షాపింగ్ మాల్ సినిమాకు 14 ఏళ్లు.

తమిళ్ ఇండస్ట్రీలో తెరకెక్కిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అంటూ తేడా లేకుండా కంటెంట్ బాగుంటే చాలు సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి. అలా తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాల్లో షాపింగ్ మాల్ సినిమా ఒకటి.

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 2010లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ప్రేమిస్తే చిత్రంతో నిర్మాతగా మారిన సురేష్ కొండేటి ‘షాపింగ్ ‌మాల్‌’ సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరించి హిట్ అందుకున్నారు. తమిళ దర్శకుడు వసంతబాలన్‌ డైరక్టర్ ఈ చిత్రాన్ని రూపొందించారు.

మహేష్‌, అంజలి జంటగా నటించిన ఈ సినిమా పాటలు చిరంజీవి చేతుల మీదుగా విడుదలయ్యాయి. ఇక ఈ సినిమాను దీపావళి సందర్భంగా 2010 నవంబర్ 5న విడుదల చేశారు. పెద్ద పెద్ద దుకాణాల్లో పని చేసే సేల్స్‌ గాళ్స్‌, బాయ్స్‌ జీవిత నేపథ్యాల్లో సినిమా సాగుతుంది. దీని మాతృక ‘అంగాడి తెరు’ అనే తమిళ చిత్రం కాగా అది ఇండియన్‌ పనోరమాకి ఎంపికైంది. ఇక ఈ సినిమాకి సంగీతం జీవీ ప్రకాష్‌కుమార్‌, విజయ్‌ ఆంటోని అందించగా మాటలు శశాంక్‌ వెన్నెలకంటి అందించారు. ఇక ఈ సినిమాకు 14 ఏళ్ళు పూర్తయిన క్రమంలో జీవీ ప్రకాష్ కుమార్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ

షాపింగ్ మాల్ సినిమాకి 14 ఏళ్లు పూర్తయ్యాయి. సురేష్ కొండేటి సార్ నిర్మాతగా తెలుగులో రిలీజ్ చేసిన ఈ సినిమా నా కెరియర్లో అత్యంత ముఖ్యమైన సినిమాల్లో ఒకటి. సినిమా సాంగ్స్ బాగా వచ్చాయి. ఇప్పుడు ఆ జ్ఞాపకాలు అన్నీ గుర్తు వస్తున్నాయి అని అన్నారు.

ఇక నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ మనం నమ్మి చేసిన సినిమాను ప్రేక్షకులు కూడా నమ్మి హిట్ చేసినప్పుడు వచ్చే సంతోషం మాటల్లో చెప్పలేం. ఆలా నేను నమ్మి, ప్రేక్షకులను కూడా నమ్మేలా చేసి హిట్ అయిన సినిమా ‘షాపింగ్ మాల్’.

ఆ సినిమా వచ్చి నేటికి 14 సంవత్సరాలు అయిన సందర్భంగా నటించిన నటీనటులకు, పనిచేసిన సాంకేతిక నిపుణులకు, ఆదరించిన ప్రేక్షకులకు, అలాగే ఈ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యి తరవాత తెలుగు అమ్మాయి అనిపించుకున్న అంజలికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాను తెలుగులో చేస్తున్నప్పుడు నన్ను ప్రోత్సహించి అప్పట్లో ఈ సినిమా తెలుగు పాటలను విడుదల చేసిన అన్నయ్య పద్మవిభూషణ్ మెగాస్టార్ డా. చిరంజీవి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ ఆయన పేర్కొన్నారు.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

7 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

7 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

7 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago