సీనియర్ నటుడు మురళీధర్ గౌడ్, సీనియర్ నటి సుధ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. ‘జయమ్మ పంచాయతీ’ మూవీ ఫేమ్ దినేష్ కుమార్ హీరోగా, ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా నటించారు. తండ్రి, పిల్లల మధ్య భావోద్వేగాల నేపథ్యంలో వారి వారి బాధ్యతలను తెలియజేసేలా రూపొందిన ఈ సినిమాను డైరెక్టర్ సతీష్ ఆవాల తెరకెక్కిస్తున్నారు. కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం పల్లెటూరి నేపథ్యంలో సాగే క్యూట్ లవ్‌స్టోరీతో పాటు ఫాదర్ సెంటిమెంట్ ప్రధానంగా ఉండనుంది. ఈ చిత్రంలో సీనియర్ దర్శకుడు, రచయిత, నటుడు యనమదల కాశీవిశ్వనాథ్, మిర్చిమాధవి, జబర్దస్త్ ఫేం సత్యశ్రీ, మొగలిరేకులు సీరియల్ ఫేం ఇక్బాల్, జీవనప్రియ, గౌరీనాయుడు, హరీష్ టెక్కలి, హాసిని యామిని కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ పాల్గొన్నారు. టైటిల్ చాలా బాగుందని, సినిమా కూడా బాగుంటుందని సురేష్ బాబు అన్నారు.
ఈ సందర్భంగా సీనియర్ నటుడు మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ..‘‘ఈ చిత్రంలో వెంకట్రామయ్య గారు పాత్రను నేను పోషించా. నేను మనసు పెట్టి ఆత్మతో చేసిన సినిమా ఇది. ఇందులో చాలా గొప్ప థీమ్ ఉంది. అలాగే మంచి సందేశం ఉంది. తల్లిదండ్రుల ఆవేదన, పిల్లల బాధ్యతను చెప్పే సినిమా ఇది. గొప్ప కుటుంబ కథా చిత్రంగా ఉంటుంది.’’ అని చెప్పారు.
సీనియర్ నటుడు కాశీవిశ్వనాథ్ మాట్లాడుతూ..‘‘మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మంచి కుటుంబ కథా చిత్రంగా వస్తోంది. సెంటిమెంట్ పరంగా, అన్నిరకాలుగా మూవీ బాగుంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సురేష్ బాబుగారు లాంచ్ చేశారు. ఆయన హ్యాండ్ చాలా లక్కీ హ్యాండ్. అది సినిమాకు బాగా హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు.
హీరో దినేష్ కుమార్ మాట్లాడుతూ..‘‘ఈ సినిమా అన్ని వర్గాల వారు చూడదగ్గ చిత్రం. కుటుంబ సమేతంగా అందరూ చూడాలని కోరుతున్నా.’’ అన్నారు.
నిర్మాత కోమలి మాట్లాడుతూ..‘‘సింగర్ అయిన నేను ఈ సినిమాతో నిర్మాతగా మారాను. ఈ సినిమాలో నటించిన అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. మంచి కుటుంబ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీని ఉగాది సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులందరూ సపోర్ట్ చేసి మా సినిమాను ఆశీర్వదించండి’’ అన్నారు.
డైరెక్టర్ సతీష్ మాట్లాడుతూ..‘‘సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. కుటుంబమంతా కలిసి ఆహ్లాదంగా చూడదగ్గ సినిమా. శతమానం భవతి, బలగం, ఆ నలుగురు లాంచి మంచి కంటెంట్ ఉన్న సినిమా. మంచి సినిమాను ఎప్పుడూ ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా సినిమాను కూడా చూసి ఆదరించాలని కోరుతున్నా.’’ అన్నారు.
నటి మిర్చి మాధవి మాట్లాడుతూ..‘‘నా పాత్రను చాలా చక్కగా డిజైన్ చేశారు. హీరో తల్లిగా నా పాత్ర చుట్టూ స్టోరీ చాలా మలుపులు తిరుగుతుంది. పల్లెటూరి నేపథ్యంలో జరిగే క్యూట్ లవ్‌స్టోరీ. అన్ని రకాల ఎమోషన్స్‌తో అందరినీ మెప్పించేలా ఈ సినిమాను డైరెక్టర్ సతీష్ తీర్చిదిద్దారు. అందరూ తప్పకుండా చూడండి.’’ అన్నారు.
నటి సత్యశ్రీ మాట్లాడుతూ..‘‘ఈ సినిమాలో నేను ఫ్రెండ్ రోల్ చేశాను. ఇందులో నా క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పటి దాకా నన్ను కామెడీ పాత్రల్లో చూశారు. ఇందులో నటనకు ఆస్కారమున్న ఎమోషనల్ క్యారెక్టర్‌లో చూస్తారు. సినిమాలో నా పాత్ర చూసి థ్రిల్ ఫీలవుతారు. నన్ను నమ్మి నాకు ఈ పాత్రను ఇచ్చిన డైరెక్టర్‌కు థ్యాంక్యూ.’’ అని అన్నారు.
తారాగణం: మురళీధర్ గౌడ్, సుధ, దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్, కాశీవిశ్వనాథ్, మిర్చి మాధవి, సత్యశ్రీ, ఇక్బాల్, జీవనప్రియ, గౌరీనాయుడు, హరీష్ టెక్కలి, యూట్యూబర్ సంతూముంజెటి, హాసిని యామిని తదితరులు
సాంకేతిక బృందం:
బ్యానర్: కోమలి క్రియేషన్స్
నిర్మాతలు: కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: సతీష్ ఆవాల
కొరియోగ్రాఫర్: సాగర్ మాస్టర్
మ్యూజిక్ డైరెక్టర్: చరణ్ అర్జున్
కెమెరామెన్: బి. అనిల్ కుమార్
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…