బిచ్చగాడు-2 మూవీతో రీసెంట్ సూపర్ హిట్ అందుకున్న తమిళ హీరో విజయ్ అంటోని.. మరో సినిమాతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. సరికొత్త లైన్‌తో క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో హత్య సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విజయ్ ఆంటోని డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నాడు. హీరోయిన్‌గా రితికా సింగ్ నటిస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ఎవరు నువ్వు..? అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ మేకర్స్ రిలీజ్ చేశారు.
ఎవరు నువ్వు..? అంటూ సాగే ఈ పాట.. ప్రేక్షకులను సరికొత్త ట్రాన్స్‌లోకి తీసుకు వెళ్లేలా ఉంది. ఈ పాటను ఎంఎస్ కృష్ణ, అంజనా రాజగోపాలన్ ఆలపించగా.. భవ్యశ్రీ సాహిత్యం అందించారు. గిరీష్ గోపాలకృష్ణన్ అందించిన మ్యూజిక్ వినసొంపుగా ఉంది. ఈ పాటతో సినిమాపై మరింత అంచనాలను పెంచేశారు మూవీ మేకర్స్.
బాలాజీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హత్య మూవీ జూలై 21న థియేటర్లలోకి రాబోతుంది. కంప్లీట్ మేకోవర్‌తో.. సరికొత్త కొత్త లుక్‌లో స్టైలీష్‌గా విజయ్ ఆంటోని కనిపిస్తున్నాడు. కొత్త కథలు, డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను అలరించేందుకు విజయ్.. మరోసారి అలాంటి స్టోరీనే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
లోటస్ పిక్చర్స్‌తో కలిసి ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ హత్య మూవీని నిర్మిస్తోంది. కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగం పిళ్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్‌విఎస్ అశోక్ కుమార్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రంలో మురళీ శర్మ, మీనాక్షి చౌదరి, జాన్ విజయ్, రాధిక శరత్‌కుమార్, సిద్ధార్థ్ శంకర్, అర్జున్ చిదంబరం, కిషోర్ కుమార్, సంకిత్ బోరా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శివకుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఆర్కే సెల్వ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…