“బాహుబలి, కె.జి.ఎఫ్” చిత్రాల
సరసన సగర్వంగా నిలిచేలా
కలెక్షన్ల దుమ్ము రేపుతున్న “మార్కో”
హిందీలో తొలిసారి థియేట్రికల్ రిలీజై
మ్యాజిక్ చేస్తున్న మలయాళ చిత్రం!!
తెలుగు రాష్ట్రాల్లో హిందీ వెర్షన్ కు
అసాధారణ స్పందన-అద్భుత వసూళ్లు!!
మన భారతీయ సినిమా రంగానికి చెందిన 1000 కోట్ల క్లబ్బులో… హిందీ, తెలుగు, తమిళ, కన్నడ సినిమాలు స్థానం దక్కించుకున్నాయి. కానీ మలయాళం నుంచి ఇప్పటివరకు ఏ సినిమా కూడా చోటు సంపాదించుకోలేదు. ఈ లోటును భర్తీ చేసే బాధ్యతను “మార్కో” తీసుకుంది. ఈనెల 20న విడుదలైన ఈ చిత్రం మలయాళంలో వసూళ్ల సునామి సృష్టిస్తుండగా… తొలిసారి హిందీలో థియేట్రికల్ రిలీజ్ జరుపుకున్న “మార్కో” అక్కడ కూడా ప్రభంజనం సృష్టిస్తోంది!!
ఉన్ని ముకుందన్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రాన్ని హనీఫ్ అదెని దర్శకత్వంలో “క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్” పతాకంపై షరీఫ్ మహ్మద్ నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో హిందీ వెర్షన్ కు లభిస్తున్న అనూహ్య స్పందనను దృష్టిలో ఉంచుకుని… మరిన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు “జినీవర్స్” సంస్థ సన్నాహాలు చేస్తోంది!!
“జినీవర్స్” అధినేత బల్వంత్ సింగ్ మాట్లాడుతూ… “బాహుబలి, కె.జి.ఎఫ్, కాంతరా… తాజాగా పుష్ప-2” చిత్రాల గురించి మాట్లాడుకున్నట్లుగా… “మార్కో” గురించి మాట్లాడుకుంటారని కచ్చితంగా చెప్పగలను. మన రెండు తెలుగు రాష్ట్రాలలో “మార్కో” హిందీ వెర్షన్ ప్రభంజనం సృష్టిస్తోంది. అందుకే రేపటి నుంచి మరిన్ని థియేటర్లు పెంచుతున్నాం” అన్నారు!!
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…