అక్కినేని “ప్రతిబింబాలు” 250 థియేటర్స్ లలో విడుదల

Must Read

250 థియేటర్స్ లలో గ్రాండ్ గా విడుదల అవుతున్న అక్కినేని నాగేశ్వరావు చిత్రం “ప్రతిబింబాలు”రాజేశ్వర్ రాచర్ల సమర్పణలో విష్ణు ప్రియ సినీ కంబైన్స్ పతాకంపై అక్కినేని నాగేశ్వరావు, జయసుధ జంటగా కీ. శే.కె. యస్. ప్రకాషరావు దర్శకత్వంలో జాగర్ల మూడి రాధాకృష్ణ మూర్తి నిర్మించిన చిత్రం “ప్రతిబింబాలు”.ఈ సినిమా 40 సంవత్సరాల తర్వాత నిర్మాత జాగర్ల మూడి రాధాకృష్ణ మూర్తి ఈ చిత్రాన్ని మొదటి సారిగా 250 థియేటర్స్ లలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలోఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి గారు మాట్లాడుతూ.. అక్కినేని నాగేశ్వరావు గారు నటించిన ప్రతిబింబాలు సినిమాను నిర్మాత జాగర్ల మూడి రాధాకృష్ణ మూర్తి ఎంతో ధైర్యం చేసి వరల్డ్ వైడ్ రిలీజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు రిలీజ్ అవుతున్నఈ సినిమా ఒక రికార్డ్ సృష్టించబోతుంది. కాబట్టి ఈ సినిమా కలెక్షన్స్ లలో కూడా రికార్డ్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

నిర్మాత జాగర్ల మూడి రాధాకృష్ణ మూర్తి మాట్లాడుతూ.. ఇంతకు ముందు నేను తీసిన సినిమాలు అన్నీ విజయం సాదించాయి.ఆ సినిమాలను చూసి నాగేశ్వరావు గారు నన్ను పిలిచి నాతో సినిమా చెయ్యమని కాల్ సీట్స్ ఇచ్చాడు.1982 లో ఈ సినిమా స్టార్ట్ చేసి ఏకాదటిగా షూట్ చేశాము.ఇందులో తను డ్యూయల్ రోల్ లో నటించాడు. ఈ సినిమా కొంత షూట్ ఉందనగా వారికి హార్ట్ స్ట్రోక్ రావడంతో తను అమెరికా వెళ్ళాడు.దాంతో ఆరోగ్యం బాగుండాలని షూటింగ్ ఆపేశాము.రెండు సంవత్సరాల తర్వాత వచ్చిన నాగేశ్వరావు గారు షూటింగ్ పెట్టుకోమన్నాడు. అంతా రెడీ చేసుకొన్నాక ప్రెగ్నెంట్ తో ఉన్న జయసుధ గారు నేను డెలివరీ అయ్యే వరకు షూటింగ్ చెయ్యను అన్నారు.తను డెలివరీ అయిన తరువాత ఇద్దరూ డేట్స్ ఇస్తే డైరెక్టర్ రాలేకపోయారు. ఆ తరువాత నాగేశ్వరావు గారే కలిపించుకొని కె. యస్ ప్రకాష్ గారి మిగిలిన సినిమాను డైరెక్షన్ చెయ్యమని చెప్పడంతో తన సపోర్ట్ తో సినిమా పూర్తి చేశాము. ఆ తరువాత రీ రికార్డింగ్ దగ్గర మాకు అడ్వాన్స్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ వెనక్కు వెళ్లడంతో ఫైనాన్స్ పరమైన ఇబ్బందులతో ఆగిపోయింది.

ఆ తరువాత ఈ సినిమా రిలీజ్ కోసం గత 40 సంవత్సరాలనుండి పడుతున్న ఆరాటం అంతా ఇంతా కాదు చివరకు నా సినిమా రిలీజ్ చేయకుండా చనిపోతానేమో అనుకున్న టైమ్ లో రాచర్ల రాజేశ్వర్ రావు రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు. వారికి నా ధన్యవాదాలు. ఈ నెల 5 న విడుదల అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.నిర్మాత రాచర్ల రాజేశ్వర్ రావు మాట్లాడుతూ.. సినిమా చాలా బాగుంది. ఇలాంటి సినిమా మళ్ళీ రాదు, రాబోదు.అక్కినేని నాగేశ్వరావు గారి సినిమా రిలీజ్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము.ఏ సినిమా రిలీజ్ చేయడానికి మా ఫ్యామిలీ కూడా ఫుల్ సపోర్ట్ చేశారు. ఈ నెల 5 న వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించి జాగర్ల మూడి రాధాకృష్ణ మూర్తి కి ఎక్కువ డబ్బులు రావాలని అన్నారు.ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా రిలీజ్ కాకుండా మిగిలిపోయిన చిత్రం ఈ రోజు రిలీజ్ అవ్వడం గొప్ప విషయం.ఒక ప్రేమ్ నగర్, ప్రేమాభిషేకం, భక్తతుకారం, ఇలా సుమారు 250 సినిమాలలో నటించిన గొప్ప వ్యక్తి ఏఎన్నార్. ప్రపంచంలో గొప్ప నటుల్లో అక్కినేని నాగేశ్వరావు, నందమూరి తారక రామారావు గార్లు, ఇద్దరు తెలుగు నటులు ప్రపంచ ప్రఖ్యాత గాంచి అందరి హృదయాల్లో నిలిచిపోయిన వీరిద్దరూ మన తెలుగు వారు కావడం మన అదృష్టం. ఈ నెల 5 న విడుదల అవుతున్న ఈ సినిమాను తను పెట్టిన అమౌంట్ కంటే ఎక్కువ అమౌంట్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత తుమ్మలపల్లి రామసత్య నారాయణ మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీ కి రాకముందే నిర్మాత జాగర్ల మూడి రాధాకృష్ణ మూర్తి గారు , ఒక దీపం వెలిగింది, ఉయ్యాలవారి కయ్యాలు, కోరుకున్న మొగుడు, వినాయక విజయం వంటి సినిమాలు తీశాడు.అప్పట్లో అందరితో కలసి సినిమాలు తీసిన ఏకైక వ్యక్తి జాగర్ల మూడి రాధాకృష్ణ మూర్తి గారు. తను గత 40 సంవత్సరాలుగా ఈ సినిమా రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో తన తరపున రాచర్ల రాజేశ్వర్ రావు గారు విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పుడు తీస్తే 40 కోట్ల బడ్జెట్ సినిమా. ఈ సినిమా లేట్ అవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయి.కాబట్టి ఈ నెల 5 న విడుదల అవుతున్న ఈ సినిమా జాగర్ల మూడి రాధాకృష్ణ మూర్తి కి వినాయక విజయం అంతటి గొప్ప విజయం సాదించాలని అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ నెల 5 న విడుదల అవుతున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలని అన్నారు

Latest News

Grand Teaser Launch Event of “Raju Gari Dongalu”

The movie Raju Gari Dongalu, featuring Lohith Kalyan, Rajesh Kunchada, Joshith Raj Kumar, Kailash Velayudhan, Pooja Vishweshwar, TV Raman,...

More News