సరికొత్త కంటెంట్ తో ఆడియెన్స్ ను ఎప్పటికప్పుడు కొత్తగా ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ పేరుతో మరో ఇన్నోవేటివ్ రియాలిటీ షోను మన ముందుకు తీసుకొస్తోంది. జూలై 3వ తేదీ నుంచి ఈ రియాలిటీ షో ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. మంచు లక్ష్మి, వైవా హర్ష, రశ్మి గౌతమ్ ఈ కార్యక్రమానికి జ్యూరీగా వ్యవహరించనున్నారు. విశ్వభారత్, ఫేమస్ రామ్, సింధు కసారం, అనిరుధ్ నారాయణం, రవి కిరణ్ బేవర, అఖిల్ జాక్సన్, డయానా, రవి, గౌతమ్ కుమార్, అమృత భూపతిరాజు, గ్రాండ్‌పా కిచెన్ టాప్ తెలుగు ఇన్ఫుయెన్సర్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు.
8 ఎపిసోడ్స్ గా ఈ రియాలిటీ షో ప్రసారం కానుంది. ప్రతి ఎపిసోడ్ లో ప్రత్యేక థీమ్ తో కూడిన ఛాలెంజ్ లను కంటెస్టెంట్స్ ఎదుర్కోవాల్సిఉంటుంది. సోషల్ మీడియాలోని వినోదాన్ని వీక్షకులకు అందిస్తూ సాగే ‘టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్’ రియాలిటీ షో సరికొత్త విజువల్ ప్రెజెంటేషన్, మేకింగ్ తో ఆకట్టుకోనుంది. కంటెస్టెంట్స్ సోషల్ మీడియా ఛాలెంజ్‌లు, రీల్స్ తో సాగే టాస్క్‌లలో పాల్గొంటారు. దీంతో ఈ కార్యక్రమంలో ప్రేక్షకులు కూడా ప్రత్యక్షంగా భాగస్వాములు కానున్నారు.
ఈ కార్యక్రమం గురించి WPP మీడియా సౌత్ ఏషియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అశ్విన్ పద్మనాభన్ మాట్లాడుతూ – తెలుగు వారి అభిమాన ఓటీటీ ఆహాతో కలిసి ‘టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్’ రియాలిటీ షో నిర్వహించడం సంతోషంగా ఉంది. కంటెంట్ క్రియేటర్స్ మన కల్చర్ ను ప్రతిబింబించే మాధ్యమాలుగా మారిపోయారు. తెలుగువారి కోసం మేము అందిస్తున్న సరికొత్త రియాలిటీ షో ఇది. సృజనాత్మకత, సాంకేతికత కలగలిసిన ఈ కార్యక్రమం ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువకాబోతున్నాం. అన్నారు.
అర్హా మీడియా అండ్ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సీఓఓ రామ్‌శివ లింగా మాట్లాడుతూ – తెలుగు డిజిటల్ క్రియేటర్స్ ప్రతిభను చాటే కార్యక్రమం ఇది. దీన్ని మేమొక పోటీగా చూడటం లేదు. మన కంటెంట్ క్రియేటర్స్ ప్రతిభను ఆహా ‘టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్’ రియాలిటీ షో వేదిక మీద సెలబ్రేట్ చేయబోతున్నాం. ఈతరం ప్రేక్షకులు కంటెంట్ ను ఎలా చూస్తున్నారో, ఎలా షేర్ చేసుకుంటున్నారో తెలియజేసే షో ఇది. అన్నారు.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…