* ‘ద్రౌపది 2’లో విలన్‌గా చిరాగ్ జానీ..సినిమాపై పెరుగుతోన్న ఎక్స్‌పెక్టేషన్స్– ద్రౌపది 2’లో ముగ్గురు విలన్స్.. పవర్‌ఫుల్ విలనిజంతో మెప్పించున్న చిరాగ్ జానీ
అనౌన్స్‌మెంట్ రోజు నుంచే ప్రేక్షకుల్లోనే కాకుండా సినీ వర్గాల్లోనూ మోహన్.జి దర్శకత్వంలో రూపొందుతోన్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా ‘ద్రౌపది 2’పై అంచనాలు పెరుగుతున్నాయి. 14వ శతాబ్దంలో దక్షిణ భారతదేశపు నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో బహుభాషా చిత్రంగా రూపొందించారు. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. రిచర్డ్ రిషి లుక్, చక్కటి పాటలు, విజువల్స్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింతగా పెంచాయి. ఇందులో చిరాగ్ జానీ విలన్‌గా నటిస్తుండటం అంచనాలను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లాయి.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మోహన్.జి మాట్లాడుతూ ‘‘మహమ్మద్‌బీన్ తుగ్లక్ పాత్రలో చిరాగ్ నటించారు. ఈ పాత్రను విలన్‌గానే కాకుండా.. తను తీసుకునే నిర్ణయాల వల్ల సమస్యల్లో పడే పాలకుడిగా చూపించే క్రమంలో దాన్ని చిరాగ్ అద్భుతంగా పోషించారు. చరిత్రలో తుగ్లక్‌ను తెలివైన మూర్ఖుడు అని అంటుంటారు. ఇలాంటి పాత్రను చేయాలంటే లుక్ పరంగా గంభీరంగా కనిపిస్తూనే మేథస్సు, తెలివిని బ్యాలెన్స్ చేస్తూ నటించే యాక్టర్ కావాలి. ఇలాంటి వేరియేషన్‌ను చూపించటం చాలా కష్టంతో కూడుకున్నది. చిరాగ్ ఆ పాత్రలో పూర్తిగా లీనమై నటించి పాత్రలో అన్నీ రకాల ఎమోషన్స్‌ను అద్భుతంగా పలికించారు’’ అన్నారు.
ద్రౌపది 2లో ‘ద్రౌపతి 2’ సినిమాలో రిచర్డ్ రిషి హీరోగా ,రక్షణ ఇందుసుదన్ హీరోయిన్‌గా నటించారు. నట్టి నటరాజ్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇంకా ఈ వై.జి. మహేంద్రన్, నడోడిగల్ బరాణి, సరవణ సుబ్బయ్య, వెల్ రామమూర్తి, సిరాజ్ జానీ, దినేష్ లాంబా, గణేష్ గౌరాంగ్, దివి, దేవయానీ శర్మ, అరుణోదయన్ తదితరులు ఇతర పాత్రల్లో అలరించనున్నారు.
ఈ సినిమాను చోళ చక్రవర్తి (నేతాజీ ప్రొడక్షన్స్), జి.ఎం. ఫిల్మ్ కార్పొరేషన్‌తో కలిసి నిర్మించారు. ఫిలిప్ ఆర్. సుందర్ సినిమాటోగ్రఫీ అందించగా, గిబ్రాన్ సంగీతాన్ని అందించారు. యాక్షన్ సంతోష్, నృత్యాలను తనిక టోనీ యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేశారు. ఎడిటర్‌గా దేవరాజ్, ప్రొడక్షన్ డిజైనర్‌గా కమల్‌నాథన్ బాధ్యతలను నిర్వహించారు. పద్మ చంద్రశేఖర్, మోహన్.జి డైలాగ్స్ రాశారు.
సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ద్రౌపది 2 నుంచి త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేసి, ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్‌పై కూడా ప్రకటన త్వరలోనే రానుందని మేకర్స్ పేర్కొన్నారు.
అర్జున్ రెడ్డి, యానిమల్ పాన్ ఇండియా హిట్స్ తో పాటు నేషనల్ అవార్డ్ అందుకున్న హర్షవర్దన్ రామేశ్వర్ … ఇప్పుడు…
మైత్రీ మూవీ మేకర్స్ ప్రజెంట్స్, సత్య, రితేష్ రానా, క్లాప్ ఎంటర్టైన్మెంట్ 'జెట్లీ' హ్యుమర్ ఫిల్డ్ యాక్షన్ గ్లింప్స్ రిలీజ్…
యాక్షన్ హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘టైసన్…
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "రామమ్". ఈ రోజు ఈ యంగ్ స్టార్ హీరో పుట్టినరోజు…
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…
RS ఇన్ఫోటైన్మెంట్ నుండి 16వ ప్రాజెక్ట్‌గా 'మండాడి' చిత్రం రాబోతోంది. మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో…