మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యునిక్ యాక్షన్ థ్రిల్లర్ రావణాసుర. ఈ చిత్రాన్ని అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్ గ్రాండ్ స్కేల్ లో నిర్మిస్తున్నాయి. ఇందులో హీరో సుశాంత్ కీలక పాత్రలో పోషిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు.దీపావళి పండుగ సందర్భంగా సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 7,2023న వేసవిలో రావణాసుర సినిమా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. క్యారికేచర్‌గా రూపొందించిన అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో రవితేజ సిగరెట్ తాగుతూ ఇంటెన్స్ గెటప్ లో కనిపించారు.
సుధీర్ వర్మ, రవితేజను గతంలో ఎన్నడూ చూడని పాత్రలో ప్రజంట్ చేస్తున్నారు. యాక్షన్ హైలైట్‌గా ఉండేలా సినిమాలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి కథ అందించారు. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్ తో కథనంలో ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫర్ గా, శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
తారాగణం: రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు.
సాంకేతిక విభాగం
దర్శకత్వం: సుధీర్ వర్మ
నిర్మాత: అభిషేక్ నామా
బ్యానర్: అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్
కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: శ్రీకాంత్ విస్సా
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్
డీవోపీ: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్: శ్రీకాంత్
ప్రొడక్షన్ డిజైనర్: డిఆర్కే కిరణ్
సీఈఓ: పోతిని వాసు
మేకప్ చీఫ్: ఐ శ్రీనివాస్ రాజు
పీఆర్వో: వంశీ-శేఖర్
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…