“చెన్నై లవ్ స్టోరీ” టైటిల్, గ్లింప్స్ రిలీజ్

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ, “కలర్ ఫొటో”, “బేబి” మేకర్స్ కాంబో క్రేజీ మూవీ “చెన్నై లవ్ స్టోరీ” టైటిల్, గ్లింప్స్ రిలీజ్

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం, యంగ్  టాలెంటెడ్ హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ జంటగా “కలర్ ఫొటో”, “బేబి” వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన దర్శక నిర్మాత సాయి రాజేశ్, ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీకి “చెన్నై లవ్ స్టోరీ” టైటిల్ ఖరారు చేశారు. ఈ రోజు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా ఈ సినిమా టైటిల్ తో పాటు గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై సాయి రాజేశ్, ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు.

తొలి ప్రేమేం తోపు కాదు, ఫస్ట్ లవ్ ఫెయిలైతే బెస్ట్ లవ్ ఎక్కడో మొదలువుతుందని చెబుతూ సాగిన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఈ గ్లింప్స్ లో హీరో కిరణ్ అబ్బవరం ఫ్రెష్ లుక్ లో కనిపిస్తున్నారు. శ్రీ గౌరి ప్రియ స్క్రీన్ ప్రెజెన్స్ ఇంప్రెస్ చేసింది. సముద్రపు ఒడ్డున ఈ జంట ఫస్ట్ లవ్, బెస్ట్ లవ్ గురించి మాట్లాడుకున్న సంభాషణ ఆసక్తికరంగా, ఆలోచింపజేసేలా సాగింది. ‘తొలి ప్రేమకు మరణం లేదు’ అనే “బేబి” సినిమాలోని ఫేమస్ డైలాగ్ ను హీరోయిన్ చెబుతూ తొలిప్రేమే గొప్పదని అంటుంది. అందుకు హీరో స్పందిస్తూ  ‘తొలి ప్రేమేం తోపు కాదు, ఫస్ట్ లవ్ ఫెయిలైతే బెస్ట్ లవ్ ఎక్కడో మొదలువుతుంది..’ అని సమాధానం చెబుతాడు. అంతం వరకు అనంతమై సాగే ఈ జీవితంలో తొలి ప్రేమ ఒక మజిలీ మాత్రమేనని, అదే తుది కాదనే కాన్సెప్ట్ ను ఈ గ్లింప్స్ ద్వారా మేకర్స్ అందంగా తెలియజేశారు. ఈ గ్లింప్స్ కు ‘తొలి ప్రేమే తోపు కాదే తోపు కాదే..’ అంటూ మెలొడీ బ్రహ్మ మణిశర్మ బ్యూటిఫుల్ బీజీఎం సాంగ్ కంపోజ్ చేశారు.

నటీనటులు – కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ, తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్ డిజైనర్ – దేవి పర్చూరి
ఆర్ట్ – భాస్కర్ ముదావత్
ఎడిటర్ – సంతోష్ నాయుడు
డీవోపీ – విశ్వాస్ డేనియల్
లిరిక్స్ – అనంత్ శ్రీరామ్
మ్యూజిక్ డైరెక్టర్ – మణిశర్మ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – విశాల దాట్ల
లైన్ ప్రొడ్యూసర్ –శ్యామ్ ప్రసాద్ మేక
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్), వంశీ కాకా
మార్కెటింగ్ – హౌస్ ఫుల్
కో ప్రొడ్యూసర్ – ధీరజ్ మొగిలినేని
ఇన్వెస్టర్స్ – రమేష్ పెద్దింటి, శేఖర్ బాలబొమ్మ
స్టోరీ – సాయి రాజేశ్
నిర్మాతలు – సాయి రాజేశ్, ఎస్ కేఎన్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – రవి నంబూరి

Tfja Team

Recent Posts

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

3 days ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

3 days ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

3 days ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

3 days ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

3 days ago

‘దేఖ్‌లేంగే సాలా’ పాటతో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి తీర్చిన దర్శకుడు హరీష్ శంకర్

శ్రోతలను ఉర్రుతలూగిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి గీతం ‘దేఖ్‌లేంగే సాలా’ 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో…

3 days ago