‘బచ్చల మల్లి’ మంచి ఫ్యామిలీ ఎమోషనల్ యాక్షన్ డ్రామా

Must Read

హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బచ్చల మల్లి’. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలై టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. బచ్చల మల్లి డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత రాజేష్ దండా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

బచ్చల మల్లి కథ ఎప్పుడు విన్నారు? ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది?
-ఇట్లు మారేడుమిల్లి సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు బచ్చలపల్లి కథ విన్నాను. కథ వినగానే బాడీలో ఒక ఎనర్జీ క్రియేట్ అయింది. మంచి ఎమోషనల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. నా మైండ్ లో ఈ కథ ఉండిపోయింది. ఎక్కడికి వెళ్లినా ఈ కథే గుర్తుకొచ్చేది. నరేస్గ్ గారికి కథ చాలా నచ్చింది. అయితే అప్పటికి నరేష్ గారు వేరే సినిమాలు కమిట్ అవ్వడం వల్ల ఆయన కోసం రెండేళ్లు వెయిట్ చేసి ఈ సినిమా చేశాం. బచ్చలమల్లి క్యారెక్టర్ డ్రివెన్ సినిమా. 1980లో జరిగే కథ.

ఇది రియల్ లైఫ్ స్టొరీనా?
మా డైరెక్టర్ గారిది తుని. అదే ఊర్లో బచ్చలపల్లి అనే ఒక వ్యక్తి ఉన్నారు. కేవలం ఆయన పేరుని మాత్రమే ఈ సినిమా కోసం తీసుకున్నాం. ఇది ఫిక్షనల్ స్టోరీ.

-రామ్ చరణ్ గారికి రంగస్థలం ఎలానో నరేష్ గారికి బచ్చలపల్లి అలాంటి సినిమా అవుతుంది. మంచి మంచి కథలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా అద్భుతంగా వచ్చింది. సినిమా చూసి ఇది నరేష్ 2.0 అని ఫీల్ అవుతారు.

బచ్చలపల్లి ఎలాంటి కథ?
లైఫ్ లో తప్పులు చేయొచ్చు. కానీ సరిదిద్దుకోలేని తప్పులు చేస్తే ఎలా ఉంటుందో బచ్చలపల్లి చూపించాం. మూర్ఖత్వం బోర్డర్ దాటేసిన క్యారెక్టర్ ఇది. సినిమాలో ఎమోషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. డైరెక్టర్ సుబ్బు చాలా కసితో సినిమా చేశాడు. చాలా హార్డ్ వర్క్ చేశారు. మళ్ళీ మళ్ళీ తనతో వర్క్ చేయాలని వుంది. మా బ్యానర్ లో తను వన్ అఫ్ ది బెస్ట్ డైరెక్టర్.

మీ సినిమాలన్నిటికీ చాలా మంచి పేరు వచ్చింది. కథల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?

  • నేనొక ఆడియన్ గానే కథ వింటాను. ఫస్ట్ అఫ్ ఎక్సయిట్ చేస్తేనే సెకండ్ హాఫ్ వింటాను. ఒకే తరహాలో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్టులు చేయాలని భావిస్తాను. నా సినిమాలు మీరు గమనిస్తే ఒక దానికి ఒకటి పోలిక లేకుండా అన్ని డిఫరెంట్ జోనర్స్ లో ఉంటాయి.

విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ గురించి?
-ఈ సినిమాలో విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ వన్ అఫ్ ది హైలెట్. పాటలు ఇప్పటికే జనాల్లోకి వెళ్ళాయి. సినిమా చూసిన తర్వాత ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా చేశారు. ఆర్ఆర్ తో నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళారు.

-డిఓపి రిచర్డ్ ఎం నాథన్ కూడా చాలా అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించారు. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి నా మొదటి నుంచి వర్క్ చేస్తున్నారు. ఇందులో బ్రిలియంట్ వర్క్ ఇచ్చారు. ఫైట్ మాస్టర్ ప్రుద్వి గూస్ బంప్స్ ఫైట్స్ అందించారు. ఇందులో నరేష్ గారి ఫైట్స్ చూసి ఆడియన్స్ సర్ ప్రైజ్ అవుతారు.

ఈ కథలో మీరు పర్సనల్ గా కనెక్ట్ అయినా పాయింట్ ఏంటి?
-నేను విలేజ్ నుంచి వచ్చాను. విలేజ్ లో ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి. అలాగే హీరో క్యారెక్టర్ డ్రివెన్ సినిమాలు ఎప్పుడు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ప్రేక్షకులకి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. ఇందులో మంచి క్యారెక్టరైజేషన్, లవ్ స్టోరీ, ఎమోషన్స్.. ఇవన్నీ కూడా నన్ను ఎక్సయిట్ చేశాయి. కథ విన్నప్పుడు ఎంత ఎమోషన్ అయితే ఉందో సినిమా చూసిన తర్వాత కూడా అంతే ఎమోషనల్ గా అనిపించింది. అందుకే సినిమా పై చాలా నమ్మకంగా ఉన్నాను.

హీరోయిన్ అమృత అయ్యర్ గురించి?
-హనుమాన్ సినిమా టీజర్ చూసి ఆమెను సంప్రదించడం జరిగింది. ఇందులో అమృతది మంచి పర్ఫామెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్. మెమొరబుల్ గా ఉంటుంది. తనకి చాలా మంచి పేరు వస్తుంది.

నరేష్ గారితో ఇట్లు మారేడుమిల్లి, ఇప్పుడు బచ్చల మల్లి రెండు కూడా సీరియస్ ఫిలిమ్స్ చేశారు. కామెడీ సినిమా చేసే ఆలోచన ఉందా?
-నెక్స్ట్ ఇయర్ చేయాలని ఆలోచన ఉంది. సామజవరగమన లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనుకుంటున్నాను. అదే రైటర్స్ కథ రాస్తున్నారు. కథ రెడీ అవ్వగానే అనౌన్స్ చేస్తాం.

రావు రమేష్ గారి క్యారెక్టర్ గురించి?
-రావు రమేష్ గారి క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటుంది. ఈ కథ విన్నప్పుడే ఆ క్యారెక్టర్ ని ఆయనే చేయాలని భావించాం. చాలా అద్భుతంగా వచ్చింది.

బచ్చలమల్లి విషయంలో ఎలాంటి చాలెంజెస్ ఎదుర్కొన్నారు?
ఛాలెంజ్ ఏం లేదండి. షూట్ అంత అవుట్ డోర్ చేసాం. అది కొంచెం డిఫికల్ట్ గా అనిపించింది.

ఊరు పేరు భైరవకోనకి సీక్వెల్ ఉందా?
-అది మా డైరెక్టర్ వి ఐ ఆనంద్ గారు చెప్పాలి. (నవ్వుతూ)

మీకు ఇష్టమైన జోనర్ ?
-నాకు కమర్షియల్ సినిమాలు ఇష్టం.

కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?
-సందీప్ కిషన్ గారితో చేస్తున్న ‘మజాకా’ నాకు చాలా ఇష్టమైన సినిమా. అలాగే కిరణ్ అబ్బవరం గారి సినిమా ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక పాన్ ఇండియా సబ్జెక్ట్ కుదిరింది. త్వరలో ఆ వివరాలు చెప్తాను.

ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News