నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మధుడు లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలని అందించిన మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కె. విజయభాస్కర్ చాలా విరామం తర్వాత చేస్తున్న యూత్ ఫుల్ ఫన్ అండ్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ ‘జిలేబి’. ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఎస్ఆర్కే ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజు అశ్రాని చిత్రాన్ని సమర్పిస్తున్నారు. విజయభాస్కర్ తనయుడు శ్రీకమల్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శివాని రాజశేఖర్ కథానాయికగా నటిస్తోంది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జిలేబి హిలేరియస్ థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ అని టీజర్ భరోసా ఇచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. జులై 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో శ్రీకమల్, శివాని దేన్నో చాటుగా చూడటం ఇంట్రస్టింగా వుంది. పోస్టర్ లో పెద్ద ముక్కు పుడక ధరించిన ఒక అమ్మాయి పెయిటింగ్ కూడా గమనించవచ్చు.
ఈ చిత్రానికి స్టార్ కంపోజర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫర్ కాగ, ఎం.ఆర్. వర్మ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
తారాగణం: శ్రీకమల్, శివాని రాజశేఖర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, గెటప్ శ్రీను, గుండు సుదర్శన్, బిత్తిరి సత్తి తదితరులు.
సాంకేతిక విభాగం:
దర్శకత్వం : కె. విజయభాస్కర్
నిర్మాత: గుంటూరు రామకృష్ణ
బ్యానర్ : ఎస్ఆర్కే ఆర్ట్స్
సమర్పణ : అంజు అశ్రాని
సంగీతం: మణిశర్మ
డీవోపీ: సతీష్ ముత్యాల
ఎడిటర్ : ఎం.ఆర్ వర్మ
పీఆర్వో : వంశీ శేఖర్
విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న #VenkyAnil5 #NKRAR2 భారీ…
'అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన ‘అమీర్ లోగ్’ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం…
-"సుధీర్స్ జోకర్" చిత్రంలో డిటెక్టివ్ జీవన్ పాత్రలో ఆకట్టుకోనున్న మురళీశర్మ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "సుధీర్స్…
ఫోనిక్స్ పిక్చర్స్ బ్యానర్‌పై, మాస్టర్ జియాన్స్ సమర్పణలో సత్యం రాజేష్, రియా సచ్యదేవ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న “ఫ్రెండ్లీ ఘోస్ట్”…
ఐశ్వర్య సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై సింధుసూర్య నిర్మిస్తున్న నూతన చిత్రం 'శివ గాడి జిందగీ'. సచిన్ రామ్ ప్రతాప్, హాసిని…
ది మేజ్" చిత్రంతో దర్శకుడిగా డాక్టర్ కాబోయి యాక్టర్ కావడం చూస్తుంటాం కానీ డా. రవికిరణ్ గడలాయ్ ఎం.డి, పాథాలజిస్ట్…