విష్ణు మంచు ‘కన్నప్ప’ షూట్ పూర్తి చేసిన అక్షయ్ కుమార్

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో దిగ్గజ నటులు భాగస్వామ్యం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో డా.మోహన బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం వంటి వారు నటిస్తున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా షూటింగ్‌లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అక్షయ్ కుమార్ తన సీన్లకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ మేరకు అక్షయ్ కుమార్‌తో పని చేసిన ఎక్స్‌పీరియెన్స్ గురించి విష్ణు మంచు తన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

మహాశివరాత్రి పర్వదినాన విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు విశేష స్పందన లభించిన సంగతి తెలిసిందే. ప్రతీ ఒక్క అప్డేట్‌తో కన్నప్ప మీద అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. అనేక మంది పాన్ ఇండియా స్టార్స్ ఉండటం వల్ల అందరి దృష్టి ఈ ప్రాజెక్ట్ మీద పడింది.

అక్షయ్ కుమార్ కొద్ది రోజుల క్రితం కన్నప్ప షూటింగ్‌లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ తన షూటింగ్‌ను ముగించుకున్నాడు. విష్ణు మంచు ఈ మేరకు వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘అక్షయ్‌కుమార్‌ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ ప్రయాణం ఎంతో విలువైంది. ఇంకా ఇలా ఎన్నో సార్లు కలవాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

“కన్నప్ప” సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్‌గా రాబోతోంది. ధైర్యవంతుడైన యోధుడు శివుని భక్తుడైన కన్నప్ప కథను అద్భుతంగా మల్చుతున్నారు. కన్నప్ప అచంచలమైన విశ్వాసం తరతరాలుగా అందరికీ స్ఫూర్తినిస్తూ ఉంది. ఎంతో అంకితభావంతో విష్ణు మంచు ఈ పాత్రను పోషిస్తున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే పూర్తి చేసి ప్రమోషన్ కార్యక్రమాలను పెంచనున్నారు.

Tfja Team

Recent Posts

సమంత యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ విడుదల.. మే 15న మూవీ గ్రాండ్ రిలీజ్

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…

21 hours ago

‘లెనిన్‌’ నుంచి సెకండ్ సాంగ్ ‘ఎట్టా ఎట్టా’ రిలీజ్‌

యంగ్ అండ్ డైన‌మిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు…

21 hours ago

మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన “పళ్లిచట్టంబి” తెలుగులోనూ ఆ సక్సెస్ రిపీట్ చేస్తుంది – మూవీ ప్రొడ్యూసర్స్ చాణక్య, చైతన్య, చరణ్

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…

21 hours ago

‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్

గ‌త ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సైయారా’ కాంబో మ‌ళ్లీ మ‌న ముందుకు రావ‌టానికి స‌మాయ‌త్త‌మ‌వుతోంది. సైయారా అద్భుత విజయంతో…

2 days ago

ఎమ్మెస్ రాజు దర్శకత్వంలోతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో‘అగధ’

ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…

2 days ago

మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి -ఎం.వెంకయ్య నాయుడు

అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి…

2 days ago