బేబీ ..ఫ్రెష్ అప్రోచ్ ఉన్న లవ్ స్టోరి – హీరో విరాజ్ అశ్విన్

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్యలు కలిసి నటించిన మూవీ బేబీ. కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డ్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన సాయి రాజేష్ దర్శకత్వంలో బేబీ అనే సినిమా రాబోతోంది. ఇక ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. జూలై 14న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రంలో తన పాత్ర విశేషాలు తెలిపారు హీరో విరాజ్ అశ్విన్

  • ఈ సినిమాలో నా పాత్ర పేరు విరాజ్. తొలిసారి నా రియల్ నేమ్ క్యారెక్టర్ చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఆనంద్, వైష్ణవి, నా పాత్రలు చాలా సహజంగా ఉంటాయి. రియల్ వరల్డ్ తో కనెక్ట్ అయినట్లు బిహేవ్ చేస్తుంటాయి. నేను కాలేజ్ స్టూడెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. జీవితం గురించి ఏమీ తెలియని ఓ కుర్రాడు. యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా ఉంటాడు.
  • బేబీ గురించి చెప్పాలంటే దర్శకుడు సాయి రాజేష్ ప్రతి విషయాన్ని జాగ్రత్తగా డీల్ చేశాడు. ప్రతి క్యారెక్టర్ కు ఒక బ్యాక్ స్టోరి చెప్పారు. దాంతో నా క్యారెక్టర్ అలా ఎందుకు బిహేవ్ చేస్తుంది అనేది తెలిసిపోయి యాక్టింగ్ ఈజీ అయ్యింది. మా సినిమా ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. బేబీ సినిమాలో డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణ అవుతాయి.
  • ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ కొత్త టోన్ ఇచ్చింది. విజువల్ గా బ్యూటీ ఉంటుంది. ఎలాంటి సీన్స్ అయినా కొత్త కలర్ కనిపిస్తుంది. అలాగే విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ హైలైట్ గా నిలుస్తుంది. ఈ సినిమాకు విప్లవ్ ఎడిటింగ్ కూడా క్రిస్పీ నెస్ తెచ్చింది. చాలా షార్ప్ గా ప్లెజంట్ వేలో ఎడిట్ చేశారు.
  • నా సినిమాల్లో ప్రాపర్ గా థియేటర్ రిలీజ్ కు వస్తున్న సినిమా ఇది. ఇందులో ప్రతి క్యారెక్టర్ కు యాక్టింగ్ కు స్కోప్ ఉంటుంది. నా క్యారెక్టర్ కు కూడా యాక్టింగ్ స్కోప్ బాగుంది.
  • మీరు ట్రైలర్ లో చూసినట్లు ఒక అమ్మాయి స్కూల్ డేస్ లో ఆనంద్ ను ప్రేమిస్తుంది. అలాగే కాలేజ్ లో నేను తనను లవ్ చేస్తాను. ఇలా క్యారెక్టర్స్ పరంగా హీరోయిజం, ప్రాధాన్యత ఉంటుంది కానీ వీళ్లు హీరో అనేది సెపరేట్ గా ఉండదు. మా సినిమాకు చాలా మంది హీరోలు ఉన్నారు.
  • వైష్ణవి తన క్యారెక్టర్ లో చాలా బాగా నటించింది. ఆమెకు ఓటీటీల్లో నటించిన ఎక్సీపిరియన్స్ ఉంది. అయినా ఇలాంటి పెద్ద సినిమాను తన భుజాలపై వేసుకుంది. ఎందుకంటే సినిమా అంతా తన చుట్టూ రిలేట్ అయి ఉంటుంది. వైష్ణవి బేబీ హీరోయిన్ గా పర్పెక్ట్ ఛాయిస్ అనుకోవచ్చు.
  • రిచ్ అయినా పూర్ అయినా కాలేజ్ డేస్ లో స్టూడెంట్స్ లో ఒక రెబలిజం ఉంటుంది. నాదే ప్రపంచం అనే భావన ఉంటుంది. నేను ఫీల్ కు రిలేట్ అయ్యాను. ఈ సినిమాలో ప్రేమను పెయిన్ ద్వారా చూపించాం. అందుకే ఇదొక ఎమోషనల్ లవ్ స్టోరి అనుకుంటున్నారు.
  • నేను చూసిన లవ్ స్టోరీస్ తో పోల్చితో ఇదొక ఫ్రెష్ అప్రోచ్డ్ ప్రేమ కథ అనుకుంటాను. ట్రయాంగిల్ లవ్ స్టోరి అయినా రెగ్యులర్ గా, రొటీన్ గా ఉండదు. ప్రతి టెక్నీషియన్ సినిమా కథను ఎంతబాగా ప్రెజెంట్ చేయాలో అంత బాగా ప్రెజెంట్ చేశారు. ఎస్కేఎన్ పర్పెక్ట్ ప్రొడ్యూసర్ అనిపిస్తుంటుంది.
  • మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ప్రస్తుతం మరీచిక అనే మూవీ చేస్తున్నాను. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
Tfja Team

Recent Posts

నిర్మాత రమేష్ వర్మ ‘కొక్కొరొకో’ గ్లింప్స్ విడుదల.. విజువల్స్‌తో ఆక‌ట్టుకుంటోన్న శీను – పార్వతీల అందమైన ప్రేమకథ.. త్వ‌ర‌లోనే గ్రాండ్ రిలీజ్‌..!

యంగ్ టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించడంలో ముందుండే ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ.. కొత్త దర్శకులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆర్‌.వి…

4 hours ago

‘ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రం అందరికీ రిలేట్ అయ్యేలా ఉంటుంది – సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వంశీ నందిపాటి..!

వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఇంకా ఏం అనుకోలేదు!’. వంశీ నందిపాటి నిర్మాతగా కన్ను…

4 hours ago

‘పొలిమేర 3’ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ‘విరావి’ ఫస్ట్ లుక్ విడుదలతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ‘పొలిమేర 3..!

మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…

1 day ago

మళ్లీ విద్యార్థినిగా మారిన మంచు లక్ష్మి! హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ఏం నేర్చుకుంటున్నారు?

మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…

1 day ago

‘ఆలోచన’ సినిమా ఈనెల 27న విడుదల..!

పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…

1 day ago

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి నుంచి రాబోతోన్న ప్రొడక్షన్ నెం. 2.. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్..!

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’…

1 day ago