ప్రేక్షకుల స్పందన చూశాక మంచి సినిమా తీశామని గర్వంగా ఫీల్ అవుతున్నాం : అన్నీ మంచి శకునములే టీమ్
ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా నిర్మాణంలో దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్ తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మే 18 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలామంది సినిమా సమీక్షలు చదివాక కూడా థియేటర్ కు వెళ్లి చూసి ఎంజాయ్ చేయడం చూస్తుంటే మంచి సినిమా తీశామని గర్వంగా ఉందని చిత్ర యూనిట్ తెలియజేసింది. శనివారం నాడు ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన సక్సెస్ మీట్ లో వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకురాలు నందినిరెడ్డి మాట్లాడుతూ, ఇప్పుడు థియేటర్ కు జనాలు వస్తారా లేదా అనే ఛాలెంజ్ మొదట్లో మా ముందుంది. ఎందుకంటే నేను తీసిన అలా మొదలైంది అలానే జరిగింది. కానీ రానురాను మౌత్‌టాక్ తో హిట్ అయింది. అలాగే అన్నీ మంచి శకునములే చిత్ర కథలోని సన్నివేశాలు, పాతల్రు ఎమోషన్స్ మేమంతా ఇష్టపడి ప్రేమించి తీశాం. ఇందులో టిస్ట్ లు లేవు. అందుకే మొదట్లో రిస్క్ చేస్తున్నామా అని కూడా ఆలోచించాం. కానీ ప్యూర్ మానవీయ సంబంధాలతో కూడిన అందమైన కథను చేయడమే రిస్క్‌గా భావించి స్వప్న దత్, ప్రియాంక దత్ చాలా దైర్యంగాఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే మమ్మల్ని కదిలించిన ఈ కథ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రీచ్ అవుతుందని నమ్మాము. చాలామంది ఓటీటీకి అలవాటు పడిన ప్రేక్షకులు థియేటర్ కు వస్తారా! అన్నారు. మంచి కంటెంట్ వుంటే ఫ్యామిలీస్ బయటకు వస్తారు. అదే నమ్మకాన్ని ఈరోజు చూపిస్తున్నారు.
అలా మొదలైంది టైంలో 70 ఏళ్ళ ఆవిడను థియటర్ లో చూశాను. ఈ రోజు కూడా 50పైబడిన వారిని మేం థియేటర్ లో చూశాను. నేను సినిమా విడుదలకు ముందు క్లయిమాక్స్ గురించి ఏదైతే చెప్పానో దానికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. కథ అందరికీ నచ్చాలనే గ్యారంటీ లేదు. నచ్చినవారికి బాగా నచ్చింది. ఇంకా అందరికీ చేరువకావాలంటే కొద్దిగా టైం పడుతుంది. కానీ కొంతమంది రివ్యూలు చదివికాక సినిమాకు వెళ్ళినవారు వున్నారు. సినిమా చూశాక చాలా బాగుందని చెప్పారు కూడా. మాళవిక క్యారెక్టర్ చాలా కుటుంబాలకు కనెక్ట్ అయింది. అలాగే కొన్ని సన్నివేశాలు కనెక్ట్‌అయ్యాయి. అయినా సినిమాలో కొన్ని లోపాలు లేకపోలేదు. వాటిని కాసేపు పక్కన పెడితే ఒక బ్యూటిఫుల్ సినిమా ఇది. ఏదైనా వెలితి వుందంటే రచనా పరంగా వుందని చెప్పగలను. క్లయిమాక్స్ ఆర్.ఆర్. లేకుండా రెండు మూడు డైలాగ్స్ తో నడపడం చాలా కష్టం. అయినా ఆ విషయంలో సక్సెస్ సాధించాం. నా బెస్ట్ ఫిలింస్ లో ఇది ఒకటి. అన్నీ మంచి శకునములే బ్యూటిఫుల్ ఎమోషనల్ సినిమా. నేను ఐదు సినిమాలు చేస్తే అందులో కేవలం జబర్‌దస్త్ ఒక్కటే ప్లాప్ అయింది. కానీ ఈ సినిమా మంచి సినిమా చేశాననే గర్వంగా చెప్పగలను. సినిమా అంటే ఓన్లీ మాస్ కాదు. ఫ్యామిలీ అంతా చూడగలిగే సినిమా ఇది అని అన్నారు.
చిత్ర హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ, చూసినవారంతా మన సినిమా అంటుంటే చాలా హ్యాపీగా వుంది. ఈ సినిమా చేశాక మా అమ్మగారి మొహం ఆనందంగా కనిపించింది. 20 ఏళ్ళ క్రితం నాన్నగారు తీసిన వర్షం సినిమా చూశాక మా అమ్మ లో సంతోషం చూశాను. మరలా ఈ సినిమాకు అమ్మలో ఆనందం తిరిగి తీసుకువచ్చింది. దానికి కారణం స్వప్న, ప్రియాంక, నందినిరెడ్డి గార్లే. ప్రేక్షకులే నిజాయితీగా మాట్లాడతారు. అంతే నిజాయితీగా సినిమా తీశాం. నటుడిగా ఈ సినిమాకు పేరు వచ్చిందంటే దానికి కారణం దర్శక నిర్మాతలే అని అన్నారు.
మాళవిక నాయర్ మాట్లాడుతూ, నా పాత్ర ఆర్య గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసివారందరికీ ధన్యవాదాలు. ఇంకా సినిమాను చూడనివారు చూడండి. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనేది నా జోనర్. వాటిని నేను చూస్తూ ఉంటాను. ఈ మూవీలో ఆర్య పాత్ర కూడా చాలా కాంప్లెక్స్‌గా రాశారు. దానికి న్యాయం చేశానని చెప్పగలను. ఇందుకు ప్రియాంక, స్వప్నగారికి థ్యాంక్స్. అన్నారు.
ప్రియాంక దత్ మాట్లాడుతూ, 2016 నుంచి నిర్మాతగా మా అక్కతో ప్రయాణం, ఎవడే.., మహానటి, జాతిరత్నాలు చేశాను. ఈ సినిమా చేసేటప్పుడు కొన్ని క్యాలిక్లేషన్స్ వున్నాయి. మంచి సినిమా తీయాలనేది మా కోరిక. మేం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని చెప్పగలను. మిశ్రమ స్పందన వచ్చినా, ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే సినిమా ఇదని అనిపించింది. ఆ విషయం నాగి, నేను థియేటర్ లో వెళ్లి చూశాక మాకే ఆనందం కలిగింది. ఇలాగ వచ్చినవారందరికీ థ్యాంక్స్. ఇంకా చూడనివారు మీ కుటుంబంతో కలిసి చూడండి. ఇంతకుముందు తీసిన సినిమాల్లాగే ఓ మంచి సినిమా తీశామనే నమ్మకముంది అన్నారు.
స్వప్నదత్ మాట్లాడుతూ, ఈ సినిమా తీసినందుకు గర్వంగా వుంది. ప్రేమతో చేశాం. సినిమాను చుట్టేయలేదు. థియేటర్ కు వెళ్ళి ప్రేక్షకుల రియాక్షన్ చూసుకున్నాం. ఈ సినిమా చాలామంది క్రిటిక్స్‌కు నచ్చలేదు. అయినా ప్రేక్షకులకు నచ్చింది. మా బేనర్ లో ఎన్.టి.ఆర్. నాని, విజయ్ నటించి స్టార్స్ అయ్యారు. అలాగే సంతోష్ కూ ఆ రేంజ్ వస్తుందని ఆశిస్తున్నాం. ఇది మంచి సినిమా అని గట్టిగా నమ్మి చేశాం. అందుకే థియేటర్ అనుభవం పోగొట్టుకోకండి .అందరూ థియేటర్లోనే చూడండి. నందిని రెడ్డి సినిమాల్లో అన్నీ పాజిటివ్ పాత్రలే ఎందుకుంటాయంటే తను చాలా పాజిటివ్ గా వుంటుంది. అందుకే మేం ఈనాటి ట్రెండ్ లోనూ సినిమా తీసినందుకు గర్వంగా ఫీలవుతున్నామని అన్నారు.