బ్రీజీ విజువ‌ల్స్‌తో ‘ఆకాశం’ టీజర్ విడుదల

వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో న‌టుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న వెర్సటైల్ యాక్ట‌ర్ అశోక్ సెల్వ‌న్ హీరోగా.. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వ‌యాకామ్ 18, రైజ్ ఈస్ట్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా ఆర్‌.ఎ.కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిస్తోన్న చిత్రం ‘ఆకాశం’. రీతూ వర్మ, అపర్ణ బాల మురళి, శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

ఇప్ప‌టికే విడుద‌లైన హీరో అశోక్ సెల్వ‌న్ లుక్ పోస్ట‌ర్స్‌, ముగ్గురు హీరోయిన్స్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించాయి. కాగా.. శుక్ర‌వారం సినిమా టీజ‌ర్‌ను స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ విడుద‌ల చేశారు. హీరోయిన్ వాయిస్‌తో టీజ‌ర్ మొద‌ల‌వుతుంది. మ‌న‌సు ఉల్లాసంగా ఉన్న‌ప్పుడు మ‌ర‌చిపోవాలనుకున్న విషయాలు కూడా ఇంకా అందంగా గుర్తొస్తాయి క‌దూ అంటుంది. అశోక్ సెల్వ‌న్ డిఫ‌రెంట్ లుక్స్‌తో పాటు ముగ్గురు హీరోయిన్స్‌..

వారి మ‌ధ్య రిలేష‌న్‌ను అంద‌మైన స‌న్నివేశాల‌తో చూపించారు. లీలావ‌తి కుమార్ సినిమాటోగ్ర‌ఫీ, గోపి సుంద‌ర్ సంగీతం ఈ స‌న్నివేశాల‌కు మ‌రింత అందాన్నిస్తున్నాయి. బ్యాగ్రౌండ్‌లో ఆకాశం అనే టైటిల్ పాట‌లాగా వినిపిస్తోంది.ఆకాశం మంచి ప్రేమ క‌థా చిత్ర‌మ‌ని అర్థ‌మ‌వుతుంది. దీంతో పాటు సినిమాలోని ఎమోష‌న్స్ సినిమాపై ఆస‌క్తిని మ‌రింత‌గా పెంచుతున్నాయి. న‌వంబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

2 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

2 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

2 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago