లవ్‌ ఓటిపి సినిమాని నాకు బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చాడు అనీష్‌– లవ్‌ ఓటిపి దర్శకుడు, హీరో అనీష్‌..

Must Read

నవంబర్‌ 14వ తేది ‘లవ్‌ ఓటిపి’సినిమా విడుదల సందర్భంగా మరియు రాజీవ్‌ కనకాల జన్మదినాన్ని పురస్కరించుకుని స్పెషల్‌ ప్రీమియర్‌ షో ప్రదర్శించారు ‘లవ్‌ ఓటిపి’ టీమ్‌. సినిమా ప్రీమియర్‌ చూసిన తర్వాత సినిమా టీమ్‌లోని దర్శకుడు–హీరో అనీష్, తండ్రి పాత్ర పోషించిన రాజీవ్‌ కనకాల, హీరోయిన్లు జాన్విక, స్వరూపిణి కమెడియన్‌ నాట్యరంగ, సంగీత దర్శకుడు ఆనంద్‌ రాజావిక్రమ్‌ పాల్గొని అనేక విషయాలు మాట్లాడారు.

హీరో–దర్శకుడు అనీష్‌ మాట్లాడుతూ–‘‘ ఈ రోజు కోసం నేను 14 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. నా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఫుల్‌గా ఎంజాయ్‌ చేశామని చెప్తుంటే ఇంతకంటే నాకు ఏమి అవసరం లేదనిపించింది. చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. రాజీవ్‌ కనకాల మాట్లాడుతూ–‘‘ నేను ఇప్పుడే ఈ సినిమాను చూశాను. ఎంతో ఎంజాయ్‌ చేశాను. నాకు అనీష్‌ బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చాడు . నేను పెద్దగా ఎమోషనల్‌ అవ్వను. కానీ అనీష్‌ పడిన కష్టం చూసి నాకు ఏడుపొచ్చింది. డియర్‌ అనీష్‌ వెల్‌కమ్‌ టు తెలుగు సినిమా ఇండస్ట్రీ. నీలో అద్భుతమైన టాలెంట్‌ ఉంది. కన్నడలోను తెలుగులోను నువ్వు చాలా పెద్దవాడివి అవుతావు. అలాగే హీరోయిన్లను ఉద్ధేశించి ఈ ఇద్దరు హీరోయిన్లు మామూలుగా చేయలేదు. అద్భుతంగా వారివారి పాత్రల్లో జీవించారు’’ అన్నారు.

Latest News

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోన్న‌సినిమా ధనుష్, కృతి...

More News