భారీ సెట్‌లో మాస్ సాంగ్ చిత్రీకరణ జరుపుకుంటోన్న ‘ఎక్స్ ట్రా – ఆర్డినరీ మ్యాన్‌’

Must Read

టాలెంటెడ్ యాక్ట‌ర్ నితిన్, బ్యూటీ డాల్ శ్రీలీల హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ఎక్స్‌ట్రా – ఆర్డిన‌రీ మ్యాన్’. రైట‌ర్ – డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ప్రస్తుతం శంషాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో 300కి పైగా ఫారిన్ డాన్సర్స్‌తో జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో పక్కా మాస్ సాంగ్‌ను హీరో నితిన్, శ్రీలీలపై చిత్రీకరిస్తుండటం విశేషం. ఈ పాట చిత్రీకరణతో ఎంటైర్ షూటింగ్ పూర్తవుతుంది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు సైతం శరవేగంగా జరుగుతున్నాయి. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 8న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘డేంజర్ పిల్ల…’, ‘బ్రష్ వేస్కో..’ సాంగ్స్ విడుదలై ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ను రాబట్టుకున్నాయి. అలాగే రీసెంట్‌గా విడుదలైన టీజర్‌ సైతం అమేజింగ్‌గా ఉందంటూ అప్రిషియేషన్స్ అందుకుంది. మూవీలో యూనిక్‌గా ఉన్న నితిన్ క్యారక్టరైజేషన్, మూవీ కాన్సెప్ట్ అందరినీ ఆకట్టుకోనుంది. నితిన్ ఈ చిత్రంలో జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్‌లో కనిపించి తనదైన కామెడీ టైమింగ్‌తో ఎంటర్‌టైన్ చేయించనున్నారు.

మ్యూజికల్ జీనియ‌స్ హేరిస్ జయ‌రాజ్ సంగీత సారథ్యం వహిస్తుండగా..యువరాజ్.జె, అర్థర్ ఎ.విలన్స్, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య‌మూవీస్ & ఎంట‌ర్ టైన్‌మెంట్స్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్స్‌పై ఎన్.సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

నటీనటులు:

నితిన్, శ్రీలీల, డా.రాజశేఖర్, సుధేవ్ నాయర్, రావు రమేష్, రోహిణి, బ్రహ్మాజీ, అజయ్, హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ, పవిత్రా నరేష్, రవివర్మ, హైపర్ ఆది, వెంకటేష్ ముమ్ముడి, జగదీష్ తదితరులు

సాంకేతిక వర్గం:

బ్యానర్స్ – శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య‌మూవీస్ & ఎంట‌ర్ టైన్‌మెంట్స్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, నిర్మాతలు – ఎన్.సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి, రచన, దర్శకత్వం – వక్కంతం వంశీ, మ్యూజిక్ – హేరిస్ జయరాజ్, సినిమాటోగ్రఫీ – యువరాజ్.జె, అర్థర్ ఎ.విలన్స్, సాయి శ్రీరామ్, ప్రొడక్షన్ డిజైనర్ – సాహి సురేష్, ఎడిటర్ – ప్రవీణ్ పూడి, కాస్ట్యూమ్స్ – నీరజ్ కోన, స్టంట్స్ – విజయ్, సిల్వ, కొరియోగ్రఫీ – శేఖర్ వి.జె, జానీ, రఘు, లిరిక్స్ – రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, కృష్ణకాంత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – భాస్కర్, పి.ఆర్.ఒ – వంశీ కాకా, ఆడియో – ఆదిత్య మ్యూజిక్.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News