మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

Must Read

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా ‘మా ‘ అధ్యక్షుడు విష్ణు మంచు రిలీజ్ చేయించారు. మా సభ్యుల కోసం చేపడుతున్న ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, హెల్త్ చెకప్ లు, సభ్యుల సంక్షేమం కోసం మా కార్యవర్గం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా తెలిపారు.

సోమవారం ఉదయం ప్రజాభవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ‘మా’ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, ట్రెజరర్ శివ బాలాజీతో పాటుగా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ జయవాణి, మలక్ పేట్ శైలజ, శివ నారాయణ, శశాంక్, హరనాథ్ బాబు, మానిక్, సంపూర్ణేశ్ బాబు, ఎం.ఆర్.సి. వడ్లపట్ల తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ‘మా’ నూతన డైరీని ఆవిష్కరించి.. అధ్యక్షుడు మంచు విష్ణు, కార్యవర్గ సభ్యులను అభినందించారు.

Latest News

గ్రాండ్‌గా జరిగిన ‘MRP – నీకెంత నాకెంత’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. జూలై 17న రిలీజ్

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రచార కంటెంట్‌కు ప్రేక్షకుల...

More News