బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక దక్షిణ భారత స్టార్‌గా చరిత్ర సృష్టించిన అరవింద్ కృష్ణ

Must Read

ముంబైలోని డోమ్‌లో జరిగిన మొట్టమొదటి బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో దక్షిణ భారత నటుడు, అథ్లెట్ అరవింద్ కృష్ణ సంచలనం సృష్టించారు. దిశా పటాని, బాద్షా, రణ్విజయ్ సింఘా, వరుణ్ సూద్ వంటి జాతీయ దిగ్గజాలు పాల్గొన్న ఈ ఆటలో దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహించిన ఏకైక నటుడిగా అరవింద్ కృష్ణ నిలిచారు. మూడో నంబర్ జెర్సీ ధరించి కోర్ట్‌లో అడుగు పెట్టారు. గత ఏడాది మోకాలి గాయంతో బాధ పడిన అరవింద్ ఈ సారి మరింత శక్తివంతంగా తిరిగి వచ్చారు. అరవింద్ తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు.

అరవింద్ కృష్ట ప్రస్తుతం నటిస్తున్న ‘ఏ మాస్టర్ పీస్’ సినిమాని కూడా NBA ఇండియా అధికారిక స్పాట్‌లైట్ ప్రశంసించింది. అరవింద్‌ను పొగిడే క్రమంలో ఏ మాస్టర్ పీస్ అని కూడా అభివర్ణించారు. అరవింద్ కోర్టులో ఉన్న కమాండింగ్ ఉనికిని చూసి ఆర్గనైజర్స్ ఇలా ఏ మాస్టర్ పీస్ అని అతడ్ని కవిత్వాత్మకంగా ప్రశంసించారు. NBA నుండి ప్రేరణ పొందిన ఆ పసివాడు.. ఇప్పుడు ఏ మాస్టర్ పీస్ అంటూ సూపర్ హీరోగా తెరపైకి రాబోతోన్నారు.

Latest News

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు సినీ పరిశ్రమ లో అజాత...

More News