దళపతి విజయ్ ‘వారసుడు’ సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్

దళపతి విజయ్ కధానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్,  పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారసుడు’/ వారిసు చిత్రం చివరి షెడ్యూల్ మినహా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. వచ్చే నెల నుంచి సినిమా ప్రమోషన్స్ ప్రారంభం కానున్నాయి.దీపావళి సందర్భంగా 2023 సంక్రాంతికి వారసుడు/వారిసుని  విడుదల చేస్తున్నట్లు  మేకర్స్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా సంక్రాంతి అతిపెద్ద పండుగ కావడంతో మేకర్స్ పండుగ సీజన్‌ ను సద్వినియోగం చేసుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారు. అనౌన్స్ మెంట్  పోస్టర్‌ లో విజయ్ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్, ఒక పెద్ద  సుత్తిని పట్టుకొని కనిపించారు. యాక్షన్-బ్లాక్ ని సూచిస్తున్న ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది.

క్లాసియెస్ట్ బెస్ట్ లుక్‌ లో విజయ్‌ని ప్రజంట్ చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్, సెకండ్ లుక్ పోస్టర్ ‌లకు భారీ స్పందన వచ్చింది. టైటిల్, పోస్టర్లు భారీ అంచనాలను నెలకొల్పాయి. పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా రూపొందించబడిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న  కథానాయిక.ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం.భారీ నిర్మాణ విలువలతో లావిష్ అండ్ విజువల్ గ్రాండియర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లేను అందించారు.సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా, శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సహ నిర్మాతలుగా, సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా పని చేస్తున్నారు.

తారాగణం: విజయ్, రష్మికా మందన్న, శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, శామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త తదితరులు

సాంకేతిక విభాగం:

దర్శకత్వం: వంశీ పైడిపల్లి

కథ, స్క్రీన్ ప్లే: వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్‌ సాల్మన్‌ 

నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా

సహ నిర్మాతలు: శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత

సంగీతం: ఎస్ థమన్

డీవోపీ: కార్తీక్ పళని

ఎడిటింగ్:  కెఎల్ ప్రవీణ్

డైలాగ్స్, అడిషనల్ స్క్రీన్ ప్లే: వివేక్

ప్రొడక్షన్ డిజైనర్లు: సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి

ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: బి శ్రీధర్ రావు, ఆర్ ఉదయ్ కుమార్

మేకప్: నాగరాజు

కాస్ట్యూమ్స్: దీపాలి నూర్

పబ్లిసిటీ డిజైన్స్: గోపి ప్రసన్న

వీఎఫ్ఎక్స్: యుగంధర్

పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

హీరో సుడిగాలి సుధీర్ “సుధీర్స్ జోకర్” సినిమా నుంచి వెర్సటైల్ యాక్టర్ మురళీశర్మ బర్త్ డే పోస్టర్ రిలీజ్

-"సుధీర్స్ జోకర్" చిత్రంలో డిటెక్టివ్ జీవన్ పాత్రలో ఆకట్టుకోనున్న మురళీశర్మ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "సుధీర్స్…

2 days ago

ఫ్రెండ్లీ ఘోస్ట్ టీజర్ విడుదల !!!

ఫోనిక్స్ పిక్చర్స్ బ్యానర్‌పై, మాస్టర్ జియాన్స్ సమర్పణలో సత్యం రాజేష్, రియా సచ్యదేవ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న “ఫ్రెండ్లీ ఘోస్ట్”…

3 days ago

ఘనంగా ‘శివ గాడి జింద‌గీ’ మూవీ టైటిల్, సాంగ్ లాంచ్!

ఐశ్వర్య సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై సింధుసూర్య నిర్మిస్తున్న నూతన చిత్రం 'శివ గాడి జింద‌గీ'. సచిన్ రామ్ ప్రతాప్, హాసిని…

3 days ago

హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) “ది మేజ్” చిత్రంతో దర్శకుడిగా ప్రతిభ చాటనున్న డా. రవికిరణ్ గడలాయ్

ది మేజ్" చిత్రంతో దర్శకుడిగా డాక్టర్ కాబోయి యాక్టర్ కావడం చూస్తుంటాం కానీ డా. రవికిరణ్ గడలాయ్ ఎం.డి, పాథాలజిస్ట్…

3 days ago

‘అగధ’ డివైన్ మిస్టిక్ థ్రిల్లర్‌గా చాలా అద్భుతంగా ఉంటుంది – హీరో శ్రవణ్ రెడ్డి

ఎంఎస్ రాజు గారు ‘అగధ’ సీక్వెల్ ఎప్పుడు అంటారో చూడాలి - హీరో శ్రవణ్ రెడ్డి శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్…

3 days ago

పాతబస్తీ మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో బంగారు బోనం ఎత్తిన సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల

హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలు వైభవంగా కొనసాగుతున్న వేళ, సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల పాతబస్తీ మీరాలం మండిలోని…

3 days ago