ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మ్యూజిక్ కాంపిటేషన్స్

Must Read

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలుగు భాషాభిమానులకు AAA తరఫున నమస్కారం!

AAA ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రథమ మహాసభలు 2025 – మార్చ్ 28 & 29 తేదీలలో అమెరికాలో పెన్సిల్వేనియా రాష్ట్రంలోని OAKS నగరంలో జరగబోతున్నాయి. ఈ కార్యక్రమాలు ఎంతో అంగరంగ వైభవంగా, అట్టహాసంగా జరపడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ అద్భుతమైన కార్యక్రమాల్లో భాగంగా AAA సంస్థ తరఫున వరల్డ్ వైడ్ మ్యూజిక్ కాంపిటేషన్స్ నిర్వహిస్తున్నారు. మీరు ఏ దేశం నుండి అయినా ఈ పోటీలో పాల్గొనవచ్చు.

ఈ పోటీలో మీరు కొత్త తెలుగు పాటలని వ్రాసుకొని లేదా వ్రాయించుకొని మీ కొత్త స్వరాలను కంపోజ్ చేసిన తెలుగు సాంగ్స్ ని ఆలపించి, రికార్డు చేసి సమర్పించవచ్చు.

ప్రపంచానికి మీ సంగీత ప్రతిభను తెలియజేయాలనుకుంటున్నారా? ఇది మీకు ఒక గొప్ప అవకాశం! వెంటనే మీ మ్యూజిక్ క్రియేటివిటీని సిద్ధం చేసుకొని ఈ పోటీలో పాల్గొనండి, అద్భుతమైన బహుమతులను గెలుచుకొండి.

మరిన్ని వివరాల కోసం, మీరు గెలుచుకోబోయే భారీ నగదు బహుమతి, నియమాలు, నిబంధనలను గురించి తెలుసుకోవడానికి క్రింది వెబ్సైట్, ఫ్లయిర్‌ను చూడగలరు.

Latest News

TFJA ఆధ్వర్యంలో ఫీనిక్స్ ఫౌండేషన్ & శంకర్ ఐ హాస్పిటల్ నిర్వహించిన ఉచిత ‘ఐ స్క్రీనింగ్’ పరీక్షలకు విశేష స్పందన

తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) ఆధ్వర్యంలో శనివారం (ఏప్రిల్ 26 న) ఫీనిక్స్ ఫౌండేషన్ & శంకర్ ఐ హాస్పిటల్ సంయుక్తంగా తెలుగు ఫిలిం...

More News