వి 4 సినీ క్రియేషన్స్ పతాకం పై వికాస్ మరియు శాంతి హీరో హీరోయిన్ గా డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వం లో డాక్టర్ ఎల్ వి సూర్యం నిర్మించిన సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ చిత్రం “దర్శిని”. ఈ చిత్రానికి యూ/ ఏ సర్టిఫికెట్ వచ్చింది. మే 17న విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ ఎల్ వి సూర్యం మాట్లాడుతూ “మా ‘దర్శిని’ చిత్రానికి సెన్సార్ వారు యూ/ ఏ ఇచ్చి మా చిత్రాన్ని ప్రశంసించారు. సినిమా చాలా బాగుంది అని కొనియాడారు. మే 17న విడుదల కు సిద్ధంగా ఉన్నాము. మా చిత్రం విడుదలకు సపోర్ట్ చేసిన దామోదర్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు. మా దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు ఈ చిత్రానికి ప్రాణం పెట్టి పని చేసాడు. మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు. ముగ్గురు మిత్రులకి భవిష్యత్తు నీ చూపించే యంత్రం దొరికితే దానివల్ల వచ్చే పరిణామాలు మరియూ పర్యవసానాలే మా సినిమా దర్శిని. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి కామెడీ, ఎమోషన్, లవ్ అని అంశాలు మా చిత్రాల్లో ఉన్నాయి. ప్రతి తెలుగు ప్రేక్షకులకు మా చిత్రం బాగా నచ్చుతుంది” అని తెలిపారు.
దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు మాట్లాడుతూ “కె ఎల్ దామోదర్ ప్రసాద్ గారు మా గాడ్ ఫాథర్. మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. మా నిర్మాత, మా కో డైరెక్టర్, మా హీరో, హీరోయిన్ మేము అందరం ఇప్పుడు ఒక ఫామిలీ. అందరం సొంత సినిమా గా పని చేసాం. సినిమా చాలా బాగా వచ్చింది, సెన్సార్ వారు మా చిత్రానికి యూ/ ఏ సర్టిఫికెట్ ఇచ్చి సినిమా బాగుంది అని కొనియాడారు. మే 17 న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అవుతుంది” అని తెలిపారు.
హీరో వికాస్ మాట్లాడుతూ “మా చిత్రానికి పునాది మా దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు. ఈ జర్నీ లో చాలా కష్టాలు చూసాము కానీ సినిమా మీద ప్యాషన్ తో కష్టపడి పని చేసాము. సినిమా చాలా బాగా వచ్చింది, మే 17న విడుదల అవుతుంది” అని తెలిపారు.
బ్యానర్ : వి 4 సినీ క్రియేషన్స్
చిత్రం పేరు : దర్శిని
నటీనటులు : వికాస్, శాంతి, సత్య ప్రసాద్, తదితరులు
కెమెరా మాన్ : రవి మిల్కీ
ఎడిటర్ : ప్రవీణ్ జైరాజ్, చందు చలమల
సంగీతం : నిజాని అంజన్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : శివ ప్రసాద్
డి ఐ : బి 2 హెచ్ స్టూడియోస్
కలరిస్ట్ : వెంకట్
డబ్బింగ్ : సిద్ధూ పట్నాన, రాజు గరుడే
సౌండ్ ఇంజనీర్ : దామోదర్ రావు
వి ఎఫ్ ఎక్స్ : ప్రవీణ్ జైరాజ్
డిజైన్స్ : ఎమ్ కె ఎస్ మనోజ్
పి ఆర్ ఓ : పాల్ పవన్
డిజిటల్ మార్కెటింగ్ : ఎస్ 3 డిజిటల్ మీడియా వర్క్
లైన్ ప్రొడ్యూసర్ మరియు కో డైరెక్టర్ : కె సంతోష్ కుమార్
దర్శకుడు : డాక్టర్ ప్రదీప్ అల్లు
ప్రొడ్యూసర్ : డాక్టర్ ఎల్ వి సూర్యం
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్‌టైన్‌మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…