పిఎస్ఆర్ ప్రొడ‌క్ష‌న్ నెం.1 షూటింగ్ పూర్తి

పృథ్విరాజ్‌, అనూ మెహ‌త హీరోహీరోయిన్లుగా పిఎస్ఆర్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రాబ‌రీ నేప‌థ్యంలో క్రైమ్ థ్రిల్ల‌ర్ గా ఓ క్రొత్త చిత్రం రూపొందుతోంది. ఈ మూవీ ద్వారా పి.మ‌ణిరాజ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. పి.నాగ‌మ‌ణి స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌వీణ శివరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్త త‌ర‌హా క‌థ‌, క‌థనంతో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి ఓ ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. ఇప్ప‌టికే మొద‌లైన ఈ మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయనున్నారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు పి. మ‌ణిరాజ్ మాట్లాడుతూ – 27 రోజుల పాటు వికారాబాద్‌, హైద‌రాబాద్ మ‌రియు ప‌రిసర ప్రాంతాల్లోని అంద‌మైన లోకేష‌న్ల‌లో చిత్రీక‌ర‌ణ జ‌రిపాం. ఔట్ పుట్ చాలా బాగా వ‌చ్చింది. హీరో పృథ్విరాజ్‌, హీరోయిన్ అనూ మోమ‌త చక్క‌గా న‌టించారు. టెక్నీషియ‌న్స్ అంద‌రూ పూర్తి స‌హ‌కారం అందించారు. షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతున్నాయి. ఒక రాబ‌రీ బ్యాక్‌డ్రాప్‌లో జ‌రిగే క్రైమ్ థ్రిల్ల‌ర్ ఇది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి న‌వంబ‌రు నెల‌లో రిలీజ్ చేయడానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాం. త్వ‌ర‌లోనే టైటిల్‌, ఫ‌స్ట్ విడుద‌ల చేస్తాం అన్నారు.

పృథ్విరాజ్‌, అనూ మెహ‌త హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి

స‌మ‌ర్ఫ‌ణ‌: పి. నాగ‌మ‌ణి
బ్యాన‌ర్: పిఎస్ఆర్ ప్రొడ‌క్ష‌న్స్
నిర్మాత‌: ప్ర‌వీణ శివరాజ్
ద‌ర్శక‌త్వం: పి. మ‌ణిరాజ్
సినిమాటోగ్ర‌ఫి: ప‌ర‌శురామ్‌ ఎరుగ‌దిండి
ఎడిట‌ర్‌: సి. అక్ష‌య‌రాజ్‌
పీఆర్ఓ: శ్రీ‌ను-సిద్ధు

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

3 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

3 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

3 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago