక పెద్ద సవాల్ గా అనిపించింది. మాయాలోన ప్రతి ఒక్క భావోద్వేగాన్ని సరికొత్తగా బయటకి తీసుకొచ్చారు మా డైరెక్టర్. ఆయన శైలి చాలా ప్రత్యేకం. నన్ను నేను ఒక ఉత్తమ నటిగా మల్చుకోవడానికి మా డైరెక్టర్ చాలా మద్దతుగా నిల్చున్నారు. మాయ క్యారెక్టర్ నాకు చాలా దగ్గరగా అనిపించిన పాత్ర. చాలామంది అమ్మాయిలు మాయ క్యారెక్టర్ని రిలేట్ చేసుకుంటారు. ఈ సినిమాలో ఉన్న ప్రతి పాత్రను మీరు ఇష్టపడతారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.

డైరెక్టర్ సుభాష్ చంద్ర మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఒక చల్లటి సాయంత్రాన గోదావరి గట్టున కూర్చుని  నలుగురు స్నేహితులు కబురులు చెప్పుకుంటే ఎంత హాయిగా ఉంటుందో ఈ సినిమా అలాగే ఉంటుందని సినిమా లాంచింగ్ రోజు చెప్పాను. అదే మాటకు తీసుకొచ్చి మేము చేసిన ప్రయత్నమే ఈ సినిమా.   టీజర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ కథని మొదటి నమ్మిన వ్యక్తి మా ప్రొడ్యూసర్ అభినవ్ గారు. నన్ను, కథని నమ్మి ఇంత అద్భుతంగా సినిమాని తీశారు. ఇది ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యే కథ. ఇందులో ఉండే ఫ్రెండ్స్ గ్యాంగ్ మీ అందరినీ అలరిస్తారు. కచ్చితంగా ఈ సినిమాని మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తారు.

రాజ్ కుమార్ కసిరెడ్డి మాట్లాడుతూ..  గోదారి ప్రాంతంలో ఉన్న అందరికీ ఈ సినిమా చాలా క్లోజ్ గా కనెక్ట్ అవుతుంది. రాజావారు రాణి వారు చేసిన తర్వాత ప్యూర్ గోదావరి సినిమా చేయమని చాలా మంది అడిగారు. ఇప్పుడు ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా లైవ్ లో గోదావరిని ఎక్స్పీరియన్స్ చేసినట్టుగానే ఉంటుంది. మీ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది న్యూ ఏజ్ లవ్ స్టోరీ. అందరికీ సినిమా చాలా బాగా నచ్చుతుంది. అందరూ థియేటర్ కి వచ్చి సినిమా చూసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను.

తారాగణం: సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, జగపతి బాబు, రాజీవ్ కనకాల, లైలా, దేవి ప్రసాద్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్, రోహిత్ కృష్ణ వర్మ

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం – సుభాష్ చంద్ర
బ్యానర్ – రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్
నిర్మాత – అభినవ్ రావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మధులిక సంచన లంక
DOP – సాయి సంతోష్
సంగీతం – నాగ వంశీ కృష్ణ
ఎడిటర్ – అనిల్ కుమార్ పి
సౌండ్ డిజైనర్ – నాగార్జున తాళ్లపల్లి
ప్రొడక్షన్ డిజైనర్ – ప్రవల్య డి
PRO – వంశీ-శేఖర్
మార్కెటింగ్ – ఫస్ట్ షో

TFJA

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

12 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago