ఎర్రచీర సినిమా గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్. డిసెంబర్ 20న మూవీ విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ -శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఎర్రచీర – ది బిగినింగ్”. ఈ సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తోంది. “ఎర్రచీర – ది బిగినింగ్” మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. డిసెంబర్ 20న “ఎర్రచీర – ది బిగినింగ్” తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈరోజు సినిమా గ్లింప్స్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ – “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమా గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ కు రావడం హ్యాపీగా ఉంది. హారర్, దేవుడు కాన్సెప్ట్ లతో సినిమాలు చేయడం ఈ మధ్య ట్రెండ్ గా మారింది. ఈ సినిమా కూడా ఆ ట్రెండ్ లోనే వస్తుందని అనుకోవచ్చు. అయితే ఇంకా డిఫరెంట్ గా ఈ మూవీని రూపొందించారు. బేబి సాయి తేజస్విని ముఖ్యపాత్రలో నటించింది. ఇండస్ట్రీకి కొత్త వాళ్లు రావాలి. అప్పుడే కొత్త టాలెంట్ మనకు దొరుకుతుంది. ఎర్రచీర సినిమా విజయం సాధించి ఈ టీమ్ అందరికీ సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

చిత్ర దర్శక నిర్మాత, నటుడు సుమన్ బాబు మాట్లాడుతూ – “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమా గ్లింప్స్ ను ఈ రోజు కార్తీకమాసం పర్వదినం సందర్భంగా ఈ పెద్దల చేతుల మీదుగా రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. యాక్షన్, మదర్ సెంటిమెంట్ తో ఈ సినిమాను రూపొందించాను. సినిమాలోని 22 పాత్రలతో పాటు ఎర్రచీర కూడా 23వ పాత్ర పోషిస్తుంది. మొత్తం 45 నిమిషాలు గ్రాఫిక్స్ ఉంటాయి. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాం. బేబి సాయితేజస్విని నటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఈ కథలో డివోషనల్ టచ్ కూడా ఉంటుంది. డిసెంబర్ 20వ తేదీన తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమాను విడుదల చేయబోతున్నాం. మరిన్ని ప్రెస్ మీట్స్ లో ఇంకా డీటెయిల్డ్ గా మూవీ హైలైట్స్ తెలియజేస్తాను. అన్నారు.

హీరోయిన్ కారుణ్య చౌదరి మట్లాడుతూ – “ఎర్రచీర – ది బిగినింగ్” గ్లింప్స్ లో హర హర మహాదేవా అని వచ్చినప్పుడు అందరికీ గూస్ బంప్స్ వచ్చాయి. ఈ గ్లింప్స్ మీతో పాటు నేను కూడా ఇప్పుడే చూస్తున్నాం. మా టీమ్ క్వాలిటీ మూవీ చేసేందుకు ఎంత కష్టపడ్డారో మీకు ఈ గ్లింప్స్ లోనే తెలుస్తుంది. బేబి సాయి తేజస్విని చక్కగా నటించింది. మూవీలో ఆమెకు నాకు మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. కథలో మదర్ సెంటిమెంట్ ఆకట్టుకునేలా ఉంటుంది. సినిమా చూసిన వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటారు. మా “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమాను మీరంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత అంబికా కృష్ణ మాట్లాడుతూ – “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమా గ్లింప్స్ చాలా బాగుంది. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాం. ఈరోజు ట్రెండ్ ప్రకారం ప్రేక్షకులకు కావాల్సిన కంటెంట్ ఉన్న చిత్రమిది. మదర్ సెంటిమెంట్ ను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. సుమన్ బాబు, అతని టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ప్రమోద్ పులిగార్ల మాట్లాడుతూ – “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన సుమన్ బాబు గారికి థ్యాంక్స్. ఆయన నాకు గత పదేళ్లుగా తెలుసు. నేను చక్రి గారి దగ్గర వర్క్ చేశాను. నా ప్రతి సినిమా మొదటి సినిమాలాగే పనిచేయడం నేర్చుకున్నా. “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమాకు డిఫరెంట్ గా పాటలు చేసే అవకాశం దొరికింది. డిసెంబర్ 20న రిలీజ్ అవుతున్న మా సినిమాను థియేటర్స్ లో చూసి ఆదరించండి. అన్నారు.

నిర్మాత గురురాజ్ మాట్లాడుతూ – “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేశాను. అయితే అది ఏంటి అనేది ప్రస్తుతానికి సీక్రెట్ గా ఉంచుతున్నాం. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ తో తీసిన చిత్రమిది. సుమన్ బాబుకు ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

పీఆర్ఓ, నిర్మాత, నటుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ -“ఎర్రచీర – ది బిగినింగ్” గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన అంబికా కృష్ణ గారికి, భరద్వాజ అన్న గారికి థ్యాంక్స్. ఈ సినిమా కథను సుమన్ బాబు చెప్పినప్పుడు చాలా బాగుందని అనిపించింది. ఈ మూవీలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను. ప్రేక్షకులకు ఏం కావాలో సుమన్ బాబుకు తెలుసు. ఆ ఎలిమెంట్స్ అన్నీ కలిపి “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమా రూపొందించారు. గ్రాఫిక్స్ బేస్డ్ మూవీస్ రిలీజ్ కొంత ఆలస్యమైనా ఘన విజయాలు సాధిస్తుంటాయి. మన గతంలోనూ ఇలాంటి మూవీస్ బ్లాక్ బస్టర్ కావడం చూశాం. సినిమా ఎంత బాగుంటుందో గ్లింప్స్ లో కనిపిస్తోంది. “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటీనటులు – బేబి సాయి తేజస్విని, సుమన్ బాబు, శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పీ శర్మ , సురేష్ కొండేటి, రఘుబాబు, తదితరులు

టెక్నికల్ టీమ్

ఆర్ట్ – నాని, సుభాష్
స్టంట్స్ – నందు,
డైలాగ్స్ – గోపి విమల పుత్ర,
లైన్ ప్రొడ్యూసర్ – అబ్దుల్ రెహమాన్,
సినిమాటోగ్రఫీ – చందు
ఎడిటర్ – వెంకట ప్రభు,
చీఫ్ కో డైరెక్టర్ – నవీన్ రామ నల్లం రెడ్డి,
రాజ మోహన్
బీజీఎం – ఎస్ చిన్న
మ్యూజిక్ – ప్రమోద్ పులిగార్ల
సౌండ్ ఎఫెక్ట్స్ – ప్రదీప్
పిఆర్ఓ – సురేష్ కొండేటి
సమర్పణ – బేబీ డమరి ప్రజెంట్స్
నిర్మాత – ఎన్. వి.వి. సుబ్బారెడ్డి, సీహెచ్. వెంకట సుమన్
కథ – స్క్రీన్ ప్లే- దర్శకత్వం – సుమన్ బాబు

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

4 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

4 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

5 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago