టాలెంటెడ్ యాక్టర్ నితిన్, బ్యూటీ డాల్ శ్రీలీల హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ ‘ఎక్స్‌ట్రా – ఆర్డినరీ మ్యాన్’. రైటర్ – డైరెక్టర్ వక్కంతం వంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం శంషాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో 300కి పైగా ఫారిన్ డాన్సర్స్‌తో జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో పక్కా మాస్ సాంగ్‌ను హీరో నితిన్, శ్రీలీలపై చిత్రీకరిస్తుండటం విశేషం. ఈ పాట చిత్రీకరణతో ఎంటైర్ షూటింగ్ పూర్తవుతుంది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు సైతం శరవేగంగా జరుగుతున్నాయి. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 8న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘డేంజర్ పిల్ల…’, ‘బ్రష్ వేస్కో..’ సాంగ్స్ విడుదలై ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ను రాబట్టుకున్నాయి. అలాగే రీసెంట్‌గా విడుదలైన టీజర్ సైతం అమేజింగ్‌గా ఉందంటూ అప్రిషియేషన్స్ అందుకుంది. మూవీలో యూనిక్‌గా ఉన్న నితిన్ క్యారక్టరైజేషన్, మూవీ కాన్సెప్ట్ అందరినీ ఆకట్టుకోనుంది. నితిన్ ఈ చిత్రంలో జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్‌లో కనిపించి తనదైన కామెడీ టైమింగ్‌తో ఎంటర్‌టైన్ చేయించనున్నారు.
మ్యూజికల్ జీనియస్ హేరిస్ జయరాజ్ సంగీత సారథ్యం వహిస్తుండగా..యువరాజ్.జె, అర్థర్ ఎ.విలన్స్, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్యమూవీస్ & ఎంటర్ టైన్‌మెంట్స్, రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై ఎన్.సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.
నటీనటులు:
నితిన్, శ్రీలీల, డా.రాజశేఖర్, సుధేవ్ నాయర్, రావు రమేష్, రోహిణి, బ్రహ్మాజీ, అజయ్, హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ, పవిత్రా నరేష్, రవివర్మ, హైపర్ ఆది, వెంకటేష్ ముమ్ముడి, జగదీష్ తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్స్ – శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్యమూవీస్ & ఎంటర్ టైన్‌మెంట్స్, రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాతలు – ఎన్.సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి, రచన, దర్శకత్వం – వక్కంతం వంశీ, మ్యూజిక్ – హేరిస్ జయరాజ్, సినిమాటోగ్రఫీ – యువరాజ్.జె, అర్థర్ ఎ.విలన్స్, సాయి శ్రీరామ్, ప్రొడక్షన్ డిజైనర్ – సాహి సురేష్, ఎడిటర్ – ప్రవీణ్ పూడి, కాస్ట్యూమ్స్ – నీరజ్ కోన, స్టంట్స్ – విజయ్, సిల్వ, కొరియోగ్రఫీ – శేఖర్ వి.జె, జానీ, రఘు, లిరిక్స్ – రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, కృష్ణకాంత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – భాస్కర్, పి.ఆర్.ఒ – వంశీ కాకా, ఆడియో – ఆదిత్య మ్యూజిక్.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…