సెన్సార్ పూర్తి చేసుకున్న సునీల్ కుమార్ రెడ్డి “ కాక్రోచ్ “

సమాజం చీత్కరించుకొనే మురికి మనుషుల మధ్య నడిచే అందమైన ప్రేమ కథ “కాక్రోచ్”. అడ్డురోడ్ లో పడుపు వృత్తి చేసుకొనే వేశ్యకి , ఒక కిరాయి హంతకుడికి మధ్య సాగే స్వచ్ఛమైన స్నేహం “కాక్రోచ్”.
భ్రష్టు పట్టిన అవినీతి సమాజపు చీకటి ని మీకు పరిచయం చేసే చిక్కటి చిత్రం “కాక్రోచ్.”

కాక్రోచ్ ని చంపితే చప్పట్లు కొడుతూ, సీతాకోక చిలుకలపై కవితలు రాసే ద్వంద విలువల మనస్తత్వాలని ప్రశ్నించే పాత్రలతో దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి , శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై బి. బాపిరాజు నిర్మాతగా వ్యవహరించిన చిత్రం “కాక్రోచ్ “ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

చిత్రానికి సెన్సార్ బోర్డు “ఏ “సర్టిఫికెట్ మంజూరు చేసింది. సున్నిత మనస్కులు మరియు పిల్లలు ఈ చిత్రానికి దూరం గా ఉండాలని దర్శక నిర్మాతలు సవినయంగా పత్రికాముఖంగా గా కోరుకుంటున్నారు.
చిత్రాన్ని మార్చి మొదటి వారం లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నట్టు వారు ఆ ప్రకటనలో తెలిపారు.


ఈ చిత్రం లో ఉన్న హింసాత్మక పోరాటాలను సహజం గా చూపించడానికి రియల్ ఫైటర్స్ ని నటులు గా ఎన్నుకోవడం జరిగింది. అభిలాష్ సుంకర , ప్రేమసన్ , నవీన్ లు నిజజీవిత ఆధారిత కిరాయి హంతకులుగా నటించగా, సొంతవూరు చిత్రం లో ఉత్తమ నటి అవార్డు గ్రహీత “తీర్థ “ ఒక ముఖ్య పాత్ర పోషించగా , మీనాక్షి, రామన్ , బుగత, అంజి, ప్రదీప్. సముద్రం వెంకటేష్ , మల్లిక, ఎఫ్ ఎమ్ బాబాయ్, రాజు, బాలాజీ , ఎల్ బీ రమణ ఆర్ కే సింగ్. పూజా , పొట్టి మూర్తి , ప్రసాద్ , రేలారే రఘు బృందం , జానీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

చిత్రానికి సంగీతం ప్రదీప్ చంద్ర , ఎడిటర్ రఘు , ఫైట్ మాస్టర్ : ప్రేంసన్,కెమెరా సంతోష్.లిరిక్స్ : ప్రతాప్. సౌండ్: నాగరాజు , నిర్మాతలు : బి బాపిరాజు , ముతుకి నాగ సత్యనారాయణ , రచన దర్శకత్వం పి. సునీల్ కుమార్ రెడ్డి.

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

6 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

7 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

7 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago