రాకింగ్ స్టార్ యష్ ప్రెస్టీజియస్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’పై రోజు రోజుకీ అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈసినిమా నుంచి నాడియా పాత్రలో నటిస్తోన్న కియారా అద్వానీ.. మిస్టీరియస్, గ్లామరస్ ఎలిజిబెత్ పాత్రలో నటిస్తోన్న హుమా ఖురేషి.. పవర్ఫుల్ గంగ పాత్రలో నటిస్తోన్న నయనతార పాత్రలకు సంబంధించిన లుక్స్ విడుదలై టాక్సిక్ సినిమాలోని డార్క్ వరల్డ్‌పై ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింతగా పెంచేశాయి.
తాజాగా మేకర్స్ అందమైన, ఆకర్షణీయమైన, సున్నితమైన రెబెకా పాత్రలో నటిస్తోన్న తారా సుతారియా పాత్రను పరిచయం చేశారు. ఇలా సినిమాలోని పాత్రలను పరిచయం చేయటం ద్వారా.. సినిమా స్కేల్ పాన్ ఇండియా రేంజ్‌ను తెలియజేస్తోంది. ఇందులో హై యాక్షన్ సీక్వెన్సెస్, భారీ డ్రామా, కథలోని అనేక మలుపులుండబోతున్నాయి. తాజాగా తారా సుతారియా లుక్‌ను రివీల్ చేశారు. ఇది ఆమెకు తొలి పాన్ ఇండియా మూవీ. ఆమె కెరీర్‌లో ఇదొక కొత్త అధ్యాయం.
అందంగా, స్టైల్‌గా కనిపిస్తూనే రెబెకా పాత్రలోని తారా సుతారియా గన్స్‌ను ఉపయోగిస్తోన్న తీరు ఆకట్టుకుంటోంది. పోస్టర్ చూస్తుంటే తనను తాను రక్షించుకోగల ధైర్యం, సామర్థ్యమున్న పాత్రలో ఆమె మెప్పించనుంది. అందమైన అమ్మాయిగా టాక్సిక్ అనే ప్రమాదకరమైన, కఠినమైన ప్రపంచంలోకి అడుగు పెడుతుంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకురాలు గీతూ మోహన్ దాస్ మాట్లాడుతూ ‘‘తారా నుంచి సహజమైన ప్రేను ఆస్వాదించాను. ఆమె స్వచ్ఛమైన మనసు కలిగిన వ్యక్తి. అదే ఆమెకు రక్షణ అని అనుకుంటున్నాను. దీని గురించి అందరికీ తెలియజేయాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను. నటిగా ఆమెకు ఇది కావాలని బలంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు కావాల్సినంత స్వేచ్చను ఇస్తే చాలు. అదే నేను చేశాను. ఇది మా బంధం బలమైందిగా మారటానికి దోహదపడింది. ఆమె ప్రతి విషయాన్ని సునిశితంగా గమనించేది. పాత్ర గురించి ఎక్కువగా ఆలోచించేది. ఆమెను ఎలా గైడ్ చేయాలా ? అని నేను ఆలోచించిన సందర్భాలున్నాయి. కానీ ఆమె పాత్రలో అద్భుతంగా జీవించింది. ఇది నన్నెంతో ఆశ్చర్యపరిచింది. నన్నే కాదు.. అందరినీ ఇది ఆశ్చర్యపరుస్తుందనటంలో సందేహం లేదు’’ అన్నారు.
యష్, గీతూ మోహన్‌దాస్ కలిసి కథను రాసి.. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాను ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా మరికొన్ని భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాలున్నాయి. అద్భుతమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను నేషనల్ అవార్డు గ్రహీత రాజీవ్ రవి నిర్వహిస్తుండగా.. సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తున్నారు. ఎడిటింగ్‌ను ఉజ్వల్ కులకర్ణి, ప్రొడక్షన్ డిజైన్‌ను టీపీ అబీద్ చూసుకుంటున్నారు. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జేజే పెర్రీ (జాన్ విక్ ఫేమ్)తో పాటు నేషనల్ అవార్డు గెలుచుకున్న అన్బరివ్ యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేశారు.
‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై వెంకట్ కె.నారాయణ, యష్ నిర్మిస్తున్నారు. సినిమా 2026 మార్చి 19న ఈద్, ఉగాది, గుడి పడ్వా పండుగలు కలిసి వచ్చే లాంగ్ వీకెండ్ సమయంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన సినిమా "రోమాంచకం". సుమంత్ ప్రభాస్,…
ఎప్పటికప్పుడు ఎగ్జైటింగ్ కంటెంట్ తో సబ్ స్క్రైబర్స్ ను ఎంగేజ్ చేస్తోన్న ఆహా ఓటీటీ ఇప్పుడు మరో ఎగ్జైటింగ్ సిరీస్…
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…