‘బలగం’.. మార్చి 3న గ్రాండ్ రిలీజ్

Must Read

దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత నిర్మిస్తోన్న సినిమా ‘బలగం’. ప్రియ‌ద‌ర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని  ‘యు’ స‌ర్టిఫికేట్ పొందిది. ఇప్పుడు మేక‌ర్స్ బ‌ల‌గం సినిమాను మార్చి 3న రిలీజ్ చేస్తున్న‌ట్లు తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా.. 

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ ‘‘‘బలగం’ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సినిమాకు యు స‌ర్టిఫికేట్ వ‌చ్చింది. కొత్త కాన్సెప్ట్ సినిమాల‌ను చేస్తూ కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేసే ఉద్దేశంతో హ‌ర్షిత్‌, హ‌న్షిత క‌లిసి దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ను స్టార్ట్ చేశారు. అందులో భాగంగా వేణుతో బ‌లగం సినిమాను చేశాం. ఈ సినిమాను మార్చి 3న మీ ముందుకు తీసుకు వ‌స్తున్నాం. తెలంగాణ ప‌ల్లెటూరి నేప‌థ్యంలో సాగే సినిమా. ప్రియ‌ద‌ర్శి, కావ్యా క‌ళ్యాణ్ రామ్‌లు స‌హా ప్ర‌తి ఒక పాత్ర మిమ్మ‌ల్ని హాంట్ చేస్తుంది. సినిమాను చూసిన వారందరూ అప్రిషియేట్ చేశారు. 

సినిమాలో హీరో తాత పాత్ర‌లో న‌టించిన సుధాక‌ర్ రెడ్డిగారు, హీరో తండ్రి పాత్ర‌లో న‌టించిన జ‌య‌రాం, అలాగే  నారాయ‌ణ పాత్ర‌లో ముర‌ళీధ‌ర్‌, హీరో మేన‌త్త పాత్రలో విజ‌య లక్ష్మి, హీరో త‌ల్లి పాత్ర‌లో స్వ‌రూప‌, హీరో బాబాయ్ పాత్ర‌లో మొగిలి ఇలా పాత్ర‌ల‌న్నీ మ‌న‌కు గుర్తుండిపోతాయి. ఒక‌ట్రెండు మిన‌హా మిగిలిన పాత్ర‌ల‌న్నింటిలో కొత్త వారినే తీసుకున్నాం. 

భీమ్స్ సంగీతంలో కాస‌ర్ల శ్యామ్ రాసిన పాట‌లు హృదయాల‌కు హ‌త్తుకుంటాయి. మంచి ఎంట‌ర్‌టైన్మెంట్‌తో పాటు ఎమోష‌న్స్ కూడా ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ఊరు ప‌ల్లెటూరు సాంగ్ పొట్టి పిల్ల సాంగ్‌ల‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తున్నాయి. సినిమా ఆర్గానిక్‌గా ఆడియెన్స్‌లోకి  పాట‌లు వెళ్లాయి. సినిమా మీకు త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది’’ అన్నారు. 

న‌టీన‌టులు:  

ప్రియద‌ర్శి, కావ్యా క‌ళ్యాణ్ రామ్‌, సుధాక‌ర్ రెడ్డి, ముర‌ళీధ‌ర్ గౌడ్‌, రూప లక్ష్మి, జ‌య‌రాం, విజ‌య‌ల‌క్ష్మి త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ఎ దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్

స‌మ‌ర్ప‌ణ‌:  శిరీష్‌

ద‌ర్శ‌క‌త్వం:  వేణు ఎల్దండి

నిర్మాత‌లు: హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత‌

సినిమాటోగ్ర‌ఫీ:  ఆచార్య వేణు

కథా విస్తరణ స్క్రీన్ ప్లే: రమేష్ ఎలిగేటి – నాగరాజు మడూరి

సంగీతం:  భీమ్స్ సిసిరోలియో

ఎడిట‌ర్‌:  మ‌ధు

పాట‌లు:  శ్యామ్ కాస‌ర్ల‌

మాట‌లు: వేణు ఎల్దండి, రమేష్ ఎలిగేటి – నాగరాజు మడూరి

ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌:  ర‌మ‌ణ వంక‌

పి.ఆర్.ఓ:  వంశీ కాకా

Latest News

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ...

More News