జియోహాట్‌స్టార్, డిస్నీ+ హాట్‌స్టార్ నుంచి జియో హాట్ స్టార్‌గా పున: నిర్మితమై ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు తిరుగులేని, బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోన్న సంగతి తెలిసిందే.తాజాగా హాట్‌స్టార్ స్పెషల్స్‌లో భాగంగా, ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘దేవిక అండ్ డానీ’ అనే వెబ్ సిరీస్‌ను జూన్6 నుంచి అందిస్తుంది. ఈ వెబ్‌సిరీస్‌లో రీతూ వర్మ, సూర్య వశిష్ట, శివ కందుకూరి, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, కోవై సరళ, సోనియా సింగ్, గోకరాజు రమణ, శివన్నారాయణ, వివా హర్ష, షణ్ముఖ్, అభినయ శ్రీ, మౌనికా రెడ్డి, ఈశ్వర్య వుల్లింగల తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. బి.కిషోర్ దర్శకత్వంలో సుధాకర్ చాగంటి దీన్ని నిర్మించారు. జూన్6 నుంచి ఈ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో…
హీరోయిన్ రీతూవర్మ మాట్లాడుతూ ‘‘వెబ్ సిరీస్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఔట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ వస్తే చేద్దామనుకున్నాను. ఆ సమయంలో ‘దేవిక అండ్ డానీ’ వంటి నిజాయతీతో కూడిన కథ నా దగ్గరకు వచ్చింది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి ఓ కథను నమ్మి ప్రొడ్యూస్ చేసిన మా సుధాకర్‌గారికి థాంక్స్. ఆయన మంచి సినిమాలను, సిరీస్‌లను అందించాలనే ఉద్దేశంతో జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌ను స్టార్ట్ చేశారు. ఇంకా ఇలాంటి సిరీస్‌లు, సినిమాలను ఎన్నింటినో చేయాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ కిషోర్‌గారు చాలా సరదాగా ఉండే వ్యక్తి. ఫోకస్‌గా ఉంటారు. వెంకట్ దిలీప్‌గారు మిస్టర్ పర్‌ఫెక్ట్. ఇప్పుడు స్క్రీన్‌పై చూస్తుంటే ఆయన ఎంత గొప్పగా ఆలోచించారో అర్థమవుతుంది. మా డానీ సూర్య ఎంతో హార్డ్ వర్కింగ్ పర్సన్. చాలా ఇన్‌వాల్వ్ అయ్యి నటించాడు. సుబ్బు పాత్రలో నటించిన శివ కందుకూరి తన పాత్రలో ఒదిగిపోయారు. సుబ్బరాజుగారు, కోవైసరళగారు సహా ఎంటైర్‌టీమ్‌కు థాంక్స్. నందిని ఎంతో హార్డ్ వర్క్ చేసింది. తనకు స్పెషల్ థాంక్స్. చాలా మంది అమ్మాయిలకు చుట్టు పక్కల ఉండేవాళ్లు నువ్వు ఇది చేయలేవు అని చెప్పి డిస్కరేజ్ చేస్తుంటారు. కానీ అలాంటి వారికి ఈ సిరీస్ ఓ నమ్మకాన్ని కలిగిస్తుంది. మా సిరీస్ ‘దేవిక అండ్ డానీ’ జూన్6 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది’’ అన్నారు.
సూర్యవశిష్ట్ మాట్లాడుతూ ‘‘సాధారణంగా ఊర్లలో ఉండే అమ్మాయిలకు చాలా ఇబ్బందులుంటాయి. ఈ పని చేయాలని, ఆ పని చేయకూడదని అంటుంటారు. అలాంటివాళ్లు బయటకు వెళితే ఎలా మారుతారనే ఓ విషయాన్ని చక్కగా ‘దేవిక అండ్ డానీ’లో చూపించారు. దేవిక అనే అమ్మాయి జీవితాన్ని డానీ, సుబ్బు లాంటి పాత్రలు ఎలా మార్చాయనేది కూడా ఇందులో చూడొచ్చు. తప్పకుండా ఈ సిరీస్ అందరికీ నచ్చుతుంది. నిర్మాత సుధాకర్ అరుదైన వ్యక్తి. మా డైరెక్టర్ కిషోర్‌గారు మా ఫ్యామిలీ మెంబర్‌లా మాతో కలిసిపోయారు. సినిమాటోగ్రాఫర్ దిలీప్‌గారి ఫ్రేమింగ్, లైటింగ్ సూపర్బ్. నందినిగారు బిహైండ్ ది సీన్స్ ఎంతో కష్టపడ్డారు. ఫ్రెష్ కంటెంట్‌ను అందిస్తోన్న జియో హాట్‌స్టార్‌కి థాంక్స్. రీతూవర్మ చాలా మంచి కోస్టార్. శివ కందుకూరి అయితే నా బ్రదర్‌లా మారిపోయారు. తను అద్భుతంగా నటించాడు. డానీ పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. ఆడియెన్స్‌కు అన్నీ పాత్రలు చక్కగా కనెక్ట్ అవుతాయి’’ అన్నారు.
శివ కందుకూరి మాట్లాడుతూ ‘‘వెబ్ సిరీస్ అంటే సాధారణంగా ఎంత వల్గర్ ఉందనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ‘దేవిక అండ్ డానీ’ వంటి క్లీన్ స్క్రిప్ట్‌ను యాక్సెప్ట్ చేయటం గొప్ప విషయం. మంచి వేల్యూస్ ఉన్న స్క్రిప్ట్‌ను ఒప్పుకున్నందుకు జియో హాట్‌స్టార్ వారికి ధన్యవాదాలు. మంచి కంటెంట్‌ను అందించటానికి వారు ముందుకొచ్చారు. మా నిర్మాత సుధాకర్‌గారికి థాంక్స్. సినిమాకు ఏమాత్రం తగ్గకుండా గొప్ప టెక్నికల్ వేల్యూస్‌తో సిరీస్‌ను రూపొందించారు. ఇందులో నేను సుబ్బు అనే పాత్రను పోషించాను. దేవిక అనే అమ్మాయి జీవితంలో వచ్చే ప్రతీ పాత్ర ఎలా ట్రావెల్ చేసిందో ఇందులో మనం చూడొచ్చు. సుబ్బు అనే ఫన్నీ పాత్రను చేయటాన్ని ఎంజాయ్ చేశాను. నాపై నమ్మకంతో నాకు ఇంత మంచి పాత్ర ఇచ్చిన మా డైరెక్టర్ కిషోర్‌గారికి థాంక్స్. మా అందరినీ ఇంత బాగా చూపించిన మా సినిమాటోగ్రాఫర్ వెంకట్ దిలీప్‌గారికి థాంక్స్. దేవిక పాత్రను రీతూవర్మ గొప్పగా చేసింది. ఆమె ఇంతకు ముందు చాలా మంచి పాత్రల్లో మనకు కనిపించింది. ఇప్పుడిది మరో మంచి పాత్ర అవుతుంది. సూర్యవశిష్ట్ చేసిన డానీ, తన పాత్రలోని వేరియేషన్స్‌ను చక్కగా చేశాడు. ‘దేవిక అండ్ డానీ’ జూన్ 6 నుంచి జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అందరికీ ఈ సిరీస్ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.
నిర్మాత సుధాకర్ చాగంటి మాట్లాడుతూ ‘‘‘దేవిక అండ్ డానీ’ వంటి సిరీస్‌తో మీ ముందుకు రానుండటం ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఏడు ఎపిసోడ్స్ ఉన్న సిరీస్. జియో హాట్‌స్టార్ వారు ఎంతగానో సపోర్ట్ చేశారు. జూన్6న స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్‌ను ఎంతగానో ఎంజాయ్ చేస్తారు. ఎంటర్‌టైన్మెంట్, ఎమోషన్స్ సహా అన్నీ ఎలిమెంట్స్ ఉండే సిరీస్ ఇది. నందినిగారికి థాంక్స్. ఆమె ఎంతో సపోర్ట్ చేశారు. దర్శకుడు కిషోర్‌గారు సిరీస్‌ను చక్కగా తెరకెక్కించారు. వెంకట్‌గారు ఫెంటాస్టిక్ విజువల్స్ అందించారు. దీపక్‌రాజ్‌గారు కథ, డైలాగ్స్ ఇచ్చినందుకు ఆయనకు స్పెషల్ థాంక్స్. దేవిక పాత్రలో రీతూవర్మ అద్భుతంగా నటించారు. ఓ పల్లెటూరులో ఉండే ఓ అమ్మాయి ఎలా ఎదిగిందనే కథతో ఇది రూపొందింది. డానీ పాత్రలో సూర్య, సుబ్బు పాత్రలో శివ కందుకూరి చక్కగా నటించారు. అందరికీ థాంక్స్’’ అన్నారు.
డైరెక్టర్ బి.కిషోర్ మాట్లాడుతూ ‘‘‘శ్రీకారం’ తర్వాత ఈ సిరీస్ చేయటం చాలా ఆనందంగా ఉంది. టీజర్, ట్రైలర్, ఇప్పుడు చూసిన రెండు ఎపిసోడ్స్ అందరికీ నచ్చే ఉంటుంది. దీపక్ రాజ్ అనే రైటర్ దగ్గర నుంచి ఈ ప్రయాణం ప్రారంభమైంది. తర్వాత ఈ జర్నీలో రీతూవర్మ, సూర్య, శివ కందుకూరి, సుబ్బరాజ్‌గారు అందరూ చక్కగా సపోర్ట్ చేశారు. సినిమాటోగ్రాఫర్ వెంకట్ దిలీప్‌గారు అద్భుతమైన విజువల్స్‌ను అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ జై క్రిష్, ఎడిటర్ కార్తీక్ అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. నందినిగారు బిహైండ్ ది స్క్రీన్ అంతా తానై సపోర్ట్ చేశారు. మా నిర్మాత సుధాకర్‌గారు తన ప్రయాణాన్ని సిరీస్‌తో ప్రారంభించారు. ఇంకా ఎన్నో గొప్ప సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ‘దేవిక అండ్ డానీ’ సిరీస్ చూసే ఆడియెన్స్ సమయం వృథా కాదు. ప్రతీ క్షణాన్ని ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో మౌనిక, నందిని, సినిమాటోగ్రాఫర్ వెంకట్ సి.దిలీప్, మ్యూజిక్ డైరెక్టర్ జై క్రిష్, ఎడిటర్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…