“ఎస్ ఆర్ కళ్యాణమండపం” డైరెక్టర్ శ్రీధర్ గాదె, శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌ ప్రొడక్షన్ నెం.3 సినిమా నుంచి టాలెంటెడ్ యాక్ట్రెస్ పూజిత పొన్నాడ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

ఈ చిత్రంలో నర్తకి పాత్రలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్న పూజిత పొన్నాడ

“ఎస్ఆర్ కళ్యాణమండపం” చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించి దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న డైరెక్టర్ శ్రీధర్ గాదె మరో కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై ఆది సాయి కుమార్ తో చుట్టాలబ్బాయ్ వంటి ఫ్యామిలీ మూవీ, ఆనంద్ దేవరకొండతో “హైవే” వంటి యూనిక్ థ్రిల్లర్ మూవీని నిర్మించిన ప్రొడ్యూసర్ వెంకట్ తలారి తమ ప్రొడక్షన్ నెం.3గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో “కమిటీ కుర్రోళ్లు” మూవీ ఫేమ్ ఈశ్వర్ రాచి రాజు హీరోగా నటిస్తుండగా, నందు, లిఖిత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పూజిత పొన్నాడ, సింధు కాసారం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ చిత్రంలో నర్తకి క్యారెక్టర్ లో టాలెంటెడ్ యాక్ట్రెస్ పూజిత పొన్నాడ నటిస్తున్నారు. ఈ రోజు పూజిత పొన్నాడ బర్త్ డే సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నర్తకి క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. రాజభవనంలో నర్తకిమణిగా ముస్తాభైన పూజిత పొన్నాడ లుక్ ఆకట్టుకుంటోంది. నటిగా ఆమెకు ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకొస్తుందనే అంచనాలు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఏర్పడుతున్నాయి.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే హారర్ చిత్రమిది. ఈ సినిమాను సరికొత్త కథా కథనాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు శ్రీధర్ గాదె తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.

నటీనటులు – ఈశ్వర్ రాచి రాజు, నందు, లిఖిత, పూజిత పొన్నాడ, సింధు కాసారం, సురేష్ గురు, రాయల్ శ్రీ, మట్టా శివకుమార్, విహా దీకొండ, సునీత మనోహర్, అమ్మ రామచంద్రయ్య, తదితరులు

TFJA

Recent Posts

15 మిలియన్ ఫ్లస్ వ్యూస్ తో దూసుకెళ్తున్న యంగ్ టాలెంటెడ్ హీరో వివస్వాన్ ఫోక్ లోర్ అడ్వెంచర్ ఫిలిం “మత్స్య” గ్లింప్స్

యంగ్ టాలెంటెడ్ హీరో వివస్వాన్ నటిస్తున్న ఫోక్ లోర్ అడ్వెంచర్ ఫిలిం "మత్స్య". ఈ చిత్రంతో వివస్వాన్ టాలీవుడ్ లోకి…

1 day ago

ఓటీటీలో అదరగొడుతోన్న ‘అమీర్ లోగ్’

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ మీద మాధవి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అమీర్ లోగ్’.…

1 day ago

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ “రోమాంచకం”

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన సినిమా "రోమాంచకం". సుమంత్ ప్రభాస్,…

3 days ago

త్వరలో స్ట్రీమింగ్ కు రాబోతున్న వరుణ్ సందేశ్, శ్వేతా బసుప్రసాద్ ఆహా ఒరిజినల్ “నా వైఫ్ మిస్సింగ్”

ఎప్పటికప్పుడు ఎగ్జైటింగ్ కంటెంట్ తో సబ్ స్క్రైబర్స్ ను ఎంగేజ్ చేస్తోన్న ఆహా ఓటీటీ ఇప్పుడు మరో ఎగ్జైటింగ్ సిరీస్…

3 days ago

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

5 days ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

5 days ago