‘అనుమాన పక్షి’ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో కీలక షెడ్యూల్‌ పూర్తి

డిజే టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ, రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్, చిలకా ప్రొడక్షన్స్ ‘అనుమాన పక్షి’ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో కీలక షెడ్యూల్‌ పూర్తి

రాగ్ మయూర్ హీరోగా, డిజే టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అనుమాన పక్షి’. చిలకా ప్రొడక్షన్స్ పై రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. భరత్ లక్ష్మీపతి సహనిర్మాత.  

సినిమా షూటింగ్‌ వేగంగా సాగుతోంది. తాజాగా కశ్మీర్‌లోని పహల్గామ్‌, శ్రీనగర్‌ ప్రాంతాల్లో కీలకమైన షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో అక్కడ జరిగిన దుర్ఘటన తర్వాత మళ్లీ పహల్గామ్‌లో షూట్‌ చేసిన తొలి సినిమా ఇది.

సీఆర్పీఎఫ్‌ మార్గదర్శకత్వంలో, అన్ని భద్రతా నియమాలు పాటిస్తూ 20 రోజుల పాటు ఇంటెన్స్ షెడ్యూల్‌ షూట్ చేశారు. ఈ షెడ్యూల్‌తో సినిమాకి దాదాపు 80 శాతం షూటింగ్‌ పూర్తయింది. నవంబర్‌ చివర్లో తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇటివలే విడుదలైన టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌  మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ చిత్రానికి శ్రీ చరణ్‌ పాకాల సంగీతం అందించగా, సునీల్‌ కుమార్‌ నామా సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు.

ప్రిన్స్‌ సెసిల్‌, అనన్య, చారిత్‌ కీలక పాత్రల్లో కనిపించగా, బ్రహ్మాజీ, అజయ్‌, సీనియర్‌ నటి రాశి యూనిక్ రోల్స్‌లో కనిపించనున్నారు.

విభిన్న కథతో, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కుతున్న “అనుమానపక్షి” త్వరలో థియేటర్లలోకి రానుంది.

తారాగణం: రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్, ప్రిన్స్ సెసిల్, అనన్య, చరిత్, బ్రహ్మాజీ, సుప్రీత్

సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: విమల్ కృష్ణ
నిర్మాతలు: రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్
సహ నిర్మాత – భరత్ లక్ష్మీపతి
ప్రొడక్షన్ హౌస్ – చిలక ప్రొడక్షన్స్
సంగీతం: శ్రీచరణ్ పాకాల,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ప్రశాంత్ మండవ
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : శ్రావణ్ కుప్పిలి
డీవోపీ: సునీల్ కుమార్ నామా
ఆర్ట్ డైరెక్టర్: JK మూర్తి
ఎడిటర్ : అభినవ్ కునపరెడ్డి
కాస్ట్యూమ్ డిజైనర్: సుమయ్య తబస్సుమ్
పీఆర్వో: వంశీ శేఖర్
మార్కెటింగ్: వాల్స్ & ట్రెండ్స్

Tfja Team

Recent Posts

అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట విడుదల.. ‘అమ్మ కనకదుర్గ’ అంటూ సాగే భక్తి గీతాన్ని విజయవాడలో ఆవిష్కరించిన తమన్ అండ్ టీమ్

నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి…

3 days ago

శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వస్త్ర పంపిణీ చేసిన నందమూరి మోహన రూపా, నందమూరి శ్రీమంతుని

శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వద్ద నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్త్ర…

3 days ago

మా నమ్మకం నిజమైంది.. తెలుగునాట ‘జైలర్ 2’ ప్రభంజనంపై సంతోషం వ్యక్తం చేసిన సూర్యదేవర నాగవంశీ

సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన 'జైలర్' చిత్రం 2023లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.…

4 days ago

‘ఐ హేట్ మ్యారేజ్ ’ టీజర్‌ విడుదల

సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్ ’ ఆర్య…

4 days ago

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారు – సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి…

4 days ago

“రణబాలి” సినిమాలోని జయమ్మ పాత్ర స్పూర్తితో 400 కుటుంబాలకు 3 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించిన హీరోయిన్ రశ్మిక

ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా…

6 days ago