వర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ ప్రస్తుతం డిఫరెంట్ కథా చిత్రాలను చేస్తున్నారు. ప్రస్తుతం మేకర్లు అంతా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. ఆ నూతన ప్రపంచంలోకి ఆడియెన్స్‌ను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాల్పనిక ప్రపంచంలో జరిగే అద్భుతమైన ఘట్టాల్ని చూసి ఆడియెన్స్ థ్రిల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ‘శంబాల’ చిత్రాన్ని ఆది సాయి కుమార్ చేస్తున్నారు. ‘ఏ’ యాడ్ ఇన్‌ఫినిటిమ్ ఫేమ్ డైరెక్టర్ యుగంధర్ ముని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి ఖర్చులకు రాజీ పడకుండా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. నేడు (డిసెంబర్ 23) ఆది సాయి కుమార్ పుట్టినరోజు సందర్భంగా శంబాల ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో ఆది పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నట్టుగా కనిపిస్తోంది. సైకిల్ మీద హీరో మంటల్లోంచి రావడం, ఆకాశం ఎరుపెక్కి కనిపించడం చూస్తుంటే.. ఏదో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.
శంబాల చిత్రంలో ఆది సాయి కుమార్ జియో సైంటిస్ట్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన అర్చన అయ్యర్ కథానాయికగా నటించనున్నారు. సూర్య 45వ చిత్రంలో భాగమైన శ్వాసిక కీలక పాత్ర పోషిస్తుండగా.. రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇండియన్ స్క్రీన్ మీద ఇదివరకెన్నడూ టచ్ చేయని పాయింట్, కథతో ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారు. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్‌లో శిక్షణ పొందిన యుగంధర్ ముని హాలీవుడ్ స్థాయి నిర్మాణాన్ని లక్ష్యంగా చేసుకుని హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో, గ్రాండ్ విజువల్స్‌తో శంబాల చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ముఖ్యంగా విజువల్స్, సాంకేతికత అత్యున్నత స్థాయిలో ఉండేలా చూసుకుంటున్నారు. ఈ చిత్రానికి భారతీయ సంగీత విద్వాంసుడు శ్రీరామ్ మద్దూరి సంగీతాన్ని అందించనున్నారు. డ్యూన్, ఇన్‌సెప్షన్, బ్యాట్ మాన్, డంకిర్క్ వంటి చిత్రాలకు ప్రసిద్ధి చెందిన హన్స్ జిమ్మర్ వంటి ప్రముఖ హాలీవుడ్ స్వరకర్తలతో శ్రీరామ్ మద్దూరి కలిసి పని చేశారు. నేపథ్య సంగీతంలోనూ కొత్త మార్క్ క్రియేట్ చేయనున్నారు. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ తో చిత్రయూనిట్ ఆడియెన్స్ ముందుకు రానుంది.
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్‌టైన్‌మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…
శ్రోతలను ఉర్రుతలూగిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి గీతం ‘దేఖ్లేంగే సాలా’ 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో…