క్రికెటర్ కావాలని కలలు కంటూ ఆ రంగంలో రాణిస్తున్న ఆ కుర్రాడు… కారణాంతరాల వల్ల ఆ క్రీడలో తన కల సాకారం అయ్యే అవకాశాలు లేకపోవడంతో… సినిమా రంగంపై దృష్టి సారించాడు. అయితే సినిమా రంగంలో రాజ్యమేలుతున్న వారసత్వాన్ని డీ కొట్టే సాహసం చేయడం ఇష్టం లేక… “చలో ముంబై” అంటూ ప్రతిభకు పట్టాభిషేకం చేస్తున్న అక్కడి టివి రంగంపై గురి పెట్టాడు. తన హైదరాబాద్ హిందీ భాషకు మరింతగా మెరుగులు దిద్దుకుని… తనను తాను సాన బెట్టుకున్నాడు. హిందీ టెలివిజన్ రంగంలో తన పేరు చిన్నగా మారు మ్రోగేలా చేసుకున్నాడు!!
హైదరాబాద్ లో పుట్టి పెరిగి… ముంబైలో తన ఉనికిని గట్టిగా నిరూపించుకుని… తెలుగు నిర్మాతల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్న ఆ తెలుగు కురరాడి పేరు “శ్రవణ్ రెడ్డి”.!!
“దోస్తీ యారియా మన్మర్జియాన్”, “థింకిస్తాన్ సీజన్ 1 అండ్ 2” వంటి వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న శ్రవణ్ రెడ్డి ఇకపై తెలుగు సినిమాలపై ఎక్కువ దృష్టి సారిస్తానంటున్నాడు. ఎమ్.ఎస్.రాజు “డర్టీ హరి”తో “ఎవరీ శ్రవణ్ రెడ్డి?” అని ఆరాలు తీసే రేంజ్ లో పెర్ఫామ్ చేసిన ఈ స్పురధ్రూపి…. అజయ్ భూపతి దర్శకత్వంలో తాజాగా రూపొందుతున్న “మంగళవారం”తో తనేంటో మరోసారి నిరూపించుకునేందుకు తహతహలాడుతున్నాడు!!
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి, “మిస్టర్ హైదరాబాద్” టైటిల్ విన్నర్ అయిన శ్రవణ్ రెడ్డి… పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకుని ఉండడం గమనార్హం. పలు యాడ్ ఫిల్మ్స్ లోనూ నటించి… జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగి, తెలుగుతో పాటు… హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి పట్టు కలిగిన శ్రవణ్… పేరు పెట్టని మరో రెండు తెలుగు చిత్రాలకు సైన్ చేసి ఉండడం విశేషం. సినిమా మేకింగ్ కు సంబంధించిన మొత్తం ప్రాసెస్ తెలుసుకోవడం కోసం పలు హిందీ చిత్రాలకు దర్శకత్వ శాఖలోనూ పని చేసిన అనుభవం కలిగిన ఈ పక్కా “హైదరాబాద్ కుర్రాడు” ఇంట కూడా గెలవాలని కోరుకుందాం!!
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…