ప్రేక్షకుల కోరిక మేరకు ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్: రామ్ గోపాల్ వర్మ

ఆదివారం రిలీజ్ అయిన టీజర్.జూలై 17న గ్రాండ్ థియేట్రికల్ రీ రిలీజ్

రాయలసీమ ఫ్యాక్షనిజంలో బద్ద శత్రువులైన రెండు వేర్వేరు గ్రూపులు అయిన పరిటాల రవి, మద్దెల చెరువు సూరిలకు సంబంధించిన యథార్థ ఘటనల ఆధారంగా చేసుకుని ‘రక్త చరిత్ర’ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగిందని క్రియేటివ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెలిపారు. వివేక్ ఒబెరాయ్, సూర్య, రాధికా ఆప్టే, ప్రియమణి ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రం 2010లో విడుదలై, అప్పట్లో సూపర్ హిట్ అయింది. తన స్పృజనాత్మకతకు, ఆ టైమ్ లో వచ్చిన కొత్త టెక్నాలజీని మేళవించి సినిమాలను తీయడంలో పేరుగాంచిన వర్మ ఈ చిత్రాన్ని వాస్తవ ఘటనల ప్రతిబింబంగా రూపొందించారు. రాయలసీమలోని అనంతపూర్ లో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఫ్యాక్షనిజంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి అన్న అంశాన్ని కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించారు. 16 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ…”ఈ సినిమాను రీ రిలీజ్ చేయమని ప్రేక్షకులు వివిధ ఫ్లాట్ ఫార్మ్స్ లో కోరుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అప్పట్లో చూడని నేటి తరం ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం చేరువ కావాలన్న సంకల్పంతో జూలై 17న ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆదివారం ఈ చిత్రం టీజర్ ను రిలీజ్ చేశాం. త్వరలో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేస్తాం. ఆగష్టు నెలలో దీని కొనసాగింపు చిత్రమైన ‘రక్త చరిత్ర’ పార్ట్ -2ను సైతం రీ రిలీజ్ చేయాలని నిర్ణయించాం” అని చెప్పారు.

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

4 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

4 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

4 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago