మహిళలు స్వయం సమృద్ధి సాధించాలని, అన్ని రంగాల్లో ధైర్యంగా ముందడుగు వేయాలని అన్నారు నారా భువనేశ్వరి. మహిళలకు చేయూతను ఇచ్చేలా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాంలో భాగంగా స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ఆమె ఈ రోజు ప్రారంభించారు. ఈ స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ద్వారా మహిళలు తయారు చేసిన సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, జూట్ బ్యాగ్స్ వంటి వివిధ రకాల ఉత్పత్తులను కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ సందర్భంగా
నారా భువనేశ్వరి మాట్లాడుతూ – స్త్రీ అంటే ప్రేమ, ధైర్యం, శక్తి. మహిళలకు ఒక రోజు మహిళా దినోత్సవం అని జరుపుతుంటారు. కానీ ప్రతి రోజూ మహిళా దినోత్సవమే. మహిళలు స్వయం సమృద్ధి సాధించేందుకు ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు జూట్ బ్యాగ్స్, బ్యూటీషియన్ కోర్స్ లు, టైలరింగ్ ట్రైనింగ్, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ తయారీ..ఇలా అనేక రకాల ఉత్పత్తులను తయారు చేసేలా శిక్షణ ఇస్తున్నాం. ఈ స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాంలో పాల్గొని శిక్షణ పొందిన మహిళలు ఏం చేస్తున్నారని వెళ్లి చూస్తే చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. వారిని ఒక్కచోట చేర్చి, వారి ఉత్పత్తులను మార్కెట్ లోకి తీసుకురావాలనే ఈ స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించాం. ఈ స్టోర్ ద్వారా మహిళలు తాము తయారు చేసిన ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. దీని ద్వారా వచ్చిన ఆదాయమంతా ఆయా మహిళలకే చెందుతుంది. మహిళ తన దగ్గర ఏ కొంత డబ్బు ఉన్నా, తన కుటుంబానికి మంచి వంట చేయాలని, ఏదో ఒకటి కొనివ్వాలని, వాళ్లను సంతోషపెట్టాలనే చూస్తుంటుంది. అలా ఒక మహిళ మాత్రమే ఆలోచించగలదు. కానీ మీ ఆదాయంలో మీరు కూడా కొంత ఖర్చు చేసుకోవాలి, ఆనందంగా ఉండాలి. ఎన్టీఆర్ ట్రస్టు నుంచి పుష్ కార్ట్స్, ఫుడ్ కార్ట్స్, టైలరింగ్ మిషీన్స్, ట్రై సైకిల్స్ అందజేయడం జరిగింది. నేను కూడా మీలాగే గృహిణిగా ఉన్నాను, ఆ తర్వాత ధైర్యంగా అడుగువేసి కంపెనీని నిర్వహిస్తున్నాను. మహిళలు అన్ని రంగాల్లో ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. సునీత విలియన్స్, మేరీ కోమ్, సుధామూర్తి..ఇలా ఎందరో మనకు స్ఫూర్తిగా నిలుస్తారు. ఇటీవల మహిళల క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెల్చింది. మీరంతా స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ద్వారా జీవితంలో స్థిరపడాలని కోరుకుంటున్నా. అన్నారు.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…