యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల భారీ అంచనాలున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం విడుదల తేదీకి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఏజెంట్ 2023 సంక్రాంతికి విడుదల కానుంది. విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. గూఢచారిగా యాక్షన్-ప్యాక్డ్ రోల్ లో కనిపించబోతున్న ఈ చిత్రం కోసం అఖిల్ మేకోవర్ అద్భుతంగా వుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో అఖిల్ సూట్‌లో స్లిక్ అండ్ మోడరన్గా ఆకట్టుకున్నాడు. అఖిల్ స్టైలిష్ అండ్ డైనమిక్ రోల్‌లో కనిపించనున్న ఈ సినిమా టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ విడుదలైన తర్వాత అంచనాలు మరింత భారీగా పెరిగాయి.
సాక్షి వైద్య అఖిల్ కు జోడిగా నటిస్తుండగా, మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. రసూల్ ఎల్లోర్ కెమరామెన్ గా హిప్ హాప్ తమిళ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు.ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. ఎకె ఎంటర్ టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారుఅజయ్ సుంకర, దీపా రెడ్డి సహ నిర్మాతలు గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానుంది.
తారాగణం: అక్కినేని అఖిల్, సాక్షి వైద్య, మమ్ముట్టి
సాంకేతిక విభాగం :
దర్శకత్వం: సురేందర్ రెడ్డి
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
సహ నిర్మాతలు: అజయ్ సుంకర, దీపా రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి
బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా
కథ: వక్కంతం వంశీ
సంగీతం: హిప్ హాప్ తమిజా
డీవోపీ : రసూల్ ఎల్లోర్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్లా
పీఆర్వో: వంశీ-శేఖర్
నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి…
శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వద్ద నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్త్ర…
సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన 'జైలర్' చిత్రం 2023లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.…
సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్ ’ ఆర్య…
ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి…
ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా…