ఉస్తాద్ రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్, పూరీ కనెక్ట్స్ పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్ గ్రాండ్ గా లాంచ్
ఉస్తాద్ రామ్, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ క్రేజీ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులని అలరించనుంది. వారి కల్ట్ బ్లాక్‌బస్టర్ ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం వీరిద్దరూ మళ్లీ కలిశారు. ఈసారి డబుల్ మాస్, డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతోంది. పూరి కనెక్ట్స్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విషు రెడ్డి సీఈవో.
ఈరోజు కోర్ టీమ్, కొంతమంది ప్రత్యేక అతిథుల సమక్షంలో ‘డబుల్ ఇస్మార్ట్’ లాంచ్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఛార్మి క్లాప్ ఇవ్వగా, హీరో రామ్ పోతినేనిపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి స్వయంగా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ముహూర్తపు సన్నివేశంలో “ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్’ అని రామ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.
“డబుల్ ది ఎంటర్‌టైన్‌మెంట్! డబుల్ ది యాక్షన్! డబల్ ది మ్యాడ్‌నెస్! వి ఆర్ బ్యాక్ !! #డబుల్‌ఇస్మార్ట్ మోడ్ ఆన్! ” అంటూ లాంచింగ్ ఈవెంట్ లో ఫోటోలని ట్విట్టర్ లో షేర్ చేశారు రామ్
డబుల్ ఇస్మార్ట్ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 12 నుంచి ప్రారంభం కానుంది.
ఇస్మార్ట్ శంకర్ రామ్‌తో పాటు పూరీ జగన్నాథ్‌కి చాలా ప్రత్యేకమైన సినిమా. ఈ సినిమా హీరోకి, దర్శకుడికి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఎక్సయిట్మెంట్, అంచనాలు భారీగా వున్నాయి.
పూరి జగన్నాధ్ చాలా పెద్ద స్పాన్ కలిగి కథ రాశారు. ఇది అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. రామ్‌ని ఇస్మార్ట్ శంకర్ కంటే మాసియర్ క్యారెక్టర్‌లో చూపించబోతున్నారు పూరి జగన్నాధ్.
డబుల్ ఇస్మార్ట్ పాన్ ఇండియా విడుదల కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 8, 2024న మహా శివరాత్రికి విడుదలౌతుంది.
తారాగణం: రామ్ పోతినేని
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాతలు: పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
సీఈఓ: విషు రెడ్డి
పీఆర్వో: వంశీ-శేఖర్
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…